ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డెహ్రాడూన్ లో సీఎస్ఐఆర్- ఐఐపీలో ఉపరాష్ట్రపతి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 31 AUG 2024 7:52PM by PIB Hyderabad

శ్రీ అంజుమ్ శర్మఅడ్మినిస్ట్రేషన్ సీనియర్ కంట్రోలర్అధ్యాపకులుసిబ్బందిఅందరికంటే ముఖ్యంగానా ప్రియమైన విద్యార్థులారా!

 

భారతదేశంలోని 11 రిఫైనరీలు, రెండు విదేశీ రిఫైనరీలలో ఎల్పీజీ స్వీటెనింగ్ కేటలిస్ట్ ఊహించుకోండి. ఎంతటి ప్రదర్శన! ఈ సంస్థలో కొత్త పరిశోధన,  అభివృద్ధి చర్యలను గమనించండి. ఇవి సంపూర్ణంగా భారత ప్రభుత్వ  వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. అలాగే 2070 నాటికి ఉద్గారాల రహిత లక్ష్యానికిఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు కూడా అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికిఇది పారిస్ ఒప్పందం సందర్భంలో మన ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను ప్రతిబింబిస్తోంది. 

ఇప్పుడు భారత్ దిశానిర్దేశం చేస్తోంది. డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి మొదటి భారతీయ ప్రయోగాత్మక విమానంలో ఉపయోగించిన సుస్థిర విమాన ఇంధనాన్ని చూడండి … అది ఎంత అద్భుతమో 2019, 2024ల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో దాని విన్యాసాలు చూసే  అవకాశం నాకు లభించింది. ఇక్కడ కూడా అదే ప్రతిబింబించింది.

మిత్రులారావిస్తృత ప్రభావాన్ని కలిగించే సాంకేతికతను చూడండి. ముడి బయోగ్యాస్‌ను పైప్‌లైన్ నేషనల్ గ్యాస్‌గా మార్చడానికి ఆధునిక వాక్యూం ప్రెషర్ స్వింగ్ శోషిత సాంకేతికత (వీపీఎస్ఏ)ను అభివృద్ధి చేసింది. ఇది సులభం కాదుఅయినా తప్పనిసరి. మీరు ఎంతో సాధిస్తే తప్ప ప్రజలు మీ ఆలోచనలను గ్రహించలేరు. జాబితా చాలా పెద్దది అయినప్పటికీ నేను మరో రెండింటి గురించి ప్రస్తావిస్తాను.

ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలను తగ్గించడం కోసం పైన్ చెట్ల సూదంటు ఆకులను ఉపయోగించి జీవ ఇంధనాలను తయారు చేయడం ఇందులో ఒకటి. అగ్నిప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా పరిణమించిన నేపథ్యంలో, ప్రపంచం ఈ సమస్యతో పోరాడుతోంది. భయంకరమైన ఈ సమస్య పరిష్కారానికి మీ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో  కూడిన పరిష్కారాన్ని అతి సమీప కాలంలోనే వెదుకుతుందని నమ్ముతున్నాను. మానవ వనరుల కోణంలో మీరు కచ్చితంగా ఒక అద్భుతమైన పని చేశారు. హైడ్రోకార్బన్పెట్రోకెమికల్ ఆటో మొబైల్ పరిశ్రమల రంగంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పని వల్ల.. మీ సంస్థ ద్వారా మానవ వనరుల సాధికారతతద్వారా పర్యావరణ హితానికీ ఎంతో మేలు చేస్తున్నారు.

నా యువ మిత్రులారాదేశంలో జరుగుతున్న శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న మీ సంస్థకి రావడం, మీ అందరి మధ్య ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఒక విషయం చెప్పగలను. నేను ముందే ఊహించాను కూడా. డైరెక్టర్ ఏం సూచించారు? వికసిత్ భారత్ కోసం నడిచే ఒక ఇంజిన్ కావాలి. అది ఎలాంటి ఇంజిన్ అంటే- ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఒక భారీ వ్యవస్థను సృష్టించగలిగిన, శక్తిమంతమైన ఇంజిన్ అవసరం.

