ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూన్ 2024 వ‌ర‌కూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌ద్దుల మాస స‌మీక్ష వివ‌రాలు

Posted On: 31 JUL 2024 5:22PM by PIB Hyderabad

జూన్ 2024వ‌ర‌కూ కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌ద్దులను ఏకీకృతం (క‌న్సాలిడేటెడ్‌) చేసి సంబంధిత నివేదిక‌ల‌ను ప్ర‌చురించ‌డం జ‌రిగింది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. 
జూన్ 2024వ‌ర‌కూ కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఆదాయం రూ. 8,34,197 కోట్లు. (ఇది 2024-25 బడ్జెట్ అంచ‌నాల‌ మొత్తం ర‌శీదుల్లో 27.1 శాతం) ఇందులో ప‌న్నుల ఆదాయం రూ.5, 59, 633 కోట్లు (కేంద్రానికి వ‌చ్చిన మొత్తం), ప‌న్నేతర‌ ఆదాయం రూ.2,80, 044 కోట్లు కాగా రుణేతర మూల‌ధ‌న ర‌శీదుల మొత్తం రూ.4,520 కోట్లు. ప‌న్నుల పంపిణీకి సంబంధించి రాష్ట్రాల‌కు పంచిన మొత్తం రూ.2, 79, 502 కోట్లు.. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ కాలంలో ఇది రూ.42, 942 కోట్లు ఎక్కువ‌. 
ఇక ఈ స‌మ‌యానికి కేంద్ర‌ప్ర‌భుత్వం చేసిన వ్య‌యం విష‌యానికి వ‌స్తే ఇది రూ. 9, 69, 909 కోట్లు. (ఇది 2024-25 బ‌డ్జెట్ అంచ‌నాల్లో 20.4 శాతం). ఇందులో రెవిన్యూ అకౌంట్ కింద రూ.7,88, 858 కోట్ల‌ను, కాపిట‌ల్ అకౌంట్ కింద్ రూ.1,81,051 కోట్ల‌ను వ్య‌యం చేయ‌డం జ‌రిగింది. రెవిన్యూ వ్య‌యం మొత్తంలో రూ.2,64, 052 కోట్లను వ‌డ్డీల చెల్లింపుల‌కు ఖ‌ర్చుచేయ‌డం జ‌రిగింది. రూ.90, 174 కోట్ల‌ను ప్ర‌ధాన‌మైన రాయితీల‌కు చెల్లించ‌డం జ‌రిగింది. 

***


(Release ID: 2040066) Visitor Counter : 83