మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అభ్యసన వైకల్యాలపై రెండో విడత నైపుణ్య కార్యక్రమం

Posted On: 22 AUG 2024 6:13PM by PIB Hyderabad

చదవడం, రాయడం తదితర అభ్యాసన విషయాల్లో నైపుణ్యం లేక ఇబ్బందులు పడుతున్న వారికి తగిన ప్రావీణ్యాన్ని అందించే ఉద్దేశంతో మాళవీయ మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం (ఎం.ఎం.టి.టి.పి) కింద రెండో విడత కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. తొలివిడత కార్యక్రమం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. ప్రత్యేక అభ్యసన వైకల్యాలు కలిగిన విద్యార్దులకు ఉపయోగపడేలా  ఉన్నత విద్యా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు, విజ్ఞానాన్ని సమకూర్చేలా దీనికి రూపకల్పన చేశారు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ .కె.సంజయ్ మూర్తి, ఉన్నత విద్యా శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఎస్.కె. బన్వల్, ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రీనా సోనోవాల్ కౌలి, ఉన్నత విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవేంద్ర కుమార్ శర్మ, చాంగీన్క్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు శ్రీమతి నూపూర్ ఝున్ ఝున్ వాలా లు  ఈ రెండో విడత కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్న, ఎంపిక చేసిన 45 సంస్థల అధిపతులు, అధ్యాపకులు దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ట్రిపుల్ ఐటిలు, ఎన్ఐటిలు, ఐఐఎస్ఇఆర్లు, సిఎఫ్టిఐలు, ఎస్పిఎలు, ఎన్ఐటిటిటిఆర్లు తదితరాలకు చెందిన వారు ఉన్నారు.

అందరికీ సమ్మిళిత విద్య, సమాన విద్య దార్శనికతతో 2020 లో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం, విద్యార్ధులలో ప్రత్యేక వైకల్యాలున్న వారిని గుర్తిస్తున్నదని శ్రీ కె.సంజయ్ మూర్తి ప్రస్తావించారు. ప్రత్యేక వైకల్యాలు, అభ్యసన వైకల్యాలున్న విద్యార్ధుల విషయంలో అవగాహన కలిగి ఉండి వారు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఉన్నత విద్యా సంస్థలు సున్నితత్వం కలిగి ఉండాలని నూతన విద్యా విధానం నిర్దేశిస్తున్నదన్నారు. ఈ సమస్యను అధిగమించడంలో,  క్రమం తప్పకుండా ,అభ్యసన వైకల్యాలు ఎదుర్కొంటున్న వారిలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు నిర్వహించడం అవసరం.  మాలవీయ మిషన్  ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం కింద, ప్రత్యేక అభ్యసన వైకల్యాలు కలిగిన వారికి సంబంధించి తోడ్పడేందుకు కీలక భాగస్వాముల సామర్ధ్యాల నిర్మాణ కార్యక్రమానికి ఎలా రూపకల్పన చేసిందీ ఆయన వివరించారు.

ప్రత్యేక వైకల్యాలు కలిగిన వారికి సంబంధించి, తొలివిడత కార్యక్రమం జనవరి 2024 నుంచి జూలై వరకు జరిగింది. చాంగీన్క్ పౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని నిర్వహించారు. తొలివిడతలో 27 ఉన్నత విద్యా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ట్రిపుల్ ఐటిలు, ఐఐఎం లు, ఐఐఎస్ఇఆర్లు, ఎస్.పి.ఎలు ఎన్.ఐ.టిలు ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద పలు సెషన్లు నిర్వహించారు. వీటిలోపునశ్చరణ కార్యక్రమాలు, ;ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన వారి అవసరాలను అర్ధం చేసుకునే లా చూడడం, మాస్టర్ క్లాస్లు, జోన్ వారీగా వ్యక్తిగత వర్క్ షాప్ లు,  వీటి అమలు, పర్యవేక్షణ వంటివి ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన వివిధ విభాగాల నుంచి 400మందికి  పైగా అధ్యాపకులు పాల్గొన్నారు.

రెండో విడత కార్యక్రమం 2024 ఆగస్టు 22న ప్రారంభమైంది. ఇది 2024 డిసెంబర్ వరకు జరుగుతుంది.  ఆన్లైన్ ద్వారా, వ్యక్తిగత హాజరు పద్ధతిలో కొత్తగా ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల వారితో జరుగుతోంది.  ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన వారి అవసరాలు గుర్తించడలో అనుసరించాల్సిన వ్యూహం, ఉపకరణాలపై ఈ కార్యక్రమం దృష్టిపెడుతుంది. వివిధ విద్యా సంస్థల అధిపతులకు అవగాహన కల్పించడంపై దృష్టిపెడుతుంది.  ఐదు విబాగాల అధిపతులు, వారితోపాటు  ఆయా విభాగాల నుంచి ఇద్దరు నామినీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరు ముఖాముఖి వర్క్ షాపులు,  నిపుణులతో కూడిన సదస్సులు, పరిపూర్ణ అభ్యసన వాతావరణాన్ని కల్పించే సామర్ధ్యాలను వారిలో పెంపొందింప చేయడం వంటి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం  ఆరునెలల పాటు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత, కొత్త ఉన్నత విద్యా సంస్థలకు చెందిన వారితో మరో విడత కార్యక్రమం నిర్వహిస్తారు. సమ్మిళిత విద్య అవసరం ఎంత ముఖ్యమో శ్రీ ఎస్.కె.భర్నవాల్ పేర్కొన్నారు.  విద్యార్ధుల వైవిధ్య అవసరాలను తీర్చడంలో , అధ్యాపకులను తగిన విధంగా సన్నద్ధులుగా చేయడంలో ఈకార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రత్యేక వైకల్యాలు కలిగిన విద్యార్ధులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదిశగా కృషి చేయాలని కూడా  ఆయన పిలుపునిచ్చారు.


 

****  



(Release ID: 2047968) Visitor Counter : 9


Read this release in: English , Urdu , Hindi