వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వ్యవసాయ రంగంలో స్టార్టప్ (అంకుర సంస్థలు) వ్యవస్థ
Posted On:
30 JUL 2024 6:33PM by PIB Hyderabad
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ( ఆర్ కె వి వై) కింద 2018-19నుంచి నూతన ఆవిష్కరణ, వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికతత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ విభాగం నిర్వహిస్తోంది. స్టార్టప్ ల( అంకుర సంస్థలు)కు ఆర్ధిక, సాంకేతిక మద్దతు ఇవ్వడంద్వారా నూతన ఆవిష్కరణల్ని, వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికతత్వాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. స్టార్టప్ సంస్థలకు శిక్షణ ఇచ్చి ప్రారంభదశలో చేయూతనివ్వడంకోసం, ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంకోసం ఐదు విజ్ఞాన భాగస్వాములు ( కేపీలు), 24 ఆర్ కె వివై వ్యవసాయ వాణిజ్య ఇంక్యుబేటర్లను నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమం కింద ఆలోచన దశలోనే రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఆ ఆలోచన కార్యరూపం దాల్చే దశలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఆయా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర సంస్థలకు రూ.25 లక్షలు అందిస్తున్నారు. దాంతో వారు తమ ఉత్పత్తులను, సేవలను, వ్యాపార వేదికలు మొదలైనవాటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం, వాటిని విస్తరించడం చేస్తారు.
ఈ కార్యక్రమం కింద 5 కేపీలు, 24 ఆర్ ఏబీఐలను నియమించారు. వ్యవసాయ స్టార్టప్ లను ప్రోత్సహించడానికి వాటిని వివిధ భాగస్వాములతో లింక్ చేయడానికిగాను వీలుగా ఒక వేదికను ఏర్పాటు చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం వివిధ జాతీయస్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిలో వ్యవసాయ అంకుర సంస్థల సదస్సులు, వ్యవసాయ ప్రదర్శనలు, సంతలు, వెబినార్లు,వర్క్ షాప్‌లు వున్నాయి.
1708 అంకుర సంస్థలకు రూ.122.50 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. నూతనావిష్కరణ, వ్యవసాయ పారిశ్రామికతత్వ అభివృద్ధి కార్యక్రమం కింద 2019-20నుంచి 2023-24వరకూ వివిధ కేపీలు, ఆర్ -ఏబీఐలద్వారా ఈ సాయాన్ని అందించడం జరిగింది. స్టార్టప్‌లకు అందించిన ఆర్ధిక సాయం వివరాలు సంవత్సరాలవారీగా ఇలా వుంది.
ఆర్థిక సంవత్సరం
|
సాయం పొందిన మొత్తం అంకుర సంస్థలు
|
అంకురసంస్థలకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ. కోట్లలో
|
2019-20
|
58
|
3.13
|
2020-21
|
588
|
27.43
|
2021-22
|
277
|
20.34
|
2022-23
|
253
|
24.35
|
2023-24
|
532
|
47.25
|
Total
|
1708
|
122.50
|
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ నాద్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానమిది.
***
(Release ID: 2039575)
Visitor Counter : 101