మిత్రులారాఉత్తరాఖండ్ లో గంభీరమైన హిమాలయాలుస్వచ్ఛమైన నదులుపచ్చని అడవులు... ప్రకృతితో మనకున్న బంధాన్ని గుర్తు చేస్తాయి. ఇది ప్రమాదంలో ఉంది. అథర్వణ వేదం- పృథ్వీ సూక్తంలో చెప్పిన జ్ఞానాన్ని ప్రకృతి గానం చేస్తున్నట్లుంది. నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అది ఏమంటున్నది? "మాతా భూమిః పుత్రో అహం పృథివ్యా". నేను అనువదిస్తాను. భూమి మన తల్లిమనం ఆమె పిల్లలం. ఈ ప్రాచీన జ్ఞానం మన భూమిని కాపాడేపరిరక్షించే బాధ్యతను ఇది ప్రభోదిస్తోంది. 

మిత్రులారాఇది వాతావరణ మార్పుల ముప్పుకు హెచ్చరిక అని నేను మీకు గుర్తు చేస్తున్నాను . మనం నివసించడానికి మరొక గ్రహం లేదని ఎప్పటికీ మర్చిపోవద్దు. మనకు గత్యంతరం లేనందున ఈ భూగోళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములందరూ తమకు చేతనైనంత సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ సంస్థ తన వంతు కృషి చేస్తోంది. అభినందనలు.

1960 లో ఏర్పాటయిన ఈ సంస్థ పరిశోధన, అభివృద్ధి సంస్థగా అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచింది. పరిశ్రమకు మద్దతు ఇస్తూ,  సంస్థ ఏర్పరచుకున్న అంతర్జాతీయ భాగస్వామ్యాలు సాధించిన పేటెంట్లు అవార్డులను మేం గమనించాం. ఇది నిజంగా అభినందనీయం.

దేశ నిర్మాణానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. మొక్కల నుండి ఉత్పన్నమైన పదార్థాలు వ్యర్థాల నుండి జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి పేటెంట్ పొందిన ఒకే దశ ఉత్ప్రేరక ప్రక్రియను అభివృద్ధి చేసినందుకు మీ సంస్థను నేను అభినందిస్తున్నాను. వ్యర్థాలను సంపదగా మార్చాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. మీ అడుగు ప్రధాని దార్శనికతను సాకారం చేయడానికి వేసిన  అడుగు. స్వచ్ఛమైన ఇంధనంసుస్థిర భవిష్యత్తు కోసం మన అన్వేషణలో ఈ పురోగతి కీలకం. శుభ్రమైన ఇంధనం మరొక ఎంపిక మాత్రమే కాదుఅది ఏకైక ప్రత్యామ్నాయం. అది లేకపోతేమనం మన ఉనికికి విఘాతం కలిగించే సవాలును ఎదుర్కొంటాం. అలాగేసుస్థిరమైన భవిష్యత్తుకు కూడా ఇదే వర్తిస్తుంది. విశ్లేషించాల్సిన అవసరం లేదుకానీ అది మాత్రమే వృద్ధికి ఏకైక మార్గంమరే ఇతర వృద్ధి యంత్రాంగం అయినా భూగోళానికి హాని కలిగిస్తుంది. 

మిత్రులారామునుపెన్నడూ లేని విధంగా మన ప్రపంచం నేడు అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటోందివీటికి భాగస్వామ్య పరిష్కారాలు అవసరం. వాతావరణ మార్పులుజీవవైవిధ్య నష్టంవనరుల క్షీణత మన ఉనికికే ముప్పుగా పరిణమించాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అవి మన దగ్గరా జరుగుతున్నాయి. అవి మన సరిహద్దులకు ఆవాలా జరుగుతున్నాయినిస్వార్థంగా పనులు కావాలి. అందుకు ఇలాంటి సంస్థలు కావాలి. ఇలాంటి ప్రయోగశాలలుసమష్టిగా కలిసి మెలిసి పని చేయడానికి ఇలాంటి సంస్థలు వేదికగా ఉంటాయి.  

