భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాటాలు 360 వన్‌ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ చేతికి

Posted On: 07 AUG 2024 6:47PM by PIB Hyderabad

వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వాటాలను 360 వన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కొనుగోలు చేయుటకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది.

 

సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో 360 వన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ (360 ఫండ్) కేటగిరీ II ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌గా నమోదైంది. భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టడం కోసందీన్ని ఏర్పాటు చేశారు.  360 ఫండ్ కు 360 వన్ ఆల్టర్నేట్స్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (360 ఏఏఎమ్ఎల్) పెట్టుబడి మేనేజర్‌గా ఉంది. 360 ఏఏఎమ్ఎల్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, ఇది 360 వన్ డబ్ల్యుఏఎమ్ లిమిటెడ్ (360 ఓడబ్ల్యుఎల్) నియంత్రణలో పనిచేస్తుంది. 360 ఫండ్, 360 ఏఏఎమ్ఎల్‌లను కలిపి “360 వన్/ అక్వైరర్”గా సూచిస్తారు. 360 వన్ సంస్థలకు 360 ఏఏఎమ్ఎల్ పెట్టుబడి నిర్వహణ సేవలను అందిస్తుంది.

 

వాస్తు హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (విహెచ్ఎఫ్‌సిఎల్/టార్గెట్) భారతదేశంలో ఇతర సేవలతో పాటుగా రుణాలు, గృహ రుణాలు, ఇంటి విస్తరణ రుణాలు, ప్లాట్, నిర్మాణ రుణాలు, నిర్మాణ రుణం, ఆస్తిపై రుణాలు అలాగే సూక్ష్మ/ఎమ్ఎస్ఎమ్ఇ రుణాలను అందిస్తుంది. వాస్తు ఫిన్‌సర్వ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూర్తిగా విహెచ్ఎఫ్‌సిఎల్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అలాగే ఇది ఆర్థిక సేవలను అందించే వ్యాపారంలో నిమగ్నమై ఉంది, ప్రత్యేకించి ఎవరైనా వ్యక్తి, సంస్థ, కార్పొరేట్ బాడీ లేదా ఏదైనా ఇతర సంస్థలకు హామీపై లేదా హామీ లేకుండా రుణాలు, క్రెడిట్/ముందస్తు చెల్లింపును అందిస్తుంది. దానితో పాటు ఇది కార్, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్, నిర్మాణ సామగ్రి మొదలైన వాటి కోసం అలాగే ఆస్తిపై రుణాలను అందిస్తుంది.

 

360 ఫండ్, దాని వివిధ పథకాలు, అనుబంధ సంస్థల ద్వారా, టార్గెట్ (ప్రతిపాదిత కలయిక)లోని ఈక్విటీ షేర్ల సెకండరీ కొనుగోలు కోసం ప్రతిపాదిస్తుంది.

 

****


(Release ID: 2043115) Visitor Counter : 43


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP