సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"జమ్మూ కాశ్మీర్ లో మూలాల వరకు ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసిన ప్రధానమంత్రి: డాక్టర్ జితేంద్ర సింగ్


73వ, 74వ రాజ్యాంగ సవరణలు మిగతా దేశమంతా స్థానిక స్వపరిపాలనకు అవకాశం కల్పించినా, 370 అధికరణ, 35ఏ నిబంధన వల్ల జమ్మూకాశ్మీర్ లో మాత్రం ప్రత్యేక హోదా ఉంది. ఇది స్వపరిపాలనకు అవకాశం కల్పించలేదు: డాక్టర్ సింగ్



"మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే నిజమైన స్థానిక స్వపరిపాలన జమ్మూకాశ్మీర్ లో సాకారం అయింది"



"మొట్టమొదటి సారి జిల్లా పరిషత్ ఎన్నికలు: జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక మలుపు", సంతోషం వ్యక్తం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్



"ఆర్టికల్ 370పై ప్రతిపక్షాల బూటకపు మాటలు ఇకపై జమ్మూ కాశ్మీర్ పౌరులను ముఖ్యంగా యువతలో ప్రతిధ్వనించవు అన్న కేంద్ర మంత్రి’’



ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ యువత ప్రజాస్వామ్య ఉత్సాహంలో కొత్త ఒరవడికి నాయకత్వం వహిస్తుంది: స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 01 SEP 2024 5:09PM by PIB Hyderabad

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన చరిత్రాత్మక పరివర్తనను  కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)పీఎంఓఅటామిక్ ఎనర్జీస్పేస్సిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్ల శాఖ సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్  దూరదర్శన్ న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో మూలాల వరకు  ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్లడం ప్రధాని నరేంద్ర మోడీ ఘనత అని అన్నారు. 
 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ గ్రాస్ రూట్ ప్రజాస్వామ్యం కొత్త శకానికి నాంది పలికింది" అని తెలిపారు. 

 

 

 నిజమైన స్థానిక స్వపరిపాలనకు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు. 73, 74వ రాజ్యాంగ సవరణలు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనను తీసుకువచ్చినప్పటికీఆర్టికల్ 370, 35A అందించిన ప్రత్యేక హోదా ముసుగులో జమ్మూ కాశ్మీర్  ప్రజలు ఈ హక్కుల విషయంలో తిరస్కరణకు గురయ్యారని ఆయన అన్నారు.

"స్వయం పాలన" లేదా "స్వయంప్రతిపత్తి" ఛాంపియన్లుగా చెప్పుకునే ప్రాంతీయ రాజకీయ పార్టీలుపంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులకు కూడా వాటిని అందకుండా పరిహాసం చేసారని కేంద్ర మంత్రి తెలిపారు. 
 

ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి తప్పుడు కథనాల్ని ప్రచారంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను డాక్టర్ జితేంద్ర సింగ్ గట్టిగా తోసిపుచ్చారు. ఈ బూటకపు మాటల్ని ఇకపై జమ్మూ కాశ్మీర్  ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. " పొత్తులను మార్చడంశుష్క వాగ్దానాలు చేయడం వంటి పాత కాలపు కుయుక్తులను వాళ్లు చూశారని అన్నారు. మునుపటి రెండు తరాల నిస్సహాయ దుస్థితిని చూసిన కొత్త తరం ఓటర్లతో ఇది సాధ్యంకాదు" అని ఆయన స్పష్టం చేశారు.

"గత అయిదేళ్లలోవారు ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాను చూశారు. వేలెత్తి చూపలేని పాలన ఎంతో ప్రయోజనాన్ని కలిగించిందన్న వాస్తవాన్ని తిరస్కరించలేరు.  ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని కాదనలేరు" అని కేంద్ర మంత్రి తెలిపారు. 
 

"ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ యువత ప్రజాస్వామ్య ఉత్సాహంలో కొత్త ఒరవడికి నాయకత్వం వహిస్తుంది" అని ఆయన అన్నారుదశాబ్దంలో తొలిసారిగా జరగనున్న జమ్మూ కాశ్మీర్ కి రాబోయే ఎన్నికల విజయంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలతో సహా ఇటీవలి ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం ద్వారా ఈ ప్రాంతంలోని శక్తిమంతమైన ప్రజాస్వామ్యం మళ్లీ వికసించబోతోందని అన్నారు. ఇక్కడ జాతీయ సగటు 60 శాతానికి  దాదాపుగా సరిపోలిందని ఆయన చెప్పారు. 

 జమ్మూ కాశ్మీర్ లో మునుపటి ఎన్నికల్లో ఎంపీలుఎమ్మెల్యేలుగా ఎన్నికైన అభ్యర్థులు 8-10 శాతం ఓట్లను పొందడం గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికలకు అవసరమైన ఓట్లకు కనీస పరిమితిని ప్రతిపాదించారుఅయితే రాచరిక రాజకీయాలను కొనసాగించడంలో స్వార్థ ప్రయోజనాలను కలిగి ఉన్నవారు దీనిని ప్రతిఘటించారు. దశాబ్దాల తప్పుడు పాలన తర్వాత వారి ప్రజాస్వామిక ఆకాంక్షలను తెరపైకి తెచ్చిజమ్మూ కాశ్మీర్ ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి అంశం ప్రధాని మోడీ సంస్కరణలు మార్చాయని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే పనిని పూర్తి చేశారు. ఆర్టికల్ 370 రద్దుఏడు దశాబ్దాలుగా పౌరసత్వ హక్కులను కోల్పోయిన వారికి పౌరసత్వ హక్కులను తెచ్చి పెట్టింది. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జమ్మూ కాశ్మీర్ ఒక దిక్సూచిగా ఎదగడానికి వేదికను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.

"రాబోయే సంవత్సరాల్లోజమ్మూ కాశ్మీర్ యావత్ దేశ పరివర్తనకు దారి చూపుతుంది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుజమ్మూ కాశ్మీర్ లో కొత్త శకానికి పునాది వేసిందనిఇక్కడ ప్రజల వాణిని వినిపించివారి హక్కులు పూర్తిగా సాకారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌తో కూడిన నాయ‌క‌త్వంలో జమ్మూ కాశ్మీర్ భార‌త‌దేశ వృద్ధికి త్వ‌ర‌లోనే నేతృత్వం వ‌హించే స్థితికి వ‌స్తుంద‌ని ఆయన పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 2050851) Visitor Counter : 51