సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతు

Posted On: 08 AUG 2024 5:05PM by PIB Hyderabad

   భారతీయ పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచడానికి, చిన్న-మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి, అవి ప్రపంచ విలువ గొలుసులో పాల్గొనడాన్ని పెంచడానికి, భారత ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోగ్రామ్ ద్వారా వ్యాపారాన్నిసులభతరం చేయడం, ముద్ర ద్వారా రుణాల లభ్యతను మెరుగుపరచడం, స్టాండప్ ఇండియా మొదలైనవి ఇందులో కొన్ని చొరవలు. అలాగే,  సూక్ష్మ-లఘు-చిన్నపరిశ్రమల (ఎంఎస్‌ఇ)కు అవసరమైన మార్గదర్శకత్వం, చేయూత మద్దతును అందించడానికి దేశవ్యాప్తంగా 60 ఎగుమతి సులభతర కేంద్రాలను (ఇఎఫ్‌సి) కూడా స్థాపించింది. అంతర్జాతీయ సహకార పథకం కింద, విదేశాలలో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలు/ఫెయిర్లలో పాల్గొనడానికి, వస్తువులు, సేవల ఎగుమతికి సంబంధించిన వివిధ ఖర్చులను భరించడానికి ఎంఎస్‌ఎంఇలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. వీటికి అదనంగా, ఎంఎస్ఎంఇ ఛాంపియన్స్ పథకం, ఎంఎస్ఎంఇ పనితీరును పెంపొందించటం, వేగవంతగా చేయటం  కోసం (ఆర్ఏఎంపి) పథకం, రుణ అనుసంధాన మూలధన రాయితీ, సాంకేతికత ఉన్నతీకరణ పథకం (సి ఎల్ సి ఎస్ - టి యూ ఎస్), సూక్ష్మ, చిన్న సంస్థలు- క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (ఎం ఎస్ ఈ - సి డి పి), టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ ( టి సి ఎస్ పి ), కొనుగోలు, మార్కెటింగ్ పథకం  (పి ఎం ఎస్ ) తదితర పథకాలు కూడా ఇందులో వున్నాయి.

   విదేశీ పెట్టుబడులను (ఎఫ్ డి ఐ) మరింతగా ఆకర్షించడానికి, ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎఫ్ డి ఐ విధానాన్ని అమలు చేసింది. ఇందులో కొన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలను మినహాయించి, చాలా రంగాలు స్వయంచలిత మార్గం ద్వారా 100 శాతం  ఎఫ్ డి ఐకి తెరిచి ఉన్నాయి. రక్షణ, పెన్షన్, ఇతర ఆర్థిక సేవలు, ఆస్తి పునర్నిర్మాణ సంస్థలు, ప్రసార సంస్థలు, ఔషధాలు, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, నిర్మాణం, అభివృద్ధి, వైమానిక రంగం, విద్యుత్ ఎక్స్ఛేంజీలు, ఇ-కామర్స్ కార్యకలాపాలు, బొగ్గు ఖనిజాల త్రవ్వకం, కాంట్రాక్ట్ తయారీ, డిజిటల్ మీడియా, భీమా ఇంటర్‌మీడియరీలు, భీమా , పెట్రోలియం,సహజ వాయు, టెలికాం వంటి రంగాలలో అనేక విప్లవాత్మక, పరివర్తనాత్మక ఎఫ్ డి ఐ సంస్కరణలను ప్రభుత్వం అమలు చేసింది. అలాగే, ఎఫ్ డి ఐ విధాన  సమీక్షను  కొనసాగిస్తూనే ఉంటుంది, సమయానుకూలంగా గణనీయమైన మార్పులు చేస్తూనే ఉంటుంది. భారతదేశం పెట్టుబడిదారులకు  ఆకర్షణీయమైన, అనుకూలమైన గమ్యస్థానంగా ఉండేలా చూస్తుంది.

   రవాణా  ఖర్చులను తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రభుత్వం 2021 అక్టోబరు 13న ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ ఎం పి) ప్రారంభించింది. దానికి అనుగుణంగా, జాతీయ రవాణా  విధానం (ఎన్ ఎల్  పి) 2022 సెప్టెంబరులో ప్రకటించబడింది. ప్రధానమంత్రి గతిశక్తి ఎన్ ఎం పి ద్వారా సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిష్కరిస్తుంది; సేవలలో సామర్థ్యం (ప్రక్రియలు, డిజిటల్ వ్యవస్థలు మరియు నియంత్రణ చట్రం ), మానవ వనరుల అభివృద్ధి, ఎన్ ఎల్  పి ద్వారా సమగ్ర రవాణా కార్యాచరణ ప్రణాళిక  (సి ఎల్ ఏ పి ) ద్వారా పరిష్కరిస్తుంది. ఈ చొరవలన్నీ రవాణా ఖర్చులను తగ్గించడానికి, దేశంలో రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి, సమర్థ రవాణా పర్యావరణ వ్యవస్థ ద్వారా డేటా-ఆధారిత నిర్ణయం మద్దతు వ్యవస్థ కోసం ఉద్దేశించబడిన ఒక చట్రంను అందిస్తాయి.

   భారతదేశంలో అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి, వ్యాపార సౌలభ్యం (ఈ ఓ డి బి) కోసం ఉద్దేశించిన కింద ఉన్న చొరవలను సమన్వయం చేయడానికి పరిశ్రమ-అంతర్గత వాణిజ్యం (డి పి ఐ ఐ టి) కేంద్ర శాఖగా ఏర్పాటైంది. ఈ చొరవలు ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలను/పరిశ్రమలను కవర్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి.  వీటిలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు   (ఎంఎస్‌ఎంఇ) కూడా ఉన్నాయి.  వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక (బి ఆర్ ఏ పి ), బి-రెడీ అసెస్‌మెంట్, జన్ విశ్వాస్ వ్యాపారాలు, పౌరులపై సంబంధిత భారాన్ని తగ్గించడం వంటి అనేక కీలక చర్యలను డిపిఐఐటి సమన్వయం చేస్తుంది. ఇవన్నీ భారత వ్యాపార పర్యావరణ వ్యవస్థ మెరుగుకు, పెట్టుబడులను ఆకర్షించడానికి, నియంత్రణ వాతావరణాన్ని మరింత సానుకూలం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి.

   భారతదేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు (ఎం ఎంఎస్‌ఇ లు) వ్యాపార సౌలభ్యాన్ని సులభతరం చేయడానికి, ఎంఎంఎస్‌ఇ  మంత్రిత్వ శాఖ ఎం ఎంఎస్‌ఇ ల నమోదు కోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించింది.

  సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజె లోక్‌సభలో నేడు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

***



(Release ID: 2044188) Visitor Counter : 27


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP