హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నివారణ’’ పథకం కింద ఆర్థిక సాయం

Posted On: 31 JUL 2024 4:37PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం 'పోలీస్', 'పబ్లిక్ ఆర్డర్' రాష్ట్ర పరిధి లోని అంశాలు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ చట్ట అమలు ((లా ఎన్ ఫోర్స్ మెంట్- ఎల్ఇఎ)  ఏజెన్సీల ద్వారా సైబర్ నేరాలతో సహా నేరాల నివారణ, గుర్తింపు, దర్యాప్తు,  ప్రాసిక్యూషన్ కు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  తమ ఎల్ఇఎ ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి చేపట్టే చొరవలకు కేంద్ర ప్రభుత్వం సలహాలు, వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. 

సైబర్ క్రైమ్ ఒక కఠినమైన సవాలు. విస్తారమైన, సరిహద్దులు లేని స్వభావం కారణంగా సైబర్ నేరస్తుడు ఎక్కడైనా కూర్చొని నేరాలకు పాల్పడవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో పౌరులు నివేదించిన అనుమానాస్పద మొబైల్ నంబర్ల ఆధారంగా, 2024 జనవరి 1 నుండి 2024 జూలై 22 మధ్య కాలంలో దేశంలో సైబర్ నేరాలు జరిగిన ప్రధాన నగరాలు , ప్రదేశాలలో డీగ్ (రాజస్థాన్), దేవ్ ఘర్ (జార్ఖండ్), నుహ్ (హర్యానా), అల్వార్ (రాజస్థాన్), నవాడా (బీహార్), పశ్చిమ ఢిల్లీ (ఢిల్లీ), నలంద (బీహార్), జమ్తారా (జార్ఖండ్),  మథుర (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్), బెంగళూరు అర్బన్ (కర్ణాటక), దుమ్కా (జార్ఖండ్), గౌతమ్ బుద్ధ నగర్ (ఉత్తరప్రదేశ్), జైపూర్ (రాజస్థాన్), ఖేర్తల్-తిజారా (రాజస్థాన్), నార్త్ 24 పరగణాలు (పశ్చిమ బెంగాల్), కోల్కతా (పశ్చిమ బెంగాల్), నార్త్ వెస్ట్ ఢిల్లీ (ఢిల్లీ), షేక్ పుర (బీహార్), సౌత్ వెస్ట్ ఢిల్లీ (ఢిల్లీ) ఉన్నాయి. 

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి ) తన ప్రచురణ "క్రైమ్ ఇన్ ఇండియా" లో నేరాలకు సంబంధించిన గణాంక డేటాను క్రోడీకరించి ప్రచురించింది.తాజా నివేదిక 2022 సంవత్సరానికి సంబంధించింది. సైబర్ నేరాలకు పాల్పడే నేరగాళ్లకు సంబంధించిన నిర్దిష్ట డేటాను ఎన్ సి ఆర్ బి ప్రత్యేకంగా నిర్వహించదు.

సైబర్ నేరాలను సమగ్రంగా, సమన్వయంతో ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది చర్యలను తీసుకుంది:

  1. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో, సమగ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్'(ఐ4సీ)ని అనుబంధ కార్యాలయంగా ఏర్పాటు చేసింది.

  2. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయ దృక్పథాన్ని పెంపొందించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా సైబర్ క్రైమ్ హాట్ స్పాట్లు/ బహుళ న్యాయపరిధి సమస్యలు ఉన్న ప్రాంతాల ఆధారంగా దేశం మొత్తాన్ని ఐ 4 సి కింద కవర్ చేసే విధంగా మేవాట్, జమ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం , గౌహతిలకు ఏడు జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్స్ (జెసిసిటి) ఏర్పాటు చేశారు. 2023లో హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, విశాఖపట్నం, లక్నో, రాంచీ, చండీగఢ్ లలో జె సి సి టి ల కోసం కోసం ఏడు వర్క్ షాప్ లు నిర్వహించారు.

  3. రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు దర్యాప్తు అధికారులకు (ఐఒలు ) ప్రారంభ దశ సైబర్ ఫోరెన్సిక్ సహాయాన్ని అందించడానికి ఐ4సీలో భాగంగా అత్యాధునిక 'నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (ఇన్వెస్టిగేషన్)'ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో సహాయపడటానికి నేషనల్ సైబర్ ఫోరెన్సిక్స్ లేబొరేటరీ (ఇన్వెస్టిగేషన్) ఇప్పటివరకు మొబైల్ ఫోరెన్సిక్స్, మెమరీ ఫోరెన్సిక్స్, సిడిఆర్ అనాలసిస్ వంటి సుమారు 10,200 సైబర్ ఫోరెన్సిక్స్ లో ఎల్ఇఎలకు తన సేవలను అందించింది.

