ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన అనేది కాంపోనెంట్ పథకాల సమగ్ర ప్యాకేజీ; ఇది వ్యవసాయ క్షేత్రం నుండి రిటైల్ అవుట్ లెట్ వరకు సమర్థవంతమైన సప్లై చైన్ మేనేజ్ మెంట్ తో ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Posted On: 01 AUG 2024 5:38PM by PIB Hyderabad

ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్ పి ఐ) 2017-18 నుండి ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పి ఎం కె ఎస్ వై ) పేరుతో కేంద్ర ప్రభుత్వ గొడుగు పథకాన్ని అమలు చేస్తోంది. పిఎమ్ కెఎస్ వై ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రభుత్వ ముఖ్యమైన జోక్యాలలో ఒకటి. ఇది దేశంలో ఆహార సంరక్షణ, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో గణనీయమైన సహకారాన్ని అందించింది. పిఎంకెఎస్ వై వివిధ కాంపోనెంట్ పథకాల సమగ్ర ప్యాకేజీ, ఇది వ్యవసాయ క్షేత్రం నుంచి రిటైల్ అవుట్ లెట్ వరకు సమర్థవంతమైన సప్లై చైన్ మేనేజ్ మెంట్ తో ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పిఎంకెఎస్ వై కాంపోనెంట్ పథకాలు అయిన-మెగా ఫుడ్ పార్కులు (01.04.2021 నుండి నిలిపివేయబడ్డాయి), ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ , వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ , సంరక్షణ సామర్థ్యాల సృష్టి / విస్తరణ, వెనుకబడిన , ఫార్వర్డ్ లింకేజీల సృష్టి (01.04.2021 నుండి నిలిపివేయబడింది) , ఆపరేషన్ గ్రీన్స్,  ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్/ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందించడం.ద్వారా దేశవ్యాప్తంగా ఆన్-ఫార్మ్ , ఆఫ్-ఫార్మ్ సంరక్షణ,  ప్రాసెసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండింటిలోనూ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. పిఎంకెఎస్ వై ప్రారంభం నుంచి 2024-25 వరకు (30.06.202 వరకు) కాంపోనెంట్ పథకాల కింద రూ.22610.06 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.31308.24 కోట్లతో 1217 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తం 1217 ప్రాజెక్టుల్లో 651 ప్రాజెక్టులు పూర్తయ్యాయి, తద్వారా సంవత్సరానికి 48.91 లక్షల మెట్రిక్ టన్నులు, 183.523 లక్షల మెట్రిక్ టన్నుల సంరక్షణ, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి.

ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పిఎంఎఫ్ఎంఇ) పథకంలో సామర్థ్య పెంపు భాగం కింద, రైతులు , సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు "పంట కోత అనంతర నష్టాలను తగ్గించడానికి ఉత్పత్తుల విలువ జోడింపు" అనే అంశంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిఎంఎఫ్ఎంఇ పథకం కింద దేశవ్యాప్తంగా 76 కామన్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఆమోదించారు. తద్వారా రైతులు పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం ద్వారా వారి ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. 

ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రిన్యూర్ షిప్ అండ్ మేనేజ్మెంట్, తంజావూరు (స్వయంప్రతిపత్తి కలిగిన అకడమిక్ కమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) కు చెందిన పిఎంఎఫ్ఎంఇ సెల్ పిఎమ్ఎఫ్ఎంఇ పథకం గురించి, వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపు గురించి రైతులకు అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా వెబినార్లను నిర్వహిస్తోంది. వివిధ ప్రాసెసింగ్, విలువ జోడింపు, నిల్వ, నిర్వహణ అంశాలకు సంబంధించి వివిధ పంటల కోసం ఇప్పటి వరకు 26 వెబినార్లు నిర్వహించారు. ఈ వెబినార్ల ద్వారా దేశవ్యాప్తంగా 37,330 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. తంజావూరు నిఫ్టెమ్ కు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎఫ్ పి ఒలకు క్రమం తప్పకుండా వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్ / విలువ జోడింపు, నిల్వపై శిక్షణ ఇస్తోంది.  ఈ కేంద్రం 10,000 మంది లబ్ధిదారులను కవర్ చేస్తూ 1500 కి పైగా శిక్షణలను నిర్వహించింది, 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్) తన పరిశోధనా కార్యకలాపాల ద్వారా పంట కోత అనంతర యంత్రాలు, స్టోరేజ్ న నిర్మాణాలు,  ప్రోటోకాల్స్, అధిక విలువ / విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. పంటలు,  ఉత్పత్తుల కోత అనంతర నష్టాలను తగ్గించాల్సిన అవసరంపై రైతులు ,ఇతర భాగస్వాములలో అవగాహన తీసుకురావడానికి శిక్షణలను కూడా నిర్వహిస్తోంది. సాంకేతిక బదిలీ, శిక్షణ , మేళాల సమయంలో మాస్ కాంటాక్ట్, మేరా గావ్ మేరా గౌరవ్ (ఎంజిఎంజి) సందర్శనలు, బహిరంగ ఉపన్యాసాలు, వివిధ మీడియా ఛానెళ్ల ద్వారా ప్రచారం వంటి అవుట్ రీచ్ కార్యకలాపాల ద్వారా ఐసిఎఆర్ ఆధునిక స్టోరేజ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తోంది. వీటితో పాటు స్టోరేజ్ సంబంధిత అధ్యయనాలు, ఆధునిక స్టోరేజీ ప్రోటోకాల్స్ అభివృద్ధి, స్టోరేజీ సౌకర్యాలను అప్ గ్రేడ్ చేయడం కోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఐ సి ఎ ఆర్ కన్సల్టెన్సీ సేవలను కూడా అందిస్తోంది. ఇంకా, పంట కోత అనంతర తగ్గింపు సాంకేతికతలను ప్రదర్శిస్తోంది.  వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నిర్వహణ,  ప్రాసెసింగ్ కు సహాయపడే కొన్ని గాడ్జెట్లు , సాధనాలను షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక నిధుల ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిఎంకెఎస్ వై కాంపోనెంట్ స్కీంల కింద రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించడం లేదు. పిఎంకెఎస్ వై డిమాండ్ ఆధారితమైనది తప్ప ఇది రాష్ట్రం, జిల్లా, ప్రాంతం లేదా పంట నిర్దిష్టమైనది కాదు. 

పిఎంకెఎస్ వై కాంపోనెంట్ స్కీమ్ లు - మెగా ఫుడ్ పార్క్ లు (01.04.2021 నుండి నిలిపివేయబడ్డాయి), ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ , వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ , సంరక్షణ సామర్థ్యాల సృష్టి / విస్తరణ, వెనుకబడిన , ఫార్వర్డ్ లింకేజీల సృష్టి (01.04.2021 నుండి నిలిపివేయబడింది) , ఆపరేషన్ గ్రీన్స్ , ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్/ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందించడం - మొదలైనవి ఫుడ్ ప్రాసెసింగ్ , సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు దారి తీశాయి. 2018-19 నుంచి 2023-24 మధ్య కాలంలో పి ఎం కె ఎస్ వై లో పైన పేర్కొన్న కాంపోనెంట్ పథకాల కింద ఆమోదం పొందిన 553 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు రూ.2513.27 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్నీత్ సింగ్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని ఇచ్చారు.

 

***


(Release ID: 2040602) Visitor Counter : 100


Read this release in: English , Urdu , Hindi , Hindi_MP