ఆయుష్
ఆయుర్వేద పరిశోధనలు, విద్యను ప్రోత్సహించడానికి అఖిలభారత ఆయుర్వేద సంస్థకు, అమిటీ విశ్వవిద్యాలయానికి మధ్య ఎంఓయు
Posted On:
09 AUG 2024 5:07PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థకు, నొయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయానికి మధ్య గురువారం కీలకమైన అవగాహన ఒప్పంద పత్రంపై ( ఎంఓయు) సంతకాలు జరిగాయి. విద్య, పరిశోధన, సాంకేతికతల అంశాల్లో కలిసి పని చేయడానికి వీలుగా ఈ ఎంఓయు కుదిరింది. ఎంఓయుపై ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నెసారి, అమిటీ విశ్వవిద్యాలయం తరఫున జాయింట్ రిజిష్ట్రార్ ఆశా ప్రేమ్‌నాధ్ సంతకాలు చేశారు. ప్రస్తుతం అమిటీ విశ్వవిద్యాలయంతో కొనసాగుతున్న ఐదు సంవత్సరాల ఒప్పందాన్ని ఈ ఏంఓయు పొడిగిస్తుంది. అమిటీ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ అతుల్ చౌహాన్ నాయకత్వంలో, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎంఓయు సంతకాల కార్యక్రమం జరిగింది.
అమిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బల్విందర్ శుక్లా, అమిటీ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ డబ్ల్యు సెల్వమూర్తి, డీన్ డాక్టర్ బీసీ దాస్, ఇంకా విశ్వవిద్యాలయానికి చెందిన ఇతర సీనియర్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సహకార విద్యా కార్యక్రమాలను, ప్రచురణలను, సామర్థ్య నిర్మాణం, ఉమ్మడి సామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం ఎంఓయూ లక్ష్యం. విద్యాపరంగా ఉన్నతిని పెంపొందించడం, సాంకేతికపరంగా పురోభివృద్ధిని సాధించడం, సామర్థ్య నిర్మాణం ద్వారా అత్యాధునిక కార్యక్రమాలను చేపట్టడం, జీవితకాల అభ్యసనం ఈ ఎంఓయు లక్ష్యాల్లో మరికొన్ని. విద్య, పరిశోధన, శిక్షణలకోసం విద్యార్థుల, బోధనా సిబ్బంది మార్పిడికి ఎంఓయు దోహదం చేస్తుంది.
అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు ప్రధాన మంత్రి ఆవిష్కరించిన 2047 దార్శనికతను సాధ్యం చేయడానికి తమ సంస్థ నిబద్ధతతో పని చేస్తోందని ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నెసారి పేర్కొన్నారు. ఆ దిశగా ఎంఓయు రూపంలో కీలకమైన అడుగువేశామని అన్నారు. విజ్ఞానాన్ని, పరిశోధనలను పంచుకోవడంద్వారా అభివృద్ధి ముందడుగు వేస్తుందని అన్నారు.
జాతీయ స్థాయి సంస్థలు, విశ్వవిద్యాలయాలతో ఏఐఐఏ 40 ఎంఓయులను కుదర్చుకోవడం గమనార్హం. ఈ ఎంఓయులను కుదుర్చుకున్న వాటిలో ప్రధానమైన ఐఐటిలు, సిఎస్ ఐ ఆర్ వున్నాయి. ఆయుర్వేద రంగంలో పరిశోధనను, డాక్యుమెంటేషన్ ను ప్రోత్సహించడానికి ఈ ఎంఓయులను చేసుకున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలతో అదనంగా మరో 17 ఎంఓయులను చేసుకున్నారు.
శాలఖ్య తంత్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ మంజూష రాజగోపాల, ప్రొఫెసర్ ఆనందరామన్ శర్మ, ఏఐఐఏకి చెందిన పలువురు బోధనా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్రవ్యగుణ విభాగానికి చెందిన అసోషియేషట్ ప్రొఫెసర్ డాక్టర్ శివాని గిల్దియాల్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
***
(Release ID: 2044203)
Visitor Counter : 50