  4. మహిళలు, చిన్నారుల పట్ల సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన సంఘటనలను ప్రజలు నివేదించడానికి వీలుగా ఐ4సీలో భాగంగా 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్' (https://cybercrime.gov.in)ను ప్రారంభించారు. ఈ పోర్టల్ లో పేర్కొన్న సైబర్ క్రైమ్ సంఘటనలు, వాటిని ఎఫ్ఐఆర్ లుగా మార్చడం , తదుపరి చర్యలను చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థ ల ద్వారా నిర్వహిస్తారు. 

  5. ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించడానికి, మోసగాళ్ల నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఐ4సీ కింద 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్'ను ప్రారంభించారు. ఇప్పటివరకు 7.6 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో రూ.2400 కోట్లకు పైగా ఆర్థిక మొత్తాన్ని ఆదా చేశారు. ఆన్ లైన్ సైబర్ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ '1930'ను అందుబాటులోకి తెచ్చారు.

  6. ధ్రువీకరణతో పాటు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్స్, ప్రాసిక్యూషన్ వంటి కీలక అంశాలపై ఆన్ లైన్ కోర్సు ద్వారా పోలీసు అధికారులు/ న్యాయాధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఐ4సీ కింద 'సైట్రెయిన్' పోర్టల్ పేరుతో మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సుల (ఎంఓఓసీ) ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేశారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 96,288 మంది పోలీసు అధికారులు రిజిస్టర్ చేసుకోగా, 70,992కు పైగా సర్టిఫికెట్లను పోర్టల్ ద్వారా జారీ చేశారు.

  7. ఇప్పటి వరకు 5.8 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 1,08,000 ఐఎంఇఐ లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.

  8. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు చెందిన 6,800 మంది అధికారులకు ఐ4సీ సైబర్ పరిశుభ్రత శిక్షణ ఇచ్చింది.

  9. 35,000 మందికి పైగా ఎన్ సిసి క్యాడెట్ లకు ఐ4సి సైబర్ పరిశుభ్రత శిక్షణ ఇచ్చింది.

  10. సైబర్ ఫోరెన్సిక్ కమ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీల ఏర్పాటు, జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకం, ఎల్ఈఏల సిబ్బంది కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణ,  సామర్థ్యాల పెంపునకు 'మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నివారణ (సి సి పి డబ్ల్యుసి )' పథకం కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.131.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అందించింది. 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్ కమ్ ట్రైనింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు.24,600 మందికి పైగా ఎల్ ఇ ఎ సిబ్బంది, న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్లకు సైబర్ నేరాల అవగాహన, దర్యాప్తు, ఫోరెన్సిక్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. 

  11. హైదరాబాద్ లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (ఎవిడెన్స్ )ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల ఏర్పాటు సైబర్ నేరాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో అవసరమైన ఫోరెన్సిక్ మద్దతును అందిస్తుంది, ఐటి చట్టం , సాక్ష్య చట్టం నిబంధనలకు అనుగుణంగా సాక్ష్యాలు , వాటి విశ్లేషణను సంరక్షించడం తో పాటు టర్న్అరౌండ్ సమయాన్ని తగ్గించింది.

  1. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. SMS, I4C సోషల్ మీడియా ఖాతా X (గతంలో ట్విట్టర్) (@CyberDost), ఫేస్ బుక్ (సైబర్ దోస్తీ4C), ఇన్ స్టాగ్రామ్ (సైబర్ దోస్తీ4C), టెలిగ్రామ్ (సైబర్ దోస్తీ4c), రేడియో ప్రచారం, బహుళ మాధ్యమాల్లో ప్రచారం కోసం మైగవ్ ను నిమగ్నం చేయడం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అవేర్ నెస్ వీక్ లను నిర్వహించడం, కౌమారులు/విద్యార్థుల కోసం హ్యాండ్ బుక్ ను ప్రచురించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని కూడా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో  ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.  

***


(Release ID: 2040053) Visitor Counter : 69