 

గతంలో లేని విధంగా ప్రపంచం ఇప్పుడు పరస్పర అనుసంధాన ప్రపంచంగా మారింది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏం జరిగినా ఇప్పుడు మనకు తెలిసిపోతోంది. అది మనను ప్రభావితం చేస్తోంది. ఇది మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ సవాళ్లు సరిహద్దులు దాటుకుని వస్తాయి. ప్రపంచంలోని ఏ మూలనో జరిగే భారీ అగ్ని ప్రమాదాల వల్ల మనం ప్రత్యక్షంగా ప్రభావితం కాకపోవచ్చుకానీ పరోక్షంగా మనం ప్రభావితమవుతాం. అవి ముందుగా ఎవరిని తాకుతాయి? ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలహీనమైన సమూహాలనుపర్యావరణ వ్యవస్థలను తాకుతాయి.

ప్రపంచ నాయకత్వంలో- ఇంధన పరిరక్షణవాతావరణ న్యాయం అన్ని స్థాయుల్లో జరుగుతున్నది. మనం కూడా ప్రకృతి కేంద్రీకృత విధానాలను అవలంబించాలి. ఇవి మన నాగరికతలోమన గ్రంథాలలో లోతుగా పాతుకుపోయిన అంశాలే. అదృష్టవశాత్తూప్రపంచస్థాయిలోజరుగుతున్నఈ ప్రయత్నాల్లో భారతదేశ నాయకత్వం హర్షించదగినది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిష్ఠాత్మక పునరుత్పాదక ఇంధన లక్ష్యాల నుండి పర్యావరణ పరిరక్షణతో ఆర్థికవృద్ధిని సమతుల్యం చేసే కార్యక్రమాల వరకు సుస్థిర అభివృద్ధి,  పర్యావరణ నిర్వహణకు ప్రభుత్వం అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించింది.

ఈ దేశం వెలుపలి నుండి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపునరుత్పాదక ఇంధనం  సాధారణ వినియోగంగా మారుతున్నట్లు గుర్తించినప్పుడు ఆశ్చర్యపోతారు. ఇది కొత్త కట్టుబాటు. ఇది రైతుకుగ్రామానికిసుదూర మూలకు చేరింది. పరిశుభ్రమైన పునరుత్పాదక ఇంధన  పరివర్తన సుస్థిర అభివృద్ధికి మూలస్తంభంఇది వాతావరణ మార్పు ప్రభావాలను తగ్గిస్తుంది. అదే సమయంలో ఆర్థికవృద్ధి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. 

స్వచ్ఛమైనపునరుత్పాదక ఇంధనం గాడిలో పడకపోతే అభివృద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలు వృథా అవుతాయి. మన ప్రయత్నాలను కాపాడుకోవడానికిమన ప్రయత్నాల ఫలాలను సాధించడానికి- మన నిబద్ధత పూర్తిగా అత్యున్నత స్థాయిలో ఉండాలి. 2023లో జి 20 శిఖరాగ్ర సమావేశంలో గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ను ప్రారంభించడం వంటి చర్యల ద్వారా మన దేశపు నిబద్ధతను ప్రపంచం గుర్తించింది. ఇది చరిత్రాత్మక పరిణామం. దీనిని అందరూ మెచ్చుకున్నారు.

సుస్థిర ఇంధన భవిష్యత్తుతద్వారా సుస్థిర అభివృద్ధితద్వారా నివాసయోగ్యమైన భూగోళం  దిశగా జీ20 సదస్సులో భారత్ ముందడుగు వేసింది. 2070 నాటికి కార్బన్ ఉద్గారాల విషయం లో తటస్థంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ తన రవాణా రంగంలో జీవ ఇంధన వినియోగాన్ని విస్తరిస్తోంది. ఇది ఆదరణ పొందుతోందని మీరు ప్రతిరోజూ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. వీటి వాడకానికి అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాలు ఒకప్పుడు కల మాత్రమే, కానీ నేడు వాస్తవం. ఇవి అసాధారణస్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. 2014లో ఎర్రకోట నుంచి ప్రధాని మాట్లాడిన సర్క్యులర్ ఎకానమీ ఒక విప్లవాత్మక క్షణంగా మారింది. మన చర్యలన్నింటిలోనూ ఇది ఎక్కువ ప్రాముఖ్యతను పొందుతోంది. అయితే మిత్రులారాసహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంపరిరక్షించడంపై కూడా మనం దృష్టి సారించాలి. అవి పరిమితమైనవిఅవి ప్రకృతి ప్రసాదించినవిఅవి ఒక వ్యక్తి ప్రయోజనం కోసం కాదు. మనం ఆ వనరుల సంరక్షణకు బాధ్యత వహిస్తున్నాం.   

