హోం మంత్రిత్వ శాఖ
బాలల అక్రమ రవాణా
Posted On:
30 JUL 2024 4:28PM by PIB Hyderabad
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమకు నివేదించిన నేర గణాంకాలను క్రోడీకరించి తమ వార్షిక ప్రచురణ 'క్రైమ్ ఇన్ ఇండియా'లో ప్రచురిస్తుంది. తాజా నివేదిక 2022 సంవత్సరానికి సంబంధించినది. గత అయిదేళ్లలో అక్రమ రవాణాకు గురైన (18 ఏళ్ల లోపు) బాధితుల సంఖ్యపై స్థిర పెరుగుదల నమోదు కాలేదు.
గత ఐదేళ్లలో రక్షించబడిన బాధితుల సంఖ్య (18 సంవత్సరాల కంటే తక్కువ) క్రింద ఇవ్వబడింది:
క్ర.సం
|
సంవత్సరం
|
రక్షించబడిన బాధితులు (18 ఏళ్లలోపు వారు)
|
1
|
2018
|
2484
|
2
|
2019
|
2746
|
3
|
2020
|
2151
|
4
|
2021
|
2691
|
5
|
2022
|
3098
|
'పోలీస్', 'పబ్లిక్ ఆర్డర్' భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో గల "రాష్ట్ర జాబితా" లోని అంశాలు. బాలల అక్రమరవాణా వంటి నేరాలను నిరోధించడం, ఎదుర్కోవల్సిన బాధ్యత ప్రధానంగా సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంటుంది. ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారం అటువంటి నేరాలను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అర్హత ఉంది.
భారత ప్రభుత్వం బాలల అక్రమ రవాణా విషయంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది. పిల్లల అక్రమ రవాణాతో సహా మానవ అక్రమ రవాణాను నిరోధించడం, ఎదుర్కోవడంపై మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు జారీ చేసే వివిధ సలహాల రూపంలో అందిస్తుంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని జిల్లాలను కలిపేలా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను (ఏహెచ్టీయూ) ఆధునీకరించడం/ ఏర్పాటు చేయడం కోసం అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయాన్ని మంత్రిత్వ శాఖ అందించింది. మానవ అక్రమ రవాణా సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పోలీస్ స్టేషన్ స్థాయిలో అన్నింటిలో సంస్థాగత యంత్రాంగ ఏర్పాటుకు సూచించింది. మానవ అక్రమ రవాణా సమస్యను కేంద్రీకృతంగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి తాజా చొరవలు/ పరిణామాల గురించి పోలీసు/ న్యాయ అధికారులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో 'రాష్ట్ర స్థాయి సదస్సులు', 'జ్యుడీషియల్ కొలోక్వియమ్స్' నిర్వహించడంలో మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు/ యూటీలకు సహాయం చేస్తోంది.
దీనికి సంబంధించి నిర్దిష్ట సమాచారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు నివేదించబడలేదు.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2039541)
Visitor Counter : 73