ఆయుష్
azadi ka amrit mahotsav

సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ రీసెర్చ్

Posted On: 30 JUL 2024 5:48PM by PIB Hyderabad

ఆరోగ్య పరిశోధనను ప్రోత్సహించటం, సహకారం, అభివృద్ధి లక్ష్యాలతో ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మధ్య 2023 మే 11న అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంలోని అంశాలు-
1. సమీకృత ఆరోగ్య పరిశోధన(ఇంటిగ్రేటీవ్ హెల్త్ రీసెర్చ్) కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మధ్య సహకారం, సమన్వయం

2. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ మధ్య పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం

అన్ని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల్లో(ఎయిమ్స్ ) ఆయుష్ -ఐసీఎంఆర్ సెంటర్స్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ ఇంటిగ్రేటివ్ హెల్త్‌ను ఏర్పాటు చేయడం ఈ ఒప్పందం ప్రాధాన్యాంశాల్లో ఒకటి.

ఈ కేంద్రాలకు సంబంధించి ముఖ్యమైనవి;

* ఆయుష్ వ్యవస్థను సంప్రదాయ బయో మెడిసిన్‌తో అనుసంధానం చేయడం ద్వారా సమీకృత ఆరోగ్య పరిశోధన విషయంలో ఎప్పటికప్పుడు మార్పు చెందే(డైనమిక్), శక్తివంతమైన వ్యవస్థను అభివృద్ధి చేయడం.. రోగనిర్ధారణ, నివారణ, ఆరోగ్యం సంరక్షణను ప్రోత్సహించటం, ఆరోగ్య పునరుద్ధరణ, చికిత్సా పద్ధతులకు సంబంధించిన ఆవిష్కరణల ద్వారా సమీకృత ఆరోగ్య సంరక్షణను ప్రజలకు అందించటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం.
* ప్రస్తుతం ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, వనరులను ఉపయోగించుకోవటం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యాధులకు సంబంధించి సమగ్ర ఆరోగ్య విధానాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి బలమైన సాక్ష్యాలను సృష్టించడం.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ఆయుష్), ఆయుష్ ఆసుపత్రులకు సంబంధించి భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల(ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్-ఐపీహెచ్ఎస్)ను ప్రభుత్వం 2024 మార్చి 4న ప్రకటించింది. ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం ద్వారా సేవలను అందించటంలో ఇప్పటికే ఉన్న అంతరాలను పూర్తిగా తగ్గించాలని ఈ ప్రమాణాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయుష్ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించి భౌతికంగా ఉండే మౌలిక సదుపాయాలను మాత్రమే కాకుండా అక్కడ అందించే సంరక్షణ నాణ్యత, మానవ వనరుల లభ్యత విషయంలో ప్రమాణాలు, సామర్థ్య పెంపు, మందులు, రోగనిర్ధారణ, పరికరాలు, పాలన మొదలైన అంశాలను ఈ ఫ్రేమ్‌వర్క్ కలిగి ఉంటుంది. 


రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***


(Release ID: 2039556) Visitor Counter : 55