కాబట్టి సహజవనరులను సద్వినియోగం చేసుకోవడంపరిరక్షించడం జరగాలి. వాస్తవ కనీస అవసరాల ఆధారంగానే వినియోగం జరగాలి. దాన్ని మన ఆర్థిక స్తోమత నియంత్రించకూడదు. తమ ఆర్థిక బలంతో ప్రకృతి వనరులను ఉపయోగించే వారికి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. వారు ఈ భూమిలో భాగమని ఎప్పటికీ మరచిపోకూడదు. అలాగే వారు  ఈ వ్యవస్థలో భాగమే. సహజవనరులు అందరూ  సమానంగా వినియోగించాలి తప్ప అసమానంగా వినియోగించకూడదు.

మిత్రులారాజాతీయ ప్రణాళికలో సుస్థిరతను ఏకీకృతం చేయడంహరిత కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులుపర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యమిచ్చే  ప్రాధాన్యతా పథకాలు అభివృద్ధి పట్ల భారతదేశ సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తాయి. గత బడ్జెట్‌ను చూడండిఇది రెండు కారణాలతో చరిత్ర సృష్టించింది. ఇది పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రి రూపొందించిన తొలి బడ్జెట్. రెండోది.. దివంగత మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి ఒకే ఆర్థికమంత్రి వరసగా ఏడోసారి సమర్పించిన బడ్జెట్ గా చరిత్ర సృష్టించింది. ఇద్దరూ ఒక మధ్యంతర బడ్జెట్ ను అందించారు. 

అక్కడ దృష్టి స్థిరమైన అభివృద్ధిపర్యావరణ రక్షణసమగ్ర అభివృద్ధిపై ఉంది. మిత్రులారామనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాం. ఇది నిజంనేను 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. యువతకు అప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలియదు.  యువ మిత్రులారాఅప్పటి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం లండన్పారిస్ ఆర్థిక వ్యవస్థల పరిమాణం కంటే చిన్నది. మీరు ఊహించగలరాఅంత పెద్ద దేశం, 1990 లో ఆర్థిక వ్యవస్థ పరిమాణం లండన్ లేదా పారిస్ ఆర్థిక వ్యవస్థ కంటే చిన్నది. ఒక దశాబ్దం క్రితంమనం బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాం. ఇప్పుడుఈ రోజునమనం అయిదో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం.

ప్రపంచ కొనుగోలు శక్తిలో మనం మూడో స్థానంలో ఉన్నాం. మరో రెండు మూడేళ్లలో మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ పెరుగుదల సుస్థిర అభివృద్ధి అన్నది ప్రగాఢమైన మన నిబద్ధతతో ముడిపడి ఉంది.  మన ఆర్థిక పురోగతిని సుస్థిర అభివృద్ధితో సమన్వయం చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు గర్వపడే వారసత్వాన్నిప్రపంచం మన నుంచి నేర్చుకుంటున్న పాఠాన్ని అందిస్తుంది.

ప్రకృతికి హాని కలిగించకుండా భారతదేశ వృద్ధికి కొత్త మార్గాలను తెరవడంలో సైన్స్పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయి. పరిశోధనఅభివృద్ధి మన దేశ ఎదుగుదలను నిర్వచిస్తాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు మనది పరిశోధనా కేంద్రం కాదుపాశ్చాత్య దేశాల వైపు చూసేవాళ్లం. దానికి మూల్యం చెల్లించుకున్నాం. వారు దానిని అవకాశంగా తీసుకున్నారు. వారు ఎంత పంచుకోవాలో లెక్క వేసుకున్నారు. కానీ ఇప్పుడుమార్పు వస్తోంది. మీరే  ఆ మార్పులకు  ప్రయోగశాల. సుస్థిర పద్ధతుల సంప్రదాయంతో ఉన్న భారత్  ఇప్పుడు పర్యావరణ అనుకూలసమ్మిళిత అభివృద్ధి నమూనాలను అవలంబిస్తూ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థితిలో ఉంది.

