జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూగర్భ జల వనరుల వినియోగం

Posted On: 29 JUL 2024 2:47PM by PIB Hyderabad

ప్రపంచంలోని భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారతదేశం ఒకటి, అలాగే ప్రపంచంలోని 17 శాతం జనాభా అవసరాలను తీర్చడానికి, ప్రపంచంలోని మంచినీటి నిల్వలలో దేశం దాదాపు 4 శాతం కలిగి ఉందనే వాస్తవంపై ప్రభుత్వానికి ఒక అవగాహన ఉంది. 

2023 సంవత్సరానికి భూగర్భ జల వనరుల మదింపు నివేదిక ప్రకారం, దేశంలోని ఏటా మొత్తం వెలికితీయగలిగే భూగర్భజల వనరు 407.21 బిలియన్ క్యూబిక్ మీటర్ (బిసిఎం)గా అంచనా. మొత్తం వార్షిక భూగర్భ జలాల వెలికితీత 241.34 బీసీఎమ్ అని అంచనా. 

నీరు రాష్ట్రానికి సంబంధించినది, భూగర్భ జలాలతో సహా నీటి వనరుల అభివృద్ధి, నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తన సంస్థలు, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సాంకేతిక మద్దతు, ఆర్థిక సహాయం అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను పూర్తి చేస్తుంది. దేశంలో మెరుగైన, సమర్థవంతమైన నీటి నిర్వహణ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని ముఖ్యమైన చర్యలు క్రింద ఇలా ఉన్నాయి:

  1. జాతీయ జల విధానం (2012) జల వనరులు, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించింది. దీని ప్రకారం నీటి వినియోగాన్ని పొదుపుగా ఉండేలా చూస్తూ, వినియోగించే నీటి ద్వారా అధిక లాభం పొందే వ్యవసాయ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ప్రధానంగా నీటి వృధాను నివారించడం, వంటశాలలు, బాత్‌రూమ్‌ల నుండి పట్టణ నీటి వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, రీసైకిల్ / పునర్వినియోగం కోసం పారిశ్రామిక కాలుష్య కారకాల పునరుద్ధరణను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి సారించే విధానం. ఈ పాలసీ అన్ని రాష్ట్రాలు/యూటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలు/కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఆమోదం కోసం పంపారు. 
  2. బ్యూరో అఫ్ వాటర్ యూస్ ఎఫిసిఎన్సీ (బిడబ్ల్యూయుఈ) దేశంలో నీటిపారుదల, గృహ నీటి సరఫరా, మునిసిపల్ మరియు/లేదా పారిశ్రామిక అవసరాలలో నీటి సమర్ధవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి ఎంఓజేఎస్ కింద ఏర్పాటు ఇది ఏర్పాటైంది.  రాష్ట్రాల సహకారంతో నీటి సంరక్షణ కోడ్‌లు, ఉపకరణాలు, సానిటరీ సామాగ్రి మొదలైన వాటి కోసం మార్గదర్శకాలను సూచించే బాధ్యతను కూడా బిడబ్ల్యూయుఈ  కలిగి ఉంది. 
  3. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సిజిడబ్ల్యూఏ) భూగర్భ జలాల సంగ్రహణ, నియంత్రణ, ప్రయోజనం కోసం ఎంఓజేఎస్ కింద ఏర్పాటు అయింది. దేశంలో భూగర్భజలాల సంగ్రహణ, వినియోగం సీజీడబ్ల్యూఏ ద్వారా 2020 అక్టోబర్ 24 నాటి మార్గదర్శకాల నిబంధనల ప్రకారం ఎన్ఓసిలను జారీ చేయడం ద్వారా నియంత్రిస్తారు. ఇవి పాన్ ఇండియా వర్తించే అవకాశం ఉంది. మార్గదర్శకాల ప్రకారం, 20 కేఎల్డి లేదా అంతకంటే ఎక్కువ భూగర్భ జలాలను తీసుకునే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఎస్టిపిని ఇన్‌స్టాల్ చేసి, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలి. ఇంకా, 100 కెఎల్డి కంటే ఎక్కువ భూగర్భ జలాలను సంగ్రహించే పరిశ్రమలు ద్వైవార్షిక నీటి ఆడిట్‌ను చేపట్టాలి, ఇది రీసైకిల్ / పునర్వినియోగం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించాలని సిఫార్సు చేయాలి.

https://jalshakti-dowr.gov.in/document/steps-taken-by-the-central-government-to-control-waterdepletion-and-promote-rain-water-harvesting-conservation/

ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.

 

***


(Release ID: 2039546)