గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎస్టీలకు 7.97 లక్షలకు పైగా ప్రత్యేక వికలాంగుల గుర్తింపు కార్డుల జారీ
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారివే 1,17,541 కార్డులు.
Posted On:
07 AUG 2024 3:01PM by PIB Hyderabad
15.07.2024 నాటికి, మొత్తం 1,09,55,968 ప్రత్యేక వికలాంగుల గుర్తింపు(యుడీఐడీ) కార్డులు జారీ కాగా.. అందులో 7,97,698 కార్డులు ఎస్టీలకు సంబంధించినవి ఉన్నట్లు https://www.swavlambancard.gov.in/ పోర్టల్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఎస్టీ వర్గానికి చెందిన యూడీఐడీ కార్డుల్లో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువున్న వారివి 1,17,541 కార్డులు ఉన్నాయి.
వికలాంగుల గణంకాల కోసం రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సెస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించే జన గణనపై సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన వికలాంగుల సాధికారత విభాగం(డీఈపీడబ్ల్యూడీ) ఆధారపడుతుంది.
వైకల్య ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు ఉద్దేశించిన ఈ యూడీఐడీ ప్రాజెక్టును.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలు నోటిఫై చేసిన సమర్థవంతమైన వైద్య అధికారుల ద్వారా వికలాంగుల సాధికార విభాగం అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రభుత్వ ప్రయోజనాలను అందించే వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తోంది.
ఈ మేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2043105)
Visitor Counter : 55