హోం మంత్రిత్వ శాఖ
కొత్త నేర చట్టాలు
Posted On:
06 AUG 2024 4:34PM by PIB Hyderabad
నేర న్యాయ వ్యవస్థలో బాధితులను కేంద్ర స్థానంలో నిలిపే వైఖరిని మరింత ప్రోత్సహించడానికి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్) 2023లో ఒక నిబంధనను చేర్చడమైంది. అది ఏమిటి అంటే ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కన్నా ముందు, బాధితుల మాటలను వినడానికి అనువుగా ఒక అవకాశాన్ని న్యాయస్థానం ఇవ్వాలి అన్నదే. ఈ నిబంధన తో బాధితుల ఆందోళనలను గుర్తించి వాటికి స్థానాన్ని కల్పించడం ద్వారా నేర న్యాయ ప్రక్రియలో ప్రతిస్పందన శీలత్వం తో పాటు మొత్తం మీద నిష్పాక్షికత ఇనుమడిస్తుంది.
ఈ సమాచారాన్ని దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్ సభ లో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2042483)
Visitor Counter : 86