రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎనిమిది కొత్త రైల్వే లైన్లకు ఆమోద ముద్ర వేసిన కేంద్ర మంత్రిమండలి; కనెక్టివిటీ పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, చమురు దిగుమతి, కర్బన ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కొత్త లైన్లు


అనుసంధానం కాని ప్రాంతాలను అనుసంధానం చేయడం, రవాణా నెట్‌వర్క్‌లను మెరుగుపరచడం ద్వారా లాజిస్టికల్ సామర్థ్యాన్ని మెరుగుపరించేందుకు ఉపయోగంలోకి రానున్న ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లు; ఫలితంగా సరఫరా గొలుసులు క్రమబద్ధీకరణ, వేగవంతమైన ఆర్థిక వృద్ధికి మార్గం

ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 24,657 కోట్లు , 2030-31 నాటికి పూర్తి

ప్రాజెక్టులు నిర్మాణ సమయంలో దాదాపు మూడు కోట్ల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు

Posted On: 09 AUG 2024 9:59PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎనిమిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటి మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 24,657 కోట్లు.

కొత్త లైన్ ప్రతిపాదనలు నేరుగా కనెక్టివిటీని అందించడమే కాకుండా, చలనశీలతను మెరుగుపరుస్తాయి. భారతీయ రైల్వేల సామర్థ్యాన్ని మెరుగు పరిచి,  సేవలలో విశ్వసనీయతను పెంచుతాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉద్యోగ/స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు సమగ్ర అభివృద్ధి ద్వారా "ఆత్మనిర్భర్" గా మార్చే నూతన భారత్ కు మార్గాలు వేస్తాయి. 

మల్టీ-మోడల్ కనెక్టివిటీ లక్ష్యంగా పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. ప్రజల ప్రయాణ అవసరాలు, వస్తువులు రవాణా నిరంతరాయంగా ఉండేలా ఒక సమగ్ర ప్రణాళిక ఇది. 

ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ లో 14 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ఈ ఎనిమిది ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను 900 కిలోమీటర్లు పెంచుతాయి.

ఈ ప్రాజెక్టులతో 64 కొత్త స్టేషన్లు నిర్మిస్తారు. ఆరు ఆకాంక్షాత్మక జిల్లాల(తూర్పు సింగ్‌బం, భదాద్రికొత్తగూడెం, మల్కన్‌గిరి, కలహండి, నబరంగ్‌పూర్, రాయగడ)లో 510 గ్రామాలు, సుమారు 40 లక్షల జనాభాకి ఇది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.  

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన అజంతా గుహలు కూడా ఈ మార్గంలో ఉండడంతో, ఇది భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమై, పెద్ద సంఖ్యలో పర్యాటకులు దీనిని సందర్శించేలా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, బాక్సైట్, సున్నపురాయి, అల్యూమినియం పౌడర్, గ్రానైట్, బ్యాలస్ట్, కంటైనర్లు మొదలైన సరుకుల రవాణాకు ఇవి ముఖ్యమైన మార్గాలు. సామర్థ్యం పెంపుదల పనుల వల్ల పెద్ద ఎత్తున సరుకు రవాణా జరుగుతుంది. సంవత్సరానికి 143 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యాన్నిఅందిస్తుంది. రైల్వేలు పర్యావరణ అనుకూలమైనవి. ఇంధన సమర్థవంతమైన రవాణా విధానం, వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, లాజిస్టిక్స్ వ్యయాన్నిగణనీయంగా తగ్గిస్తాయి. చమురు దిగుమతి (32.20 కోట్ల లీటర్లు)ని, కర్బన ఉద్గారాలను (0.87 మిలియన్ టన్నులు) తగ్గించడంలో దోహదపడుతుంది. కర్బన ఉద్గారాలు ఇంత పెద్ద ఎత్తున తగ్గాయంటే, 3.5 కోట్ల చెట్ల పెంపకంతో సరిసమానం.  

క్రమ సంఖ్య 

కొత్త రైల్వే లైన్ మార్గం 

లైన్ పొడవు 

(కిలోమీటర్లు)

కవర్ అయ్యే జిల్లాలు 

రాష్ట్రం 

1

గుణుపూరు-తేరుబలి (కొత్త లైన్)

73.62

రాయగడ 

ఒడిశా 

2

జునాగఢ్ - నవరంగపూర్ 

116.21

కలహండి,  నవరంగపూర్  

ఒడిశా 

3

బాదం పహాడ్ - కెందుజార్ ఘర్

82.06

కియోంఝర్, మయూర్‌భంజ్

ఒడిశా 

4

బంగ్రిపోసి - గోరుమహిసని

85.60

మయూర్‌భంజ్

ఒడిశా 

5

మల్కన్‌గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా)

173.61

మల్కన్‌గిరి, తూర్పుగోదావరి, భద్రాద్రి కొత్తగూడెం

ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ

6

బురమర - చకులియా

59.96

తూర్పు సింగ్‌భూమ్, ఝర్‌గ్రామ్, మయూర్‌భంజ్

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా

7

జల్నా - జల్గావ్

174

ఔరంగాబాద్

మహారాష్ట్ర 

8

బిక్రమశిలా - కటారియా

26.23

భాగల్పూర్

బీహార్ 

 

***



(Release ID: 2044195) Visitor Counter : 40