మిత్రులారామన పురాతన స్ఫూర్తినిమన నాగరికతను ప్రతిబింబిస్తూమన భారతదేశం దేశీయ పాలనలో సుస్థిరతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే కాకుండా ప్రపంచ కట్టుబాట్లను కూడా నడిపించింది. మనల్ని మనం ప్రపంచం నుంచి వేరుగా చూడలేం కాబట్టేప్రపంచం ఒకే కుటుంబంవసుధైవ కుటుంబం  అంటాం.

అంతర్జాతీయ సౌర కూటమికి నేతృత్వం వహించాం. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ లో ఉంది. దీనిలో 125 కి పైగా దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  సిఓపి 28 లో  గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ను ప్రారంభించాం. భారత్ 85 రామ్సర్ ప్రదేశాలకు సైట్లకు ఆతిథ్యం ఇస్తోంది.  మీరు శిక్షణ పొందిన వ్యక్తులు. దాని ప్రాముఖ్యత మీకు తెలుసు. ఇది ఆసియాలో రెండో  అతిపెద్ద వ్యవస్థ.

మిత్రులారాజి 20 లో భారతదేశం తాను ఏమిటో  ప్రపంచానికి చాటి చెప్పింది.   అది ఎప్పటికీ ఒక విషయంలో గుర్తుండి పోతుంది. ఆ అంశం నినాదంచోదక శక్తిమన పురాతన నమ్మకంమనం ఆచరించేమనం జీవించే విశ్వాసంఅదే వసుధైక కుటుంబం.  ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవిష్యత్తు అనేది దీని ఉద్దేశం. ఇది పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో సమిష్టి కార్యాచరణ ప్రాముఖ్యతను మొత్తం ప్రపంచానికి ఒక హక్కుగా గుర్తిస్తుంది.  వ్యాప్తి చేస్తుంది.. ఇది జీవిత వైవిధ్య ఇతివృత్తాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.

దీని అర్థం పర్యావరణం కోసం జీవనశైలిఇది మన పూర్వీకులు నమ్మిన ఇతివృత్తంసామాజిక అభివృద్ధి పెరుగుదలకు అత్యంత విజయవంతమైన ఇతివృత్తంఇది వ్యక్తిగత స్థాయిలో ప్రవర్తన మార్పును ఉత్తేజపరచే ప్రజా ఉద్యమాన్ని సృష్టించి కీలకమైన సానుకూల ప్రభావాలను అందిస్తుంది. మంచి విషయం ఏమిటంటే మన యువత దీనిని వేగంగా అవలంబిస్తున్నారు. మీరందరూ దీనిపై మరింత శ్రద్ధ పెట్టాలని కోరుతున్నానుఇది మీ శక్తిని సానుకూల రీతిలో వెలికితీయడానికి ఎల్లప్పుడూ సహాయపడుతుంది. మిత్రులారావాతావరణ మార్పులు ఎవరిని అసమానంగా ప్రభావితం చేస్తాయో గుర్తించాలి. ధనవంతులను కాదుబలవంతులను కాదు. ఇది సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఇది వాతావరణ న్యాయాన్ని మనకు మార్గదర్శక సూత్రంగా చేస్తుంది. సుస్థిర అభివృద్ధివాతావరణ న్యాయాన్ని సమీకృతం చేయడానికి అన్ని స్థాయిల్లో నాయకత్వం కీలకం.

