ఆయుష్
ఔషధ మొక్కల సాగులో మంచి వ్యవసాయ విధానాలు, మంచి క్షేత్రస్థాయి సేకరణ విధానాలపై రైతులకు శిక్షణ ప్రాజెక్టులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు మద్దతు
प्रविष्टि तिथि:
09 AUG 2024 5:31PM by PIB Hyderabad
మంచి వ్యవసాయ విధానాలు (జిఏపి), మంచి క్షేత్ర స్థాయి సేకరణ విధానాలపై (జిఎఫ్ సిపి) రైతులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి) మద్దతుతో ప్రాజెక్టులు చేపడుతున్నాయి. 2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రాజెక్టుల ద్వారా 14,352 మంది రైతులు లబ్ధి పొందారు. అంతే కాదు...ఔషధ మొక్కలపై చైతన్యం కల్పించేందుకు భారత క్వాలిటీ కౌన్సిల్ (క్యుసిఐ); కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరఫున ‘‘ఔషధ మొక్కల ఉత్పత్తుల స్వచ్ఛంద సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం సామర్థ్యాల నిర్మాణం, చైతన్య కల్పన’’ పేరిట ఒక ప్రాజెక్టుకు ఎన్ఎంపిబి మద్దతు ఇచ్చింది. మంచి వ్యవసాయ విధానాలు, మంచి క్షేత్రస్థాయి సేకరణ విధానాలపై భారత క్వాలిటీ కౌన్సిల్ (క్యుసిఐ) 76 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 4408 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాల నిర్వహణకు, ఆయా అంశాలపై సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాల (సెమినార్లు/శిక్షణ సదస్సులు/వర్క్ షాప్ లు) నిర్వహణ కోసం వివిధ సంస్థలు/సంఘాలకు ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి) ప్రాజెక్టు విధానంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పథకం (సిఎస్ఎస్) కింద సమాచార విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఔషధ మొక్కల సంరక్షణ, సాగు, సాగు అనంతర నిర్వహణ విధానాలు, మార్కెటింగ్ పై రైతుల్లో చైతన్యం కల్పించడం కోసం వివిధ ఐఇసి కార్యకలాపాల కింద ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎంపిబి 240 ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది.
అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ పథకం కింద ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణపై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి) ప్రాజెక్టు ప్రాతిపదికన వివిధ సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సాగు అనంతర నిర్వహణ విధానాలు, భారీ లోహాల మదింపు, సమీకృత తెగుళ్ల నిర్వహణ, వ్యవసాయ టెక్నిక్ ల అభివృద్ధి, నర్సరీ టెక్నిక్ ల ప్రామాణీకరణ, సాగు విధానాలు, అంతర్ పంటలు, ఔషధ మొక్కల సుస్థిర ఉత్పత్తి టెక్నాలజీలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ అంశాలన్నింటి పైన పరిశోధన ఫలాలను వివిధ శిక్షణ కార్యక్రమాలు, ఐఇసి కార్యకలాపాల ద్వారా రైతులకు అందచేస్తారు. ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎంపిబి 2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కింద 39 ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చింది.
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపిబి) అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ పథకాల కింద దేశవ్యాప్తంగా చేపట్టిన ‘‘ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణ విధానాల’’ ద్వారా ఈ దిగువ కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది.
i. సమాచార విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలు కింద శిక్షణ/వర్క్ షాప్ లు/సెమినార్లు/సదస్సుల నిర్వహణ
ii. నర్సరీల ఏర్పాటు
iii. స్వస్థానంలో సంరక్షణ, స్వస్థానం వెలుపల సంరక్షణ
iv. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ కమిటీలు (జెఎఫ్ఎంసిలు/పంచాయతీలు/వన పంచాయతీలు/జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు (బిఎంసి) /స్వయం సహాయక బృందాలతో (ఎస్ హెచ్ జి) జీవనోపాధి లింకేజిలు
v. పరిశోధన, అభివృద్ధి
vi. ఔషధ మొక్కల ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెటింగ్, వ్యాపారం
vii. ఔషధ మొక్కల సరఫరా వ్యవస్థలో ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ లింకేజిలు (ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ కింద)-ఈ విభాగంలో దిగువ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు.
· ఔషధ మొక్కల సాగుకు నాణ్యమైన నాట్లను పెంచేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన
· రైతుల్లో చైతన్య కల్పనకు సమాచార విద్యా కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలు
· ఔషధ మొక్కల మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడానికి సాగు అనంతర నిర్వహణ, మార్కెటింగ్ మౌలిక వసతుల విస్తరణ, ఉత్పత్తులకు విలువ జోడింపు, లాభదాయకత పెంపు, నష్టాల తగ్గింపు
· ముడిసరకు నాణ్యతా పరీక్షలు, సర్టిఫికేషన్
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు 2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వైద్యానికి ఉపయోగపడే మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సమాచార విద్య, కమ్యూనికేషన్ పథకం కింద సంవత్సరాలవారీగా ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు.
|
సీరియల్ నంబర్
|
ఆర్థిక సంవత్సరం
|
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ఎంపిబి ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య
|
|
1
|
2015-16
|
11
|
|
2
|
2016-17
|
30
|
|
3
|
2017-18
|
25
|
|
4
|
2018-19
|
40
|
|
5
|
2019-20
|
20
|
|
6
|
2020-21
|
16
|
|
7
|
2021-22
|
26
|
|
8
|
2022-23
|
46
|
|
9
|
2023-24
|
28
|
|
|
మొత్తం
|
240
|
2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కేంద్రప్రభుత్వ రంగ పథకం (సిఎస్ఎస్) ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణ కింద పరిశోధన కార్యకలాపాల కోసం ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలు...
|
సీరియల్ నంబర్
|
పరిశోధన విభాగం
|
ప్రాజెక్టుల సంఖ్య
|
|
i.
|
పంటల అనంతర నిర్వహణ, భారీ లోహాల అంచనా, సమీకృత తెగుళ్ల నిర్వహణ
|
16
|
|
ii.
|
వ్యవసాయ టెక్నిక్ ల అభివృద్ధి; నర్సరీ టెక్నిక్ ల ప్రామాణీకరణ, సాగు విధానాలు
|
17
|
|
iii.
|
అంతర పంటలు, సుస్థిర ఉత్పత్తి టెక్నాలజీ
|
06
|
|
మొత్తం
|
39
|
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు నిర్వహణలోని పథకం కింద మంచి వ్యవసాయ విధానాలు (జిఏపి), చక్కని క్షేత్ర స్థాయి సేకరణ విధానాలపై (జిఎఫ్ సిపి) శిక్షణ పొందిన రైతుల వివరాలు.
|
స్కీమ్ పేరు/ విభాగం పేరు
|
శిక్షణ పొందిన రైతుల సంఖ్య
|
|
ఔషధ మొక్కల సంరక్షణ, అభివృద్ధి, సుస్థిర నిర్వహణకు కేంద్రప్రభుత్వ రంగ పథకం (సిఎస్ఎస్)
|
|
2015-16 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో సమాచార విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాల కింద మద్దతు ఇచ్చిన ప్రాజెక్టుల్లో శిక్షణ పొందిన రైతులు.
|
14352
|
|
ఔషధ మొక్కల ఉత్పత్తుల స్వచ్ఛంద సర్టిఫికేషన్ ప్రాజెక్టు (విసిఎస్ఎంపిపి) కింద శిక్షణ పొందిన రైతులు (2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన ప్రాజెక్టు)
|
4408
|
కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్ రావు జాదవ్ లోక్ సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారంలో ఈ వివరాలు అందచేశారు.
***
(रिलीज़ आईडी: 2044198)
आगंतुक पटल : 106