గనుల మంత్రిత్వ శాఖ
జాతీయ జిల్లా ఖనిజ సంస్థ (డిఎంఎఫ్)
Posted On:
07 AUG 2024 3:37PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2024 జూలై 20న జాతీయ జిల్లా ఖనిజ సంస్థ (నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్-డిఎంఎఫ్) పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర సంక్షేమ పథకం ద్వారా ప్రాజెక్టుల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం దిశగా ‘డిఎంఎఫ్’ నిధుల వినియోగంపై సమర్థ పర్యవేక్షణ దీని ప్రధాన లక్ష్యం. అలాగే నిర్ణయాల సంబంధిత ప్రక్రియలోనూ ఈ పోర్టల్ తోడ్పాటు ఉంటుంది. మరోవైపు వనరుల గరిష్ఠ కేటాయింపు, ప్రాధాన్యరంగాల్లో ప్రభావశీల సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలు, దిద్దుబాటు చర్యల కార్యాచరణ రూపకల్పన, ‘డిఎంఎఫ్’ల పరిధిలోని సమాజాలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాల గరిష్ఠీకరణ వంటివి కూడా ఈ పోర్టల్ ప్రాథమ్యాలుగా ఉంటాయి.
‘డిఎంఎఫ్’ ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణ, గతిశీల విశ్లేషణలు, ఉత్తమ పద్ధతుల పరస్పరానుసరణ, ఏకీకృత సమాచారం వంటివి ఇందులో లభ్యమవుతాయి. ప్రస్తుతం 23 రాష్ట్రాల్లోని 645 ‘డిఎంఎఫ్’లు ఈ పోర్టల్ అంతర్భాగమయ్యాయి.
కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2043094)
Visitor Counter : 56