సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో జాతి సంపద

Posted On: 12 AUG 2024 6:57PM by PIB Hyderabad

12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో  1947, ఆగస్టు 15న ఎగురవేసిన అప్పటి జాతీయ పతాకాల్లో అరుదైన జాతి సంపదగా నిలిచిన పతాకం ఒకటి చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియంలో ఉంది.  ఆ కాలంలో ఆవిష్కరించిన జాతీయ పతాకాలలో ప్రస్తుతం మనుగడలో ఉన్న పతాకం ఇది మాత్రమే. స్వాతంత్య్ర సాధన కోసం భారతీయులు సాగించిన సమస్త పోరాటానికి ఈ పతాకం నిదర్శనం. ఇది స్వచ్ఛమైన  పట్టుతో తయారు చేసిన 3.50మీటర్ల పొడవు, 2.40మీటర్ల వెడల్పు గల మువ్వన్నెల పతాకం. 1947 ఆగస్టు 15న ఉదయం 5.30 గంటలకు సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మ్యూజియంలోని భారత స్వాతంత్య్ర గ్యాలరీ భారతీయ పతాక పరిణామ క్రమాన్ని, మూడు రంగుల వెనుక ఉన్న కథలను కూడా ప్రదర్శిస్తుంది.

ఆధునిక "చెన్నై" నగరం బ్రిటీష్ వారి స్థావరం అయిన సెయింట్ జార్జ్ కోట ద్వారా ఏర్పడింది, సెయింట్ జార్జ్ కోట చుట్టూ ఉన్న అనేక స్థానిక గ్రామాలు, యూరోపియన్ స్థావరాలను మద్రాసు నగరంలో విలీనం చేయడం ద్వారా ఇది మరింత విస్తృతమైంది.

1948, జనవరి 31 నుంచి ఫోర్ట్ సెయింట్ జార్జ్ మ్యూజియం నిర్వహణ ప్రారంభమై, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కోటలో చెల్లాచెదురుగా ఉన్న రాజుల కాలం నాటి అవశేషాలను ప్రదర్శనకు ఉంచడానికి ఈ భవనంలో మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పాత మద్రాస్ గార్డ్స్‌కు చెందిన కల్నల్ డి.ఎమ్ రీడ్ 1946లో దీనిని రూపొందించారు. మ్యూజియం రిసెప్షన్‌పై గల ఒక చిత్రం 1640 నుండి కోట పరిణామ క్రమాన్ని అలాగే దాని నిర్మాణ శైలిని చూపుతుంది. ఈ మ్యూజియంలో ఇప్పుడు వలసవాదుల కాలంనాటి 3500 కు పైగా కళాఖండాలు ఉన్నాయి; వాటిలో అత్యుత్తమమైన వాటిని తొమ్మిది గ్యాలరీలలో ప్రదర్శనకు ఉంచారు.

***



(Release ID: 2044933) Visitor Counter : 16