శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

క్యాన్స‌ర్ చికిత్స‌లో నూత‌న ఉష్ణ ఆధారిత విధానం కీమో థెర‌పీ డోసుల త‌గ్గుద‌ల‌

Posted On: 04 SEP 2024 1:39PM by PIB Hyderabad

క్యాన్సర్ చికిత్స కోసం - విద్యుదయస్కాంత శరీర ఉష్ణోగ్రత (మాగ్నెటిక్ హైపోథెర్మియా)నూ, అతి సూక్ష్మ విద్యుదయస్కాంత సూక్ష్మ కణాలను (MDలు)హీట్ షాక్ ప్రోటీన్ 90 ఇన్హిబిటర్ (HSP90i) క‌ల‌యిక‌ను త‌గిన మోతాదులో పరిశోధకులు ఉపయోగించారు. అవసరమైన కీమోథెరపీ మోతాదును తగ్గించడం ద్వారా చికిత్స సామర్థ్యాన్ని ఈ సాంకేతికత గణనీయంగా పెంచుతుంది. ఇది దుష్ప్రభావాలను తగ్గించే సహాయక చికిత్సగా ఉపయోగపడుతుంది.

 

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నందునకొత్త చికిత్సా పద్ధతుల అవసరం చాలా కీల‌కంగా మారింది. కీమోథెరపీశస్త్రచికిత్స వంటి సంప్రదాయ చికిత్సలు ఔషధ నిరోధకతకు దారి తీస్తున్నాయి. అంతే కాదు తీవ్రమైన దుష్ప్రభావాల కార‌ణంగా వాటికి ప‌రిమితులు ఏర్ప‌డ్డాయి. ఈ సవాళ్లను పరిష్కరించడానికిమ‌న శాస్త్ర‌వేత్త‌లు తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉండే నానోథెరపీ వంటి వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తున్నారు. 

 

మొహాలీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (INST)  కేంద్ర శాస్త్ర సాంకేతిక‌శాఖ‌కు చెందిన‌ స్వయంప్రతిపత్త సంస్థ.  ఈ సంస్థ‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు   హీట్ షాక్ ప్రోటీన్ 90 (HSP90)  నిరోధకం అయిన 17 డిఎంఏజిని( 17-DMAG ) , మాగ్నెటిక్ హైపోథెర్మియా-ఆధారిత క్యాన్సర్ థెరపీ (MHCT)తో కలిపి త‌యారు చేసిన కాంబినేష‌న్ థెర‌పీ ద్వారా వేడి-ఆధారిత క్యాన్సర్ చికిత్సల ప్రభావాన్ని మెరుగుపరుస్తున్నారు. 

 

క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్షన్లు ఇచ్చి కాంబినేష‌న్ థెర‌పీ ద్వారా జంతు నమూనాలపై ప్రయోగాలు చేశారు. ఇందులో ఎలుక గ్లియోమా మోడల్‌లో గరిష్ట గ్లియోమా క‌ణాలు (క్యాన్సర్ కణాలుగా మారేవి) మ‌ర‌ణించాయి. 8 రోజులలోపు ట్యూమర్ నిరోధకత రేట్లు  ప్రాధ‌మిక‌ద్వితీయ‌ క్యాన్సర్ ఉన్న కణజాలంలో వరుసగా 65% , 53%కి చేరాయి.

 

ఏపీఎస్  నానోలో ప్రచురిత‌మైన‌ పద్ధతి తక్కువ హానికరం. తక్కువ దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఎంఎన్ పీలుప్రత్యామ్నాయ అయస్కాంత క్షేత్ర ప్ర‌భావానికి (AMF) గురైనప్పుడుకణతులను సమర్థవంతంగా ఎదుర్కోగలవని పరిశోధనా బృందం నిరూపించింది. ఈ మిశ్రమ మాగ్నెటిక్ హైపెథెర్మియా ,  కీమోథెరపీ (MHCT) విధానం అవసరమైన మొత్తంలో కీమోథెరపీని తగ్గిస్తుంది. కాన్స‌ర్  చికిత్సను సురక్షితంగా,  మరింత ప్రభావవంతంగా చేస్తుంది. దీనికి అదనంగాఈ చికిత్స రెండో స్థాయి క్యాన్స్ కణజాలంలో అదనపు మోతాదు అవసరం లేకుండా సుదూర కణతులకు చికిత్స చేయగలదు. దాంతో ఇది అత్యంత ప్రభావవంతమైన క్యాన్సర్ చికిత్సగా  పేరు పొందుతోంది. 

 

ఈ నూత‌న‌ చికిత్సను అమ‌ల్లోకి తేవ‌డానికిగాను ప్రపంచ వ్యాప్తంగా విస్తృత‌ పరిశోధన అవసరం. ఇది సహాయక లేదా ప్రత్యామ్నాయ క్యాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయగలదు. ఈ అధ్యయనం మరింత సమర్థవంతమైనభ‌రించ‌గ‌లిగే క్యాన్సర్  చికిత్సలకు మార్గం సుగమం చేస్తుందిఈ చికిత్స మిలియన్ల మంది రోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు హైపోథెర్మియా ఆధారిత చికిత్సలకు కొత్త దిశను అందిస్తుంది.

 

ఈ సవాలును పరిష్కరించడానికిడాక్టర్ దీపికా శర్మ నేతృత్వంలోని పరిశోధనా బృందం HSP90 అనే జీన్ పాత్రపై పరిశోధ‌న‌లు చేసింది. ఈ జీన్‌ వేడి ఒత్తిడికి ప్రతిస్పందనగా నియంత్రిత‌మ‌వుతుంది. ఔషధం 17-DMAGని ఉపయోగించి HSP90ని నిరోధించడం ద్వారావారు వేడి-ప్రేరిత నష్టాన్ని సరిచేసే కణాల సామర్థ్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త‌ద్వారా మెరుగైన క్యాన్సర్ కణతి క‌ణాలు మ‌ర‌ణిస్తున్నాయి.

 

వారి కృషి  అసాధారణమైన ఉష్ణ ఉత్పత్తి సామర్థ్యాలతో అతి సూక్ష్మ విద్యుదయస్కాంత కణాలను సృష్టించడం,  HSP90 ఇన్హిబిటర్ డెలివరీని అవసరమైన స్థాయికి తీసుకుని రావడంపై దృష్టి సారించింది.

 

ఈ వినూత్న చికిత్స  ముఖ్య ప్రయోజనం రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే సామర్థ్యం రోగిలో క‌లగ‌డం. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా శరీర సహజ రక్షణను ఈ చికిత్స‌ మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ చికిత్సలో ఇంత‌కాలం సాధారణ సవాలుగా ఉన్న ఔషధ నిరోధకతను అధిగమిస్తారు. త‌ద్వారాఈ విధానం  క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో స‌రికొత్త చికిత్స‌గా నిల‌వ‌బోతున్న‌ది. 

ఈ చికిత్స కార‌ణంగా సైటోకైన్ స్రావం జ‌రిగి అది రోగనిరోధక ప్రతిస్పందనను క్రియాశీలం చేస్తుందని పరిశోధకులు ఊహిస్తున్నారు. అంతే కాదు ఈ చికిత్స‌ క్యాన్సర్ నిరోధక ప్రభావాలను మరింత మెరుగుపరుస్తుంది.

 

****



(Release ID: 2052098) Visitor Counter : 39