బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశంలో ఎన్నడూ లేనంతగా 2023-24లో బొగ్గు ఉత్పత్తి.
Posted On:
31 JUL 2024 3:49PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు కొరత లేదు. 2023-24లో దేశంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తి 997.828 మిలియన్ టన్నులుగా నమోదైంది. గత ఐదేళ్లలో ఉత్పత్తైన, దిగుమతి చేసుకున్న బొగ్గు వివరాలు ఈ క్రింది విధంగా ఉంది:
(మిలియన్ టన్నులలో)
సంవత్సరం
|
2019-20
|
2020-21
|
2021-22
|
2022-23
|
2023-24*
|
ఉత్పత్తి
|
730.874
|
716.083
|
778.210
|
893.191
|
997.828
|
దిగుమతి
|
248.537
|
215.251
|
208.627
|
237.668
|
261.001
|
* తాత్కాలిక అంచనాలు
1952 గనులు చట్టం, దాని ప్రకారం రూపొందించిన నియమనిబంధనలకు లోబడి బొగ్గు గనులు కార్యకలాపాలు, పరిపాలన ఉంటుంది. తగిన ఉప చట్టాలు, నియమనిబంధనలు, ప్రామాణికతలు, మార్గదర్శకాలు, తనిఖీలు, ప్రమాదాల దర్యాప్తు, అవగాహన కార్యకలాపాలు, ప్రమాద నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం ద్వారా డీజీఎంఎస్(డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) ఈ చట్ట అమలును చూసుకుంటోంది.
గనుల చట్టం-1952, మైన్స్ రూల్స్-1955, బొగ్గు గనుల నిబంధనలు-2017, బైలాలు, వీటి కింది చేసిన స్టాండింగ్ ఆర్డర్‌ల ప్రకారం రూపొందించిన చట్టబద్ధమైన నిబంధనలను పాటించేలా చూసుకోవటంతో పాటు గనుల్లో ప్రమాదాలు జరగకుండా కింది చర్యలు తీసుకుంటున్నారు.
1. ప్రతీ గనికి సంబంధించి ఉండే ప్రత్యేక ప్రమాదాల అంచనా వేయటం ద్వారా భద్రతా నిర్వహణ ప్రణాళికల(ఎస్ఎంపీ) తయారీ, అమలు.
2. ప్రధాన విపత్తుల నిర్వహణ ప్రణాళికల(పీహెచ్ఎంపీ) తయారీ, అమలు.
3. గనికి సంబంధించి ఉండే ప్రత్యేక ప్రమాదాలను అంచనా ఆధారంగా నిర్వహణ పద్ధతుల(ఎస్ఓపీ) రూపకల్పన, వాటిని పాటించేలా చూసుకోవటం.
4. మల్టీ డిసిప్లినరీ భద్రత మదింపు బృందాల ద్వారా గనుల భద్రతకు సంబంధించి ఆడిట్ నిర్వహించడం.
5. స్ట్రాటా నిర్వహణ కోసం అత్యాధునిక యంత్రాంగాన్ని సమకూర్చుకోవటం.
6. గనుల వద్ద పర్యావరణాన్ని పర్యవేక్షించడం.
7. ఓసీ గనుల విషయంలో నిర్దిష్ట భద్రతా చర్యలు:
* పేలుడు రహిత సురక్షిత మైనింగ్ కొరకు పర్యావరణ అనుకూల ఉపరితల మైనర్‌ల ఉపయోగం
* గనికి సంబంధించి ప్రత్యేకించిన ట్రాఫిక్ నిబంధనల రూపకల్పన, అమలు.
* హెచ్ఈఎంఎం ఆపరేటర్లకు సిమ్యులేటర్‌లపై శిక్షణ
* ప్రాక్సిమిటీ వార్నింగ్ పరికరాలను అమర్చిన డంపర్లు.. వెనుకవైపు చూసే అద్దాలు, కెమెరా.. ఆడియో-విజువల్ అలారం(ఏవీఎ).. ఆటోమేటిక్‌గా అగ్నిని గుర్తించే, తగ్గించే వ్యవస్థ తదితరాలు
* ఆపరేటర్ల సౌలభ్యం కొరకు సౌకర్యవంతంగా డిజైన్ చేసిన సీట్లు & ఏసీ క్యాబిన్‌లు.
* జీపీఎస్ ఆధారిత ఆపరేటర్ ఇండిపెండెంట్ ట్రక్ డిస్పాచ్ సిస్టమ్(ఓఐటీడీఎస్), కొన్ని పెద్ద ఓసీపీలలో(ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్) గని లోపల హెచ్ఈఎమ్ఎమ్‌ల కదలికలను ట్రాక్ చేయటానికి జియో ఫెన్సింగ్
* వెలుతురు స్థాయిని పెంచడం కొరకు హైమాస్ట్ టవర్‌లను ఉపయోగించి విద్యుత్ దీపాల అమరిక.
8. భూగర్భ బొగ్గు గనుల విషయంలో నిర్దిష్ట భద్రతా చర్యలు:
* ఎల్‌హెచ్‌డీలు, ఎస్‌డీఎల్‌లతో సెమీ యాంత్రీకరణను ప్రవేశపెట్టడం ద్వారా బాస్కెట్ లోడింగ్‌ను తొలగించడం.
* సమర్థవంతమైన రూఫ్ కంట్రోల్ వ్యవస్థ కోసం సిమెంట్ క్యాప్సూల్స్ స్థానంలో రెసిన్ క్యాప్సూల్స్‌ని వాడటం, వాటిని న్యూమాటిక్/హైడ్రాలిక్ రూఫ్ బోల్టింగ్ వ్యవస్థ ద్వారా బోల్టింగ్ చేయటం
* భూగర్భ శాస్త్రం ప్రకారం అనుమతించిన చోట, నిరంతర మైనర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించటం
* సీఎంఆర్ 2017లోని 252 నిబంధన(రెగ్యులేషన్) ప్రకారం అత్యవసర స్పందన, తరలింపు ప్రణాళికలు(ఈఆర్&ఈపీ)
* భూగర్భ గనులలో పర్యావరణాన్ని మెరుగుపరచడానికి గాలి శీతలీకరణ ప్లాంట్.
* ప్రమాద సమయంలో సహాయం చేసే సిబ్బంది ఉపయోగించుకునేందుకు కార్డ్‌లెస్ క్యాప్ ల్యాంపుల కొనుగోలు
9. గనుల భద్రతపై శిక్షణ:
* చట్ట నిబంధనల ప్రకారం ప్రారంభ, పునః నైపుణ్య శిక్షణ, పనిచేస్తున్నప్పుడు నైపుణ్య శిక్షణ
* హెచ్‌ఈఎంఎం ఆపరేటర్లకు సిమ్యులేటర్‌లపై శిక్షణ.
* వివిధ అంశాలపై నిరంతరం ముందు వరుసలో(ఫ్రంట్ లైన్) ఉండే గని అధికారుల నైపుణ్యాన్ని పెంచడం.
* భద్రతా కమిటీల సభ్యులు, కాంట్రాక్ట్ సిబ్బందితో సహా ఉద్యోగులందరికీ క్రమం తప్పకుండా అవగాహన కల్పించడం.
* గని అధికారులకు పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి వివిధ శిక్షణా కార్యక్రమాలు.
* సిమ్‌టార్స్(ఎస్ఐఎంటీఏఆర్ఎస్) గుర్తింపు పొందిన అధికారుల ద్వారా భద్రతా నిర్వహణపై శిక్షణ
10. గని భద్రతా తనిఖీ:
* అన్ని గని త్రవ్వకాల కార్యకలాపాలను తగిన సంఖ్యలో సమర్థులైన, చట్టబద్ధమైన సూపర్‌వైజర్‌లు, గని అధికారుల ద్వారా 24 గంటలూ పర్యవేక్షించడం.
* ప్రతి గనిలో నియమించబడిన వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్‌ల ద్వారా క్రమం తప్పకుండా తనిఖీ.
* గని స్థాయి, ఏరియా స్థాయి అధికారుల ద్వారా ఆకస్మిక బ్యాక్‌షిఫ్ట్ తనీఖీలు
* ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారుల ద్వారా క్రమం తప్పకుండా గని తనిఖీ
* ఉన్నతాధికారుల ద్వారా ఎప్పటికప్పుడు గనుల తనిఖీలు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి లోక్ సభకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2040074)
Visitor Counter : 71