బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖ 2024 జులైలో 74.07 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది

Posted On: 01 AUG 2024 4:26PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ 2024 జులై నెలలో మొత్తం మీద బొగ్గు ఉత్పత్తిలో 74.07 మిలియన్ టన్నుల (ఎమ్‌టి) స్థాయికి చేరుకొనిచెప్పుకోదగిన ఎదుగుదలను సాధించింది.  ఇది అంతకుముందు సంవత్సరంలో జులై నెలలోని 69.42 ఎమ్‌టి తో పోలిస్తే 6.69 శాతం వృద్ధిని సూచిస్తున్నది.

 

కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్ ) ఉత్పత్తి 2023 జులైలోని 53.67 ఎమ్‌టి తో పోల్చి చూసినప్పుడు 2.54 శాతం వృద్ధితో 2024 జులై నెలలో 55.04 ఎమ్‌టి కి పెరిగింది.  సంచిత బొగ్గు ఉత్పత్తి (2024 జులై వరకు చూస్తే) ఆర్థిక సంవత్సరం 2023-24 లో అదే కాలంలో 292.80 ఎమ్‌టి గా ఉన్నది కాస్తా,  ఆర్థిక సంవత్సరంలో 2024-25 లో 9.78 శాతం వృద్ధితో 321.45 ఎమ్‌టి (తాత్కాలికం) స్థాయి వద్ద ప్రశంసనీయమైన ఎదుగుదలను సాధించింది. 

 

సంచిత బొగ్గు డిస్పాచ్ లు 2023 జులై లో నమోదైన 76.05 ఎమ్‌టి తో పోల్చిచూసినప్పుడు 4.58 శాతం వృద్ధి రేటు కనబరచి, 2024 జులైలో 79.54 ఎమ్‌టి కి ఎగశాయి.  సంచిత కోల్ డిస్పాచ్ లు ఆర్థిక సంవత్సంర 2024-25లో  (2024 జులై వరకు చూస్తే) 341.61 ఎమ్‌టి   (తాత్కాలికం) గా నిలచాయి.  ఆర్థిక సంవత్సరం 2023-24 లోని ఇదే కాలంలో సంచిత కోల్ డిస్పాచ్ లు 316.54 ఎమ్‌టి గా ఉండగా, అవి ప్రస్తుతం 7.92 శాతం మేరకు ప్రశంసనీయ వృద్ధిని నమోదు చేశాయి.

 

ఈ సంవత్సరం జులై 31 నాటికి, బొగ్గు కంపెనీల వద్ద ఉన్న బొగ్గు నిలవ 86.8 ఎమ్‌టి కి చేరుకొని గమనార్హమైన పెరుగుదలను సాధించింది.  ఈ పెరుగుదల 43.85 శాతం వద్ద ఆకర్షణీయమైన వార్షిక వృద్ధిని ప్రతిబింబిస్తూబొగ్గు రంగం పనితీరు పటిష్టంగానుసమర్థంగాను ఉందని స్పష్టం చేస్తోంది.

 

పైన ప్రస్తావించిన గణాంకాలు బొగ్గు రంగానికున్న పడిలేచే సత్తువనుదేశ శక్తి (ఎనర్జీ) సంబంధ అవసరాలను తీర్చే నిబద్ధతను చాటిచెబుతున్నాయి.  బొగ్గు రంగంలో స్థిర వృద్ధిని సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ దృఢంగా ఉంది.

 

***


(Release ID: 2040515)
Read this release in: English , Urdu , Hindi , Hindi_MP