ప్రధాన మంత్రి కార్యాలయం
25న మహారాష్ట్ర, రాజస్థాన్ లో ప్రధాని పర్యటన
జలగావ్ లో లాఖ్ పతి దీదీ సమ్మేళనంలో పాల్గొననున్న ప్రధాని
11 లక్షల మంది కొత్త లాఖ్ పతి దీదీలకు ప్రధాని అభినందనలు, ధ్రువీకరణ పత్రాల అందజేత
రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదల, రూ.5,000 కోట్ల బ్యాంకు రుణాల పంపిణీ
జోధ్ పూర్ లో రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని
Posted On:
24 AUG 2024 2:54PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25న మహారాష్ట్ర లోని జల్ గావ్, రాజస్థాన్ లోని జోధ్పూర్ లో పర్యటించనున్నారు. ఉదయం 11.15 గంటలకు లాఖ్ పతి దీదీ సమ్మేళనంలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు జోధ్ పూర్ లో జరిగే రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారు.
మహారాష్ట్రలో ప్రధానమంత్రి
లాఖ్ పతి దీదీ సమ్మేళన్ లో పాల్గొనేందుకు ప్రధాని జల్ గావ్ కు రానున్నారు. ఎన్డీయే మూడో దఫాలో ఇటీవలే లాఖ్ పతిగా మారిన 11 లక్షల మంది కొత్త లాఖ్ పతి దీదీలకు ఆయన ధ్రువపత్రాలు ఇచ్చి అభినందనలు తెలియజేయనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న లాఖ్ పతి దీదీలతో ప్రధాని సంభాషించనున్నారు.
4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 48 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూర్చేలా రూ.2,500 కోట్లరివాల్వింగ్ ఫండ్ ను ప్రధాని విడుదల చేయనున్నారు. 2.35 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 25.8 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూర్చే రూ.5,000 కోట్ల బ్యాంకు రుణాన్ని కూడా ఆయన పంపిణీ చేయనున్నారు.
లాఖ్ పతి దీదీ యోజన ప్రారంభించినప్పటి నుంచి, కోటి మంది మహిళలు ఇప్పటికే లఖ్ పతి దీదీలుగా మార్చారు. 3 కోట్ల లాఖ్ పతి దీదీలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాజస్థాన్ లో ప్రధానమంత్రి
జోధ్పూర్ లోని హైకోర్టు ప్రాంగణంలో జరిగే రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజస్థాన్ హైకోర్టు మ్యూజియాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.
****
(Release ID: 2048867)
Visitor Counter : 52
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam