పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌ విమాన‌యాన రంగంలో పైలట్లు/సిబ్బంది కొర‌త లేదు


గ‌డచిన ఐదేళ్లలో 5,710 వాణిజ్య‌ పైలెట్ లైసెన్సులు జారీ;

భార‌త‌ విమాన‌యాన రంగం బ‌లోపేతం దిశగా 1976 వివిధ ర‌కాల
విమానాల కొనుగోలుకు ప్రధాన విమానయాన సంస్థల ఆర్డ‌ర్లు;

Posted On: 02 AUG 2024 3:18PM by PIB Hyderabad

   భార‌త‌ విమాన‌యాన రంగ స‌మ‌గ్రభివృద్ధికి తగిన వాతావ‌ర‌ణ సృష్టి దిశగా కేంద్ర‌ ప్ర‌భుత్వం జాతీయ పౌర విమాన‌యాన విధానం-2016ను ప్ర‌క‌టించింది. కొత్త విమానయాన ప్రాజెక్టులతోపాటు ఉడాన్ ప‌థ‌కం కింద విమానాశ్ర‌యాల్లో మౌలిక స‌దుపాయాల కల్పన కూడా ఇందులో భాగంగా ఉంది.

   భారత విమానయాన రంగంలో పైలట్లకు, సిబ్బందికి కొర‌త లేదు. అయితే, కొన్ని ర‌కాల విమానాలకు క‌మాండ‌ర్ల కొర‌త ఉన్నందువల్ల ‘విదేశీ విమాన సిబ్బందికి తాత్కాలిక అనుమతి’ (ఎఫ్ఎటిఎ) విధానం కింద మన విమానయాన సంస్థలు విదేశీ పైలట్ల సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నాయి.

దేశంలో గ‌డచి ఐదేళ్లలో జారీ చేసిన వాణిజ్య‌ పైలట్

లైసెన్సుల వివ‌రాలు కింది పట్టికలో చూడవచ్చు:

సంవత్సరం

జారీచేసిన లైసెన్సుల సంఖ్య

2019

744

2020

578

2021

862

2022

1165

2023

1622

2024 (జూలై 17 వరకు)

739

మొత్తం

5,710

   ‘ఐసిఎఒ’ రూపొందించిన ‘ఇఎఎస్ఎ’ నిబంధనలు నిర్దేశించే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఆమోదిత ప్రాథమిక వైమానిక శిక్షణ-నిర్వహణ సంస్థ సంబంధ ‘సిఎఆర్-147’ నిబంధనను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఎ) జారీ చేసింది.

   దీనికి అనుగుణంగా ఆమోదిత ప్రాథమిక శిక్షణ సంస్థలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆ తర్వాత ‘డిజిసిఎ’ నిర్వహించే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణులయ్యాక విమాన నిర్వ‌హ‌ణ ఇంజినీర్ల (ఎఎంఇ) లైసెన్స్ పొందేందుకు అర్హులవుతారు.

   దేశంలో ప్రస్తుతం ‘సిఎఆర్-147’ (ప్రాథమిక) కింద ‘డిజిసిఎ’ ఆమోదంగల ‘ఎఎంఈ’ శిక్ష‌ణ సంస్థ‌లు 57 ఉన్నాయి. భార‌త పౌర విమాన‌యాన ప‌రిశ్ర‌మ డిమాండుకు అనుగుణంగా ఈ సంస్థల నుంచి ఏటా 3,500 మంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకుంటున్నారు.

 

పౌర విమాన‌యాన రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్ర‌భుత్వం కింది చ‌ర్య‌లు చేపట్టింది:

  1. దేశంలో శిక్షణ పొందిన పైలట్ల సంఖ్య పెంపు లక్ష్యంగా భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ (ఎఎఐ) సరళీకృత వైమానిక శిక్షణ సంస్థ (ఎఫ్‌టిఒ) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద విమానాశ్రయ రాయల్టీ (‘ఎఫ్‌టిఒ’లు ‘ఎఎఐ’కి చెల్లించే రాబడి వాటా)ని రద్దు చేసింది. దీంతోపాటు భూమి అద్దెను గణనీయంగా హేతుబద్ధీకరించింది.
  2. ఈ నేపథ్యంలో ‘ఎఎఐ’ 2021లో టెండరు ప్రక్రియ ద్వారా దేశంలోని 5 విమానాశ్రయాల్లో 9 ‘ఎఫ్‌టిఒ’ స్లాట్లను కేటాయించింది. ఈ జాబితాలో బెళగావి (కర్ణాటక), జలగాఁవ్ (మహారాష్ట్ర), కలబురగి (కర్ణాటక), ఖజురహో (మధ్యప్రదేశ్),  లిలాబరీ (అస్సాం) విమానాశ్రయాలున్నాయి. అటుపైన 2022 జూన్‌లో రెండో దఫా టెండర్ల కింద మరో 5- భావ్‌నగర్ (గుజరాత్)కు 2, హుబ్బళ్లి  (కర్ణాటక), కడప (ఆంధ్రప్రదేశ్), కిషన్‌గఢ్ (రాజస్థాన్), సేలం (తమిళనాడు) విమానాశ్ర‌యాల‌కు ఒక్కొక్కటి వంతున 6 ‘ఎఫ్‌టిఒ’ స్లాట్లను కేటాయించింది.
  3. విమాన నిర్వ‌హ‌ణ ఇంజినీర్ల‌కు (ఎఎంఇ), విమాన‌యాన సిబ్బంది (ఎఫ్‌సి)కిగల డిమాండ్ మేరకు 2021 నవంబరు నుంచి ఆన్‌లైన్‌ ప‌రీక్ష‌ను (ఆన్‌లైన్‌ ఆన్ డిమాండ్ ఎగ్జామినేష‌న్- ఒఎల్ఒడిఇ) ‘డిజిసిఎ’ నిర్వ‌హిస్తంది. ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థులు తమకు అందుబాటులోగల స్లాట్లతోపాటు పరీక్ష తేదీ, స‌మ‌యం కూడా ఎంచుకోవచ్చు.
  4. ‘ఎఫ్‌టిఒ’లలో వైమానిక శిక్షణ కార్య‌క‌లాపాల‌ను ఆమోదించే హ‌క్కు కల్పన శిక్ష‌ణ నిపుణుల‌కు సాధికారతనిస్తూ ‘డిజిసిఎ’ నిబంధ‌న‌లను మార్పుచేసింది. ఈ హ‌క్కు ఇప్పటిదాకా చీఫ్ ప్ల‌యింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌ లేదా డిప్యూటీ ఫ్ల‌యింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లకు మాత్ర‌మే ఉండేది.

 

ప్ర‌ధాన విమాన‌యాన సంస్థ‌ల నుంచి కొత్త విమానాల‌ కొనుగోలు ఆర్డ‌ర్ల వివ‌రాలపై మ‌రింత స‌మాచారం కోసం  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2040687 ను చూడవచ్చు.

***


(Release ID: 2041214) Visitor Counter : 63