కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్మిక సంస్కరణలు, ఉపాధి కల్పనపై చర్చించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో బెంగళూరులో ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్న కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 29 AUG 2024 2:34PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శుశ్రీ శోభా కరంద్లాజే అధ్యక్షతన ఆగస్టు 30, 2024న బెంగళూరులో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్‌లతో ప్రాంతీయ సమావేశం జరగనుంది. కార్మిక సంస్కరణలు, భవన నిర్మాణ కార్మికులు (బీఓసీడబ్ల్యూ), ఈఎస్ఐసీ, ఈ‌శ్రామ్, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

 

కార్మిక చట్టాల కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన నిబంధనలను సమన్వయం చేయడం, సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా పొందడానికి ఈ-శ్రామ్ పోర్టల్‌ను ఒకే దగ్గర పరిష్కారం లభించే వేదికగా ఉపయోగించడం, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను విస్తరించడం, ఉపాధి అవకాశాల కోసం విద్యాసంస్థలతో అనుసంధానం, ఉపాధి అవకాశాల అంచనా తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2049931) సందర్శకుల సూచీ సంఖ్య : : 88
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada , Malayalam