మిత్రులారానేను కొంచెం అప్రస్తుత ప్రస్తావన తెస్తున్నాను. ఒకప్పుడు పాలనలో లేదా అధికార పదవుల్లో ఉన్నవారి నుంచి మన ప్రజాస్వామ్యానికిజాతీయతా స్ఫూర్తికి సవాళ్లు ఎదురవుతుండటం ఆందోళన కలిగిస్తోందిఇది దురదృష్టకరం. సంకుచిత పక్షపాత ప్రయోజనాల కోసం వారు జాతి వ్యతిరేక కథనాలను ప్రచారం చేసేమన గొప్పస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని పొరుగు దేశాల వ్యవస్థతో పోల్చే స్థాయికి వెళతారు. మనం ఎప్పుడైనా పోల్చగలమాఈ క్రమంలోనే వారిని నిర్వీర్యం చేయడానికితిప్పికొట్టడానికివాటిని పూర్తిగా బహిర్గతం చేయడానికి సమాజంలోని చైతన్యశీలురుముఖ్యంగా యువత ముందుకు రావాలి.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంఅత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యంఆరు దశాబ్దాల తర్వాత మూడోసారి ప్రధానిగా ఉన్న వ్యక్తి నాయకత్వంలో సుస్థిర ప్రజాస్వామ్యం-ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొనిపక్కన ఉన్న దేశంలో ఏదైనా జరిగే పరిస్థితి ఇక్కడ కూడా చోటుచేసుకోవచ్చు అని అభిప్రాయపడగలమాఒక దేశంజాతియాభిమానంప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వారికి ఇలాంటి ఆలోచన ఎలా వస్తుందిఇలాంటి దుర్మార్గమైన కథనాలు మాటలకు అందని విధంగా ఖండించదగినవి. ముఖ్యంగా మన యువత ఇప్పుడు చైతన్యవంతులు కావాలి . తగిన ప్రతిస్పందన ఇవ్వాలి.

మిత్రులారాయువతకు నా సలహా. మీరు సరైన ప్రదేశంలో ఉన్నారునేను మీకు చెప్పేది ఎంత ముఖ్యమో మీరు గ్రహించాల్సిన సమయం ఇది.  ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మీరు దేశవ్యాప్తంగా గమనించి ఉంటారు. ఇది యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది చాలా సులభంగా ఆకర్షణీయమైన వ్యసనంగా మారుతోంది. ఇందులో పడి అద్భుతమైన అవకాశాలను పట్టించుకోకుండా మన యువత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఐఎంఎఫ్ ఏమని చెప్పిందో గుర్తుంచుకోండి. ఐఎంఎఫ్ పేర్కొన్నట్లుగాభారత్ ప్రపంచ పెట్టుబడులకుఅవకాశాలకు గమ్యస్థానం అని చెప్పడం ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడి లేదు. అది ఇతరత్రా లభించే మార్గాలపై ఆధారపడి ఉంది. మన యువత దీన్ని అర్థం చేసుకోవాలి. విభిన్న రంగాల్లో విస్తారమైన ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయిమన యువత తమ కిష్టమైనవి ఎంచుకోవచ్చు. జాతీయఅంతర్జాతీయ సంక్షేమం కోసం తమ వంతు పాత్ర పోషించవచ్చు. ఆ దృక్పథంలో మిత్రులారాసముద్రంలోభూమిపైఆకాశంలో అంతరిక్షంలో వేచి ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకుఅనుభవం సంపాదించేందుకు ప్రతిభను వెలికితీయడానికిసామర్థ్యాన్ని ఆవిష్కరించడానికిఆశయాలను ఫలవంతం చేయడానికి, ప్రభుత్వ అవకాశాల భ్రమల నుండి బయటకు రావడం అత్యవసరం. 

మిత్రులారాముఖ్యంగా ఈ దేశ యువతను నేను అప్రమత్తం చేయాలనుకుంటున్నాను.మిమ్మల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉన్నారువారు తమ నిజమైన ఉద్దేశాలను కప్పి ఉంచిమన దేశ విస్తృతమైనఅపూర్వమైన అభివృద్ధినిఆర్థిక ప్రగతినివిశేషమైన వృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పెరుగుదలను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తారు. వీటన్నిటినీ వారు విస్మరిస్తారువారు దీనికి భిన్నమైన చిత్రాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారువారు వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు.  భారతదేశంలో గ్రామ స్థాయి వరకు జరుగుతున్న వాటికి చాలా దూరంలో ఉంటారు. 

డైరెక్టర్ గారూమీ సంస్థలో జరుగుతున్న కృషి పట్ల ప్రేరణ పొందిప్రభుత్వం,  కార్పొరేట్‌ సంస్థలు చాలా ఉదారవాదంగా ఉండాలనిపరిశోధనపై అత్యంత దృష్టి కేంద్రీకరించాలని, ప్రతి ఒక్కరూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు నిధులు ఎక్కువగా ఇవ్వాలని చెప్పదలచుకున్నాను. ఖర్చు చేసే రూపాయి దేశాభివృద్ధికిప్రపంచ సంక్షేమానికి దోహదపడుతుంది.

మిత్రులారామనం పాశ్చాత్య దేశాల వైపు చూడకుండా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది పాశ్చాత్య దేశాలు మనవైపు చూడాల్సిన సమయం. సాంకేతిక పరిజ్ఞానంపరిశోధనల అభివృద్ధి కోసం వారు భారత్ వైపు చూడాలి. మనకు ప్రతిభావంతులైన మేధావులు ఉన్నారు. మన డిఎన్ఎ చాలా భిన్నంగా ఉంది. మన మానవ వనరులకు ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాల రూపంలో ప్రపంచ గుర్తింపు లభించింది.

ఉదాహరణగా చెప్పాలంటేమనం ఎప్పుడూ ఊహించలేదుభారతదేశం క్వాంటం కంప్యూటింగ్ మిషన్గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టిన సింగిల్-డిజిట్ దేశాల్లో ఒకటిగా మారుతుందని. ఇది కేవలం పత్రాలపై మాత్రమే కాదు. క్వాంటం కంప్యూటింగ్‌కు ₹6,000 కోట్లు కేటాయించారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ₹19,000 కోట్లు కేటాయించారు. 2025 నుండి 2030 మధ్యకాలంలో 6జీ టెక్నాలజీని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు. ఇవన్నీ ప్రపంచంలో ముందు వరుసలో ఉన్న దేశాల సరసన మనం ఉన్న కొన్ని రంగాలు.

నాకు ఎటువంటి సందేహం లేదుమిత్రులారాముఖ్యంగా నా యువ మిత్రులారా,, భారతదేశ ఎదుగుదలనిరంతర ఎదుగుదలస్థిరమైన పెరుగుదలకు దాని జనాభాలోని యువశక్తి వల్లనే హామీ లభిస్తోంది. ప్రస్తుతం మనం చేయాల్సిందల్లా మన జాతీయ ప్రయోజనాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చే ప్రతి ప్రయత్నాన్నీ చేయడమే. స్వప్రయోజనాలకు అతీతంగా దాన్ని కాపాడుకోవాలి. పక్షపాత ప్రయోజనాలకు అతీతంగా మనం దానిని ఉంచాలి. దేశంలోని ప్రతి ఒక్కరికీముఖ్యంగా రాజకీయ పార్టీలకు వారి అభిప్రాయాలు ఉంటాయనిఅవి ఉండాలని నేను ఆశిస్తున్నాను. వారి అభిప్రాయాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.  కానీ జాతీయ సంక్షేమంజాతీయవాదంఅభివృద్ధి విషయానికి వస్తే వారు రాజకీయ కోణంలో చూడకూడదు. ఆ విషయంలో పక్షపాతరహిత వైఖరిద్వైపాక్షిక వైఖరితో మన అభివృద్ధి వేగవంతం కావాలి. ముఖ్యంగా ఈ సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తున్నానుఇది తాను పని చేస్తున్న రంగంలో  శ్రేష్ఠతవిద్యాపరమైన నైపుణ్యంపరిశోధనలకు ఉదాహరణగా నిలుస్తోంది.

మిత్రులారాఇది నిజంగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భం. దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక సంస్థలకు నేను వెళ్ళాను. ఎక్కడకు వెళ్ళినా టెక్నాలజీపరిశోధనలో మన దేశం ఎదుగుతోందన్న నా నమ్మకం ఎప్పుడూ బలపడుతూనే ఉంది.  ఇంతకు ముందు మనం ఇతరుల దయాదాక్షిణ్యాలకు లోనైన వివిధ రంగాలలో భారత్ సమీప భవిష్యత్ లోనే  ముందంజలో ఉండటం మనం చూస్తాం. 

ఇక్కడి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు.

మీకు చాలా ధన్యవాదాలు. 

 

 

****


(Release ID: 2050674) Visitor Counter : 61


Read this release in: English , Hindi