సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

డిజిటల్ పాలనపై అయిదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎమ్ వి) భాగస్వామ్యంతో ఐఐఎమ్ వి లో మొదలుపెట్టిన సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి)


11 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమాచార-సాంకేతికత విభాగాల సీనియర్ అధికారులు 19 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు

Posted On: 30 JUL 2024 11:44AM by PIB Hyderabad

డిజిటల్ పాలనపై అయిదు రోజుల శిక్షణ కార్యక్రమం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎమ్ వి)లో ఈ నెల 29 న (సోమవారం) మొదలైంది.  సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి)ఐఐఎమ్-వి ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2024 జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరగనుంది.  ఈ కార్యక్రమంలో 11 రాష్ట్రాలకు చెందిన వేరు వేరు సమాచార-సాంకేతిక విజ్ఞాన (ఐటి) విభాగాలకు చెందిన కమిషనర్ప్రాజెక్ట్ డైరెక్టర్ప్రోగ్రామ్ డైరెక్టర్చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్అసిస్టెంట్ డైరెక్టర్జాయింట్ డైరెక్టర్ ల హోదాలలోని 19 మంది సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు.  ఈ అయిదు రోజుల కార్యక్రమాన్ని సమాచార-సాంకేతిక విజ్ఞానండిజిటల్ రంగాలలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారుల కోసం రూపొందించారు.  ఎలక్ట్రానిక్ మాధ్యమ ఆధారిత పాలన (ఇ-గవర్నెన్స్) ప్రాజెక్టులు సరికొత్తగా, సార్థకమయ్యే రీతిలో రూపకల్పన చేయడం, వాటిని పక్కాగా అమలుపరచడం కోసం అధికారులలో తత్సంబంధ అభిరుచినిసామర్థ్యాలను రంగరించడంప్రభావవంతమైన ప్రజా సేవలను అందజేయడానికి ఆధునిక డిజిటల్ సాంకేతికతలను సమర్థంగా వినియోగించేందుకు అవసరమైన నైపుణ్యాలనువ్యూహాలను వారికి బోధించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు.

 

సుపరిపాలన జాతీయ కేంద్రం (ఎన్‌సిజిజి) డైరెక్టర్ జనరల్పాలన సంస్కరణ-ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి) కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.  ఎన్‌సిజిజిభారత ప్రభుత్వ డిఎఆర్‌పిజిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం (ఐఐఎమ్ వి) లు కలసి మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం డిజిటల్ పాలనకు సంబంధించి ప్రభుత్వ అధికారుల్లో సామర్థ్య నిర్మాణానికి తోడ్పడనుందని శ్రీ వి. శ్రీనివాస్ అన్నారు.  సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూపాలన రూపురరేఖలు తరచుగా మార్పులకు లోనవుతుండడాన్ని గురించి  ‘‘కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: స్మార్ట్ ప్రభుత్వానికి ఒక పునాది’’ అనే అంశం పై తన సమర్పణ కు సంబంధించి సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు.  పాలన లో దక్షతను, అభివృద్ధి ని గరిష్ఠ స్థాయికి చేర్చడంలో సాంకేతిక విజ్ఞానం పోషించగల పరివర్తనాత్మక పాత్రను ఆయన వివరిస్తూపౌరులