మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

పాడి ప‌రిశ్ర‌మ‌ రంగంలో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌

Posted On: 31 JUL 2024 5:25PM by PIB Hyderabad

పాల ఉత్పత్తిలో భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ దేశంగా పేరు సంపాదించుకుంది. ప్ర‌పంచ పాల ఉత్ప‌త్తిలో 25శాతం భార‌త‌దేశంలోనే జ‌రుగుతోంది. గ‌త తొమ్మిదేళ్లుగా ప్ర‌తి ఏడాది 6శాతం వంతున దేశంలో పాల ఉత్ప‌త్తి పెరుగుతోంది. ప్ర‌తి రోజూ త‌ల‌స‌రి పాల ల‌భ్య‌త 459 గ్రాముల‌కు చేరుకుంది. ఇది దేశీయ డిమాండును అందుకోవ‌డంలో స్వ‌యం స‌మృద్ధిని సాధించింది. 

పాడి ప‌రిశ్ర‌మ‌ రంగ ప్ర‌గ‌తికోసం కేంద్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. వాటిలో ఒక‌టి ప‌శుసంవ‌ర్ధ‌క మౌలిక స‌దుపాయాల అభివృద్ధి నిధి ( ఏహెచ్ ఐ డి ఎఫ్‌) ఏర్పాటు. కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ శాఖకు చెందిన కీల‌క‌మైన ప‌థ‌క‌మిది. ప్ర‌ధాన మంత్రి ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ స్టిముల‌స్ పాకేజీ కింద 24-06-2020న దీన్ని ప్రారంభించ‌డం జ‌రిగింది. డెయిరీ ప్రాసెసింగ్ మౌలిక స‌దుపాయాల అభివృద్ధిని ( డిఐ డిఎఫ్ )ఇందులో క‌ల‌ప‌డంతో ఏ హెచ్ ఐ డి ఎఫ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చెందింది. మ‌రో మూడు సంవ‌త్స‌రాల‌పాటు విస్త‌రింప‌బ‌డిన ఈ నిధి మొత్తం రూ.29, 110. 25 కోట్లు. 

దేశీయ పాడి ప‌రిశ్ర‌మ వాటాను పెంచ‌డంకోసం కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క‌, డెయిరీ శాఖ కింద తెలిపిన ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. త‌ద్వారా దేశ జిడిపికి పాడి ప‌రిశ్ర‌మ‌ రంగం వాటా పెరిగేలా సాయం చేయ‌డం జ‌రిగింది. 
రాష్ట్రీయ గోకుల్ మిష‌న్ :  దేశీయ ప‌శుజాతుల‌ను సంరక్షించ‌డానికి ఉద్దేశించిన ప‌థ‌క‌మిది. ప‌శు జాతుల జ‌న్యు బ‌లోపేతం, పాల ఉత్ప‌త్తి ని పెంచ‌డం, పాలిచ్చే జంతువుల ఉత్పాద‌క‌త‌ను పెంచ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యాలు. 
జాతీయ పాడి ప‌రిశ్ర‌మాభివృద్ధి కార్య‌క్ర‌మం:  పాల నాణ్య‌త‌ను పెంచ‌డం, పాల ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డం, వ్య‌వస్థీకృత పాల సేక‌ర‌ణ వాటాను పెంచ‌డం ఈ ప‌థ‌కం ల‌క్ష్యాలు.
ప‌శుసంవ‌ర్థ‌క మౌలిక స‌దుపాయాల అభివృద్ధి నిధి :  పాల  ఉత్ప‌త్తుల ప్ర‌క్రియ‌ను ఆధునీక‌రించ‌డం, మౌలిక స‌దుపాయాలకు అద‌న‌పు విలువ‌ను చేకూర్చ‌డం మొద‌లైన‌వి ఈ ప‌థ‌కం ల‌క్ష్యాలు. 
పాడి ప‌రిశ్ర‌మ స‌హ‌కార సంస్థ‌ల‌కు, పాడి ప‌రిశ్ర‌మ కార్య‌క‌లాపాలను నిర్వ‌హిస్తున్న రైతు ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచే ప‌థ‌కం :  దీని ద్వారా రుణాల వ‌డ్డీ రాయితీల రూపంలో స‌హాయం చేయ‌డం జ‌రుగుతుంది. 
వీటికి తోడు కేంద్ర ప్ర‌భుత్వం ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, పాడి ప‌రిశ్ర‌మ రైతుల‌ మూల‌ధ‌న అవ‌స‌రాల‌ను తీర్చేలా వారికి కిసాన్ క్రెడిట్ కార్డ్ స‌దుపాయాన్ని  విస్త‌రించింది. 


రాజ్య‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి ప‌రిశ్ర‌మ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజ‌న్ సింగ్ అలియాస్ లాల‌న్ సింగ్ ఇచ్చిన రాత‌పూర్వ‌క స‌మాధాన‌మిది

***



(Release ID: 2040070) Visitor Counter : 56