రక్షణ మంత్రిత్వ శాఖ
వైమానిక దళం ఉప ప్రధానాధికారి గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ పదవీబాధ్యతల స్వీకారం
Posted On:
01 SEP 2024 11:31AM by PIB Hyderabad
భారత వాయుసేన (ఐఏఎఫ్) డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (డీసీఎఎస్) గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయు సేన ప్రధాన కేంద్రం వాయు భవన్ లో పదవీబాధ్యతలను ఈ రోజున స్వీకరించారు. ఆయన తన నూతన పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత, న్యూ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్దకు చేరుకొని, జాతి రక్షణలో ప్రాణత్యాగానికైనా వెరవక అమరులైన శూరుల స్మృతిలో పూల మాలను సమర్పించి శ్రద్ధాంజలిని ఘటించారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమి పూర్వ విద్యార్థులలో ఒకరైన ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ను 1987 జూన్ 13న భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) కు చెందిన యోధుల దళంలో నియమించారు. ఆయన ‘ఎ’ కేటగిరి అర్హత కలిగిన, ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్ కూడా. విమానాలను నడపడంలో 4500 గంటల అనుభవం ఆయనకు ఉంది. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీ లో పూర్వ విద్యార్థి అయిన శ్రీ తేజిందర్ సింగ్ ఒక ఫైటర్ స్క్వాడ్రన్ కు, ఒక రేడార్ స్టేషన్ కు, ఒక ముఖ్య పోరాట స్థావరానికి ఆయన నాయకత్వం వహించడమే కాకుండా, జమ్ము- కశ్మీర్ కు ఎయిర్ ఆఫిసర్ కమాండింగ్ గా కూడా విధులను నిర్వహించారు. ఆయనను వరించిన విభిన్న స్టాఫ్ నియామకాలలో కమాండ్ హెడ్ క్వార్టర్స్ (హెచ్ క్యు)లో ఆపరేషనల్ స్టాఫ్, వాయు సేన ప్రధాన కేంద్రం (ఎయిర్ హెచ్ క్యు) లో ఎయిర్ కామ్ డార్ (పర్సనెల్ ఆఫిసర్స్-1) , హెచ్ క్యు ఐడీఎస్ లో డిప్యూటీ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, ఫైనాన్శల్ (ప్లానింగ్), ఎయిర్ కామ్ డార్ (ఎయరోస్పేస్ సేఫ్టి), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ (అఫెన్సివ్) లతో పాటు ఎయిర్ హెచ్ క్యు లో ఎసిఎఎస్ ఆపరేషన్స్ (స్ట్రాటిజి) లు ఉన్నాయి.
ఆయన తన వర్తమాన నియామకాని కన్నా పూర్వం, మేఘాలయ లోని షిల్లాంగ్ లో ఉన్న ఐఏఎఫ్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రధాన కేంద్రంలో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా విధులను నిర్వర్తించారు.
ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ ను ఆయన ప్రతిభాన్విత సేవలకు గుర్తింపుగా 2007వ సంవత్సరంలో వాయ సేన మెడల్ తో సన్మానించారు. 2022వ సంవంత్సరంలో అతి విశిష్ట్ సేవా మెడల్ ను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కు ప్రదానం చేశారు.
***
(Release ID: 2050840)
Visitor Counter : 65