కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2024 జూన్ నెలలో ఇఎస్ఐ పథకంలో కొత్తగా చేరిన కార్మికుల సంఖ్య 21.67 లక్షలు
కొత్తగా చేరిన వారిలో 25ఏళ్లలోపు వయస్సు గల యువ ఉద్యోగుల సంఖ్య 10.58 లక్షలు
ఇఎస్ఐ పథకంలో చేరిన మహిళా ఉద్యోగుల సంఖ్య 4.32 లక్షలు
2024 జూన్ నెలలో ఇఎస్ఐ పథకంలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 13,483
2024 జూన్ నెలలో ఇఎస్ఐ పథకంలో చేరిన ట్రాన్స్‌జెండర్ ఉద్యోగుల సంఖ్య 55
Posted On:
22 AUG 2024 5:46PM by PIB Hyderabad
ఈరోజు ఇఎస్ఐసి విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం 2024 జూన్ నెలలో 21.67లక్షల మంది ఉద్యోగులు ఈ పథకంలో కొత్తగా చేరారు.
2024 జూన్ నెలలో 13,483 కొత్త సంస్థలు ఇఎస్ఐ పథకం సామాజిక భద్రత పరిధిలోకి వచ్చాయి, తద్వారా మరింత మంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది.
అంతేకాకుండా, 2023 మే నెలతో పోల్చితే నికర రిజిస్ట్రేషన్‌లలో 7% వృద్ధి నమోదైనట్లు సంవత్సరంవారీ విశ్లేషణ చూపుతుంది.
సంవత్సరంవారీ పోలిక
|
శీర్షిక
|
జూన్ 2023
|
జూన్ 2024
|
వృద్ధి
|
నెల రోజులలో కొత్తగా నమోదు చేసుకున్న ఉద్యోగుల సంఖ్య
|
20.27 లక్షలు
|
21.67 లక్షలు
|
1.40 లక్షలు
|
డేటా ప్రకారం, ఈ నెలలో కొత్తగా చేరిన మొత్తం 21.67 లక్షల మంది ఉద్యోగులలో 10.58 లక్షల మంది అనగా మొత్తం రిజిస్ట్రేషన్‌లలో దాదాపు 49% ఉద్యోగులు 25 ఏళ్లలోపు వయస్సు వారే కావడం గమనార్హం.
అలాగే, లింగం వారీగా పేరోల్ డేటా విశ్లేషణ ప్రకారం 2024 జూన్ నెలలో మహిళా సభ్యుల నికర నమోదు 4.32 లక్షలుగా ఉంది. అంతేకాకుండా, 2024 జూన్ నెలలో మొత్తం 55 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఇఎస్ఐ పథకంలో చేరారు. సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను అందించడం పట్ల ఇఎస్ఐసి నిబద్ధతను ఇది చాటుతున్నది.
ఈ డేటా రూపకల్పన నిరంతర ప్రక్రియ అయినందున ఈ పేరోల్ డేటా తాత్కాలికమైనది.
***
(Release ID: 2047879)