ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బి)ల పనితీరుపై సమీక్ష


గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోని తొమ్మిది ఆర్ఆర్బీల పనితీరును

ఉదయపూర్ లో సమీక్షించిన కేంద్ర ఆర్థిక మంత్రి



ముఖ్యంగా ఆకాంక్ష జిల్లాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని

ఆర్ఆర్బీలను కోరిన శ్రీమతి సీతారామన్

2022 నుండి పశ్చిమ మధ్య ప్రాంతంలోని తొమ్మిది ఆర్ఆర్బీల సాంకేతికత అప్‌గ్రేడేషన్‌లో

పురోగతిని గుర్తించిన కేంద్ర ఆర్థిక మంత్రి

చిన్న, సూక్ష్మ సంస్థలకు క్రెడిట్‌ని నిర్ధారించడానికి ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఉన్న

ఆర్ఆర్బీ శాఖల ద్వారా క్రియాశీల విస్తరణ ఆవశ్యకతను ప్రస్తావించిన శ్రీమతి సీతారామన్

Posted On: 22 AUG 2024 6:13PM by PIB Hyderabad

గుజరాత్మహారాష్ట్రమధ్యప్రదేశ్ఛత్తీస్‌గఢ్రాజస్థాన్ రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బి)ల పనితీరును సమీక్షించడానికి కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయపూర్‌లో సమావేశమయ్యారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) కార్యదర్శి  శ్రీ ఎం. నాగరాజుఅదనపు కార్యదర్శిఇతర సీనియర్ డిఎఫ్ఎస్ అధికారులుఆర్ఆర్బీల ఛైర్మన్లు, స్పాన్సర్ బ్యాంకుల సీఈఓలుఆర్బీఐ, సిడ్బీనాబార్డ్ ప్రతినిధులు, 5 రాష్ట్రాల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

వ్యాపార పనితీరుడిజిటల్ టెక్నాలజీ సేవలను అప్‌గ్రేడ్ చేయడంఎంఎస్ఎంఈ క్లస్టర్లలో వ్యాపార వృద్ధిగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చేరికలను మరింతగా పెంచడంపై సమీక్షా సమావేశంలో దృష్టి సారించారు.

 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో ఆర్ఆర్బీల  కీలక పాత్రను దృష్టిలో ఉంచుకునికేంద్ర ఆర్థిక మంత్రి ఆర్ఆర్బీలు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలనిముఖ్యంగా ఆకాంక్ష జిల్లాల్లో అవగాహన కల్పించాలని కోరారు.

 

శ్రీమతి సీతారామన్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ముద్ర పథకం గణనీయ లక్ష్యాలు సాధించకపోవడాన్ని ప్రస్తావిస్తూఆ ప్రాంతంలోనుఆకాంక్ష జిల్లాల్లోనూ ఇతర ఆర్థిక చేరిక పథకాలతో పాటు ముద్రా పథకం పనితీరును మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులుస్పాన్సర్ బ్యాంకులు,  ఆర్ఆర్బీలతో నిర్దిష్ట సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి)ని ఆదేశించారు. 

గుజరాత్రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం సహజ సామర్థ్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి గుర్తించారు. ఈ పథకం కింద అవగాహన కల్పించిరుణాన్ని అందించాలని ఆర్ఆర్బీలను కోరారు.  ఆర్ఆర్బీల ద్వారా రుణసేవలను  విస్తృత స్థాయికి పెంచడానికి 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ఓడిఓపి)కార్యక్రమ సంభావ్యతను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగాఆర్ఆర్బీలు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వర్తక వ్యాపారాల్లో రుణాలు అందించడానికి అవకాశాలను గుర్తించాలని ఆమె ఆదేశించారు. ఆర్ఆర్బీలు వ్యవసాయ రుణ పంపిణీలో తమ వాటాను పెంచుకోవాలనిప్రాధాన్యతా రంగ రుణాల లక్ష్యాలను సాధించాలని కూడా సూచించారు.

ఆర్ఆర్బీల కన్సాలిడేటెడ్ క్యాపిటల్ టు రిస్క్ (వెయిటెడ్) అసెట్స్ రేషియో (సిఆర్ఏఆర్) 2021 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం నుండి 2024లో 13.7 శాతానికి పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.41 కోట్ల నష్టాల నుండి 2024లో రూ.2,018 కోట్లు నికర లాభానికి వచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు (జిఎన్పిఏ) 3.9 శాతం నిష్పత్తితో సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. సాధారణ సమీక్ష ప్రారంభమైన సంవత్సరం 2022 నుండి పశ్చిమ మధ్య ప్రాంతంలోని తొమ్మిది ఆర్ఆర్బీలు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌లో కనిపించిన సంతృప్తికరమైన మెరుగుదలని  శ్రీమతి సీతారామన్ గుర్తించారు. ఆర్ఆర్బీలు భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగించాలని కోరారు.

ఆర్ఆర్బీలు మరింత క్రెడిట్‌ని వ్యాప్తి చేయడానికి వారి ఆరోగ్యకరమైన 'సిఏఎస్ఏ'  నిష్పత్తిని ఉపయోగించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం,  స్పాన్సర్ బ్యాంకులు తీసుకుంటున్న ప్రయత్నాలే కాకుండారాష్ట్ర ప్రభుత్వాల నుండి  ఆర్ఆర్బీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను పరిష్కరించడంలో ఆర్బీఐ  జోక్యం చేసుకోవాలని కోరారు.
 

సమీక్షా సమావేశంలోఆర్థిక మంత్రి ఆర్ఆర్బీలను మరింత కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చాలనిపనితీరును మరింత మెరుగుపరచడానికి దాని స్థానిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. సాంకేతిక సహాయాన్ని అందించడంఉత్తమ విధానాలను పంచుకోవడం ఆర్ఆర్బీలు విజయవంతం కావడానికి అవసరమైన వనరులకు ప్రాప్యత కలిగి ఉండేలా చూసుకోవడం ద్వారా స్పాన్సర్ బ్యాంకులు ఈ ప్రయత్నాలలో ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు.

చిన్నసూక్ష్మ సంస్థలకు క్రెడిట్‌ని నిర్ధారించడానికి ఎంఎస్ఎంఈ క్లస్టర్‌లలో ఉన్న ఆర్ఆర్బీ శాఖల ద్వారా క్రియాశీల విస్తరణను సీతారామన్ ప్రస్తావించారు. అన్ని  ఆర్ఆర్బీలు క్లస్టర్ కార్యకలాపాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను రూపొందించాయి. అయితేవారు ఆ విభాగంలో తమ క్రెడిట్ పోర్ట్ ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలని తెలిపారు.
 

స్పాన్సర్ బ్యాంక్‌లు, ఆర్ఆర్బీలు మున్ముందు ఎదురయ్యే సవాళ్లను తప్పనిసరిగా గుర్తించాలనిముఖ్యంగా ఆస్తుల నాణ్యతను కొనసాగించడండిజిటల్ సేవలను విస్తరించడంతో పాటు పటిష్టమైన కార్పొరేట్ గవర్నెన్స్ పై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి సూచించారు.

****




(Release ID: 2047955) Visitor Counter : 49