యు పి ఎస్ సి
సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ల(కార్య నిర్వాహక) ఎల్‌డీసీఈ 2024 తుది ఫలితాలను ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Posted On:
31 JUL 2024 1:54PM by PIB Hyderabad
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ల(కార్య నిర్వాహక) లిమిటెడ్ శాఖాపరమైన పోటీ పరీక్ష, 2024లో భాగంగా 10.03.2024 నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్ష నిర్వహించింది. 24.07.2024 నుంచి 26.07.2024 వరకు మౌఖిక పరీక్షలు జరిపింది. ఈ పరీక్షల ఆధారంగా, అభ్యర్థుల ఉత్తీర్ణత మేరకు కింద పేర్కొన్న అభ్యర్థులను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు(కార్య నిర్వాహక)గా నియమించడానికి సిఫార్సు చేయడమైంది.
2. వివిధ కేటగిరీల్లో నియామకాల కోసం సిఫార్సు అయిన వారు కింది విధంగా ఉన్నారు:
జనరల్ |
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
20
|
04
|
-
|
24
|
3. అభ్యర్థుల తుది ఎంపిక/నియామకం న్యూఢిల్లీలోని గౌరవ ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్న దివాకర్ పాండే, ఇతరులు వర్సెస్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతరులు, రిట్ పిటిషన్(సీ) నెంబరు.5877/2022లో తుది తీర్పుకు లోబడి ఉంటాయి.
4. పరీక్ష నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఖాళీల సంఖ్య ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ప్రభుత్వం నివేదించిన నియామకాల సంఖ్య కింది విధంగా ఉంది:
జనరల్ |
ఎస్సీ
|
ఎస్టీ
|
మొత్తం
|
20
|
04
|
-
|
24
|
5. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాంగణంలోని పరీక్షా హాలు వద్ద “సహాయక కేంద్రం” ఉంది. పరీక్ష/నియామకానికి సంబంధించిన సమాచారం/స్పష్టతను పని దినాల్లో 10:00 గంటల నుంచి 17:00 గంటల మధ్య పొందవచ్చు. 011-23385271/23381125 టెలిఫోన్ నెంబర్ల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. పరీక్ష ఫలితాలు కమిషన్ వెబ్‌సైట్ www.upsc.gov.in లో సైతం అందుబాటులో ఉంటాయి. అయితే, అభ్యర్థుల మార్కులు మాత్రం ఫలితాలు వెలువడిన తేదీ నుంచి 15 రోజుల లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
***
(Release ID: 2039577)