ఉప రాష్ట్రపతి సచివాలయం
జీవిత రణక్షేత్రంలో పోరాటానికి అవసరమైన శక్తిని, వివేకాన్నిపెంపొందించుకోండి : కేడెట్లకు ఉపరాష్ట్రపతి ఉద్భోద
ఈ ధరిత్రి ధైర్యవంతులది, ఆత్మవిశ్వాసం కలవారిదే. సోమరులది,బద్ధకస్తులది,అసమర్ధులది కాదు : ఉపరాష్ట్రపతి
ఆర్.ఐ.ఎం.సి పూర్వ విద్యార్థులు మార్గదర్శులుగా వ్యవహరించాలి, యువతలో జాతీయతాస్ఫూర్తిని నింపాలి : ఉపరాష్ట్రపతి
ప్రతికూల పరిస్థితులను సవాలుగా స్వీకరించి, వాటిని ఎదురొడ్డి నిలిచేవారు ధైర్యానికి, చొరవకు, నాయకత్వానికి ప్రతిరూపాలు : ఉపరాష్ట్రపతి
జీవితంలో ఓటమికి ఎన్నడూ భయపడకండి, అది విజయానికి తొలిమెట్టు : ఉపరాష్ట్రపతి
జాతీయ ప్రయోజనాలే పరమోన్నతంగా వ్యవహరించండి,
సగర్వంగా దేశానికి సేవ చేయండి : ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
01 SEP 2024 1:52PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ఈ రోజు డెహ్రాడూన్లోని రాష్ట్రీయ మిలటరీ కాలేజ్ (ఆర్ఐఎంసి) కేడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. కేడెట్లు, తమ సంస్థ నినాదమైన, బల్ వివేక్ ప్రాముఖ్యతను రుజువు చేయాలని అన్నారు. ప్రతివారూ శక్తిని, వివేకాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే వారు జీవితంలోని పెద్ద పెద్ద పోరాటాలను సైతం ఎదుర్కోగలరని ఆయన అన్నారు. “ శక్తి, నైతిక కార్యాచరణలది గొప్ప కలయిక అని, సవాళ్లు ఎదురైనప్పుడు ఇది తిరుగులేని శక్తిగా మారుతుంది’’ అని ఆయన అన్నారు.
ఎలాంటి పరిస్థితిలోనైనా జాతీయ ప్రయోజనాలే పరమోన్నతంగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. “ సగర్వంగా, భయ రహితంగా దేశానికి సేవచేయండి, భారత మాత మిమ్మల్ని పిలుస్తోంది. దేశ భవిష్యత్తు మీ భుజస్కంధాలపై ఉంది. ఎల్లవేళలా దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా చూడండి. క్రమశిక్షణ ,హుందాతనం, కరుణను ప్రతిబింబించేదిగా మీ నడవడిక ఉండాలి’’ అని ఆయన అన్నారు.
డెహ్రాడూన్లో ఈరోజు ఆర్ఐఎంసీ కేడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి, ఆర్ఐఎంసి పూర్వ విద్యార్ధులు, అధ్యాపక సిబ్బంది మార్గదర్శులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. యువతలో జాతీయతా స్ఫూర్తిని నింపాలని కోరారు.అంతర్జాతీయంగా భారత్ మున్నెన్నడూ లేనంత కీలక స్థాయికి చేరడాన్ని, దేశం గణనీయ ఆర్ధిక ప్రగతి, అభివృద్ధి ప్రస్థాన వాస్తవాలను గుర్తించ నిరాకరించే శక్తులు, వాస్తవ స్థితిగతులతో ఏమాత్రం సంబంధం లేని శక్తుల చర్యలను నిర్వీర్యం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1962 డిసెంబర్ 10 వ తేదీన ఆర్ఐఎంసి కేడెట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణన్, చెప్పిన అద్భుతమైన మాటలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. “ ఈ ధరిత్రి ధైర్యవంతులది, ఆత్మవిశ్వాసం కలవారిదే. సోమరులది,బద్ధకస్తులది,అసమర్ధులది కాదు. విపరీతమైన పోటీ, ప్రత్యర్థులు కలిగిన నేటి ప్రపంచంలో మనలో ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ, త్యాగంతో కూడిన జీవితాన్ని అలవరుచుకోవాలి. ఈ గొప్ప విలువలను జీవితలో గుర్తుంచుకోవాలి” అని ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను పునరుద్ఘాటించారు.
ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని కేడెట్లను ప్రోత్సహిస్తూ ఉపరాష్ట్రపతి, “ ప్రియమైన నా యువ కెడెట్ లారా, మీ మీ వ్యక్తిగత , వృత్తిపరమైన ప్రయాణంలో మీకు పరీక్షగా నిలిచే ఎన్నో సందర్భాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ సహనం సన్నగిల్లి ,ఓర్పు నశించే రోజులూ రావచ్చు , మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ శిక్షణలో, రాగల సంవత్సరాల్లో అటు జీవితంలో మీవైన పోరాటాలు చేయాల్సి రావచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రతికూల పరిస్థితులను సవాలుగా స్వీకరించి, వాటిని ఎదురొడ్డి నిలిచేవారు ధైర్యానికి, చొరవకు, నాయకత్వానికి ప్రతిరూపాలుగా నిలుస్తారు”.అని ఉపరాష్ట్రపతి అన్నారు.
విఫలమవుతామన్న భయం, పురోగతిని చంపేస్తుందని అంటూ ఉపరాష్ట్రపతి, “జీవితంలో ఎప్పుడూ వైఫల్యానికి భయపడకండి. విజయానికి అది తొలిమెట్టు. భయం గురించిన భయం, మీ ప్రతిభకు ప్రతిబంధకం, అది మీ శక్తిని మీకు తెలియకుండా చేస్తుంది. అందుకే , మన ప్రగతి ప్రస్థానంలో భయం ఒక భాగంగా ఉంటుందని గుర్తుంచుకోండి” అని ఆయన అన్నారు.
చంద్రయాన్ మిషన్ విజయగాథను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ చరిత్రాత్మక చంద్రయాన్ మిషన్లను చూడండి, చంద్రయాన్ 2 చాలా వరకు విజయవంతమైంది, కాని పూర్తి గా కాదు. కొందరి దృష్టిలో ఇది వైఫల్యం. కానీ అర్ధం చేసుకున్న వారికి ఇది విజయానికి పడిన ముందడుగు. గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్ –3 చంద్రమండలం దక్షిణ ధృవంపై దిగడం మనందరికీ తెలుసు.దీనితో భారతదేశం ఈ రకమైన విజయాన్ని సాధించిన మొదటి దేశంగా రికార్డు సాధించింది ” అని ఆయన అన్నారు.
ఆర్ఐఎంసి సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇలాంటి చర్యలు స్త్రీ ,పురుష సమానత్వం, సమాన న్యాయం దిశగా పడిన గొప్ప ముందడుగుకు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. “ మన దేశ మహిళలు పోరాట విమానాలను నడుపుతున్నారు, అంతరిక్ష యాత్ర మిషన్లలో కీలకపాత్రధారులుగా ఉన్నారు, అన్ని అవరోధాలనూ అధిగమించి ఊహించని రీతిలో మహిళలు ముందుకు సాగుతున్నారు లోక్ సభ, రాష్ట్రాల చట్టసభలలో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు గొప్ప మార్పునకు దారితీసే పరిణామం” అని ఉపరాష్ట్రపతి అన్నారు.
***
(रिलीज़ आईडी: 2050863)
आगंतुक पटल : 79