ఆయుష్
చిట్టచివరి అంచెదాకా ప్రామాణిక-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు ఆయుష్ మంత్రిత్వశాఖ సిద్ధం
Posted On:
02 AUG 2024 5:06PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వశాఖ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్) కోసం ‘ఎన్ఎబిహెచ్’- ఆయుష్ ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్ (ఎఇసిఎల్) పేరిట ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. దీనిద్వారా వెయ్యిమందికి మందికి శిక్షణ లక్ష్యంకాగా, ఇప్పటిదాకా 750 మంది ఉత్తీర్ణత ధ్రువపత్రాలు పొందారు.
దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రామాణిక-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల సౌలభ్యం పెంచాలన్నది ఈ శిక్షణ శిబిరం ధ్యేయం. ఈ మేరకు దేశమంతటా వృద్ధుల కోసం 2024 జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ 10,000 దాకా శిబిరాలు నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలోగల లబ్ధిదారులకు జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్నది ఆయుష్ మంత్రిత్వ శాఖ లక్ష్యం. తదనుగుణంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద 2024 సెప్టెంబర్ నాటికి 1,000 మందికి ‘ఎన్ఎబిహెచ్’ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్) ప్రాథమిక శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యానిగాను ఇప్పటిదాకా 750 మంది ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు పొందారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత జాతీయ నాణ్యత మండలి (క్యుసిఐ) భాగస్వామ్యంతో
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (లోగడ (ఆయుష్ ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు)ల కోసం ‘ఎన్ఎబిహెచ్’ ఆయుష్ ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్ కోర్సును మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల దిశగా ఇదొక ముందడుగని చెప్పవచ్చు.
వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా 2024 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా 10 వేల శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణ అవసరాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.
సాధారణ వైద్య పరీక్షల ద్వారా వృద్ధుల ఆరోగ్యంపై అంచనా వేయడమే ఈ శిబిరాల ప్రధానోద్దేశం. ఈ మేరకు వృద్ధుల అవసరాలకు తగినట్లు ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య నిర్ధారణ నిబంధనల ప్రకారం- ప్రాథమిక పరీక్షల నిర్వహణతోపాటు ఆ రికార్డులను భద్రపరుస్తారు. మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, హెర్నియా, ప్రోస్ట్రేట్, చర్మ, నేత్ర సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వృద్ధుల భవిష్యత్ అవసరాల దిశగా వైద్యులు సూచించిన ఆహార పద్ధతులు సహా సముచిత సలహాలు లభిస్తాయి. అలాగే సమీప ఆయుష్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా వారికి సేవలు అందుతాయి.
ఈ శిబిరాల నిర్వహణ కోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ కింద 9,673 కేంద్రాలను నమోదు చేయగా, వాటిలో ఇప్పటికే 2,957 శిబిరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుష్ కళాశాలలు, పరిశోధన మండళ్లు, జాతీయ సంస్థలు ఈ శిబిరాల ద్వారా సేవలందించడంలో పాలుపంచుకుంటున్నాయి.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో సమగ్ర, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్నది జాతీయ ఆయుష్ మిషన్ లక్ష్యం. ఈ దిశగా ఆయుష్ ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్, వృద్ధాప్య శిబిరాలను ప్రధానమైన ముందడుగుగా పరిగణించవచ్చు.
****
(Release ID: 2041210)
Visitor Counter : 53