శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా మహిళా సారథ్య అంకుర సంస్థలు: డాక్టర్ జితేంద్ర సింగ్
కొత్త డిఎస్టీ నిధి వెబ్ సైట్‌తో పాటు దేశమంతా 8 కొత్త నిధి ఐ-టిబిఐలను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అత్యాధునిక సాంకేతిక అంకుర సంస్థల దిశగా డీఎస్టీ - జిడిసి ఐఐటి మద్రాస్ ప్రణాళిక, ఆవిష్కరించిన శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అంకుర పరస్పరానుబంధ వ్యవస్థను బలోపేతం చేయడంలో డిఎస్‌టి నిధి కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది
మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించి , ఆర్థిక సార్వజనీనతను విస్తరించాలనేది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధత
ప్రధాని నిబద్దతకు గుర్తుగా నిధి 8 సంవత్సరాల వేడుకలు
Posted On:
06 SEP 2024 4:21PM by PIB Hyderabad
మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడతాయని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
డీఎస్టీ నిధి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీ ఐఐటీలో కొత్త డిఎస్టీ నిధి వెబ్ సైట్‌తోపాటు భారతదేశమంతటా 8 కొత్త నిధి ఐటిబిఐలను (inclusive technology business incubators- i TBIs) మంత్రి ప్రారంభించారు. వీటిని వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు.
8 కొత్త నిధి సార్వజనీన ఐ-టిబిఐలను (i-TBIs) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అజ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (రాజస్థాన్), గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ (పంజాబ్), బిఎల్ డి ఇ (కర్ణాటక), అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం, ప్రణ్వీర్ సింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఉత్తర ప్రదేశ్), గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయం (బిలాస్పూర్), జిఎస్ ఎస్ ఎస్ విమెన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (కర్ణాటక), పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ విశ్వవిద్యాలయం (డెహ్రాడూన్) లలో ఏర్పాటు చేశారు.
డీఎస్టీ సహకారంతో నడిచే ఈ ఐ- టిబిఐ మూడు సంవత్సరాల కార్యక్రమం-
విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో, స్థానికుల్లో- శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పట్ల, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడం పట్ల ఆసక్తిని పెంపొందించే కార్యక్రమం.
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ, భూ విజ్ఞానశాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది- ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల ( స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఆధునిక సాంకేతిక అంకుర సంస్థల కోసం డిఎస్టీ - జిడిసి ఐఐటి మద్రాస్ ఇంక్యుబేట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఐఐటి మద్రాస్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ పూర్వ విద్యార్థులైన డాక్టర్ గురురాజ్ దేశ్‌పాండే, శ్రీమతి జైశ్రీ దేశ్‌పాండే శ్రీ 'క్రిస్' గోపాలకృష్ణన్ లు జిడిసికి నిధులు అందించారు. ఈ కార్యక్రమాలను ఎక్కువగా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆవిష్కర్తలకు మద్దతును అందించడానికి, ఎదుగుతున్న క్రమంలో క్లిష్టమైన దశలో ఉన్న అంకుర సంస్థలకు అవసరమైన సహాయం అందించడానికి దీనిని ఉద్దేశించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్, స్టార్టప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమం కోసం ప్రధాని మోదీ చేసిన మార్గనిర్దేశాన్ని గుర్తు చేశారు. ఈ లక్ష్యంలో భాగంగానే 2016లో డిఎస్టీ.. నిధిని ప్రారంభించారు.
నిధి ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “మన విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికీ, దేశంలోని ఆవిష్కరణల రంగంలో ఏర్పడిన క్లిష్టమైన సమస్యను అధిగమించేందుకు ఈ నిధి కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మన విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి పరిశోధనలను చేస్తున్నందున, వాటి ఆలోచనల్ని మార్కెట్ ఉత్పత్తులుగా మలచాలని ఆయన అన్నారు. అంకుర సంస్థల విజయానికిగాను ప్రారంభంలో చేయాల్సిన పరిశ్రమల అనుసంధానంపై కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సాంకేతిక పురోగతిపై ఆయన మార్గనిర్దేశనం చేశారు. కృత్రిమమేథ, క్వాంటం కంప్యూటింగ్ , నూతన ఇంధన రంగాలనేవి నేటి భారత్‌ను భవిష్యత్ భారత్‌గా మార్చడానికిగాను ఆవిష్కరణల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
నిధి కార్యక్రమం ప్రారంభమైన 2016 రోజుల్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి గుర్తుచేశారు. డిఎస్టీ నిధి కార్యక్రమం అంకుర సంస్థల పరస్పరాధిరత వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పలు సాంకేతిక అంకుర సంస్థలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. వాటిలో పలు సంస్థలకు మహిళా పారిశ్రామికవేత్తలు నేతృత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం వివరాలను తెలియజేసిన డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఇది సమగ్రమైన దశలవారీ మద్దతు వ్యవస్థను అందిస్తుందని, ఈ వ్యవస్థ అనేది విద్యారంగ వాతావరణానికి చెందిన ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా తయారైందని అన్నారు. నిధి ఎంట్రప్రన్యూర్ ఇన్ రెసిడెన్స్ ( ఇఐఆర్ ), నిధి ప్రయాస్ కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు.
నిధి కార్యక్రమాలతో అనేక ఉద్యోగాల కల్పన జరిగిందని, ఆవిష్కరణ సంస్కృతి వికసించడానికి అవి దోహదం చేశాయని, గణనీయమైన సంఖ్యలో మేధో సంపత్తి ఏర్పడిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
భారతదేశ వృద్ధి , స్వావలంబనపై కార్యక్రమ ప్రభావాన్ని ప్రతిఫలిస్తూ సాధించిన గణనీయమైన ఆర్థిక విజయాన్ని కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఆర్థిక సార్వజనీనతను విస్తరించేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కనబరిచిన నిబద్ధతను నిధి 8 సంవత్సరాల వేడుకలు ప్రత్యేకంగా చాటుతున్నాయి" అని డాక్టర్ సింగ్ అన్నారు.
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ వికసిత్ భారత్ సాకారం అయ్యేందుకు ఉన్న అవకాశాలను డాక్టర్ సింగ్ ప్రత్యేకంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ అంకుర సంస్థల దార్శనికతను ఆవిష్కరించారని అన్నారు. తద్వారా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ప్రపంచ ఆవిష్కరణల పోటీలో ముందంజలో ఉన్నాయని అన్నారు. భారతదేశంలో విజయవంతమైన అంకుర సంస్థలు... ప్రపంచంలో మరెక్కడైనా విజయం సాధిస్తాయన్న ప్రధాన మంత్రి మాటల్ని శ్రీ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.
మేథో పరమైన కార్యకలాపాలు ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాకుండా మార్కెట్‌కు చేరి, ప్రభావవంతమైన మార్పులను తీసుకొస్తాయని నిధి నిర్ధారిస్తోంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
***
(Release ID: 2052788)
Visitor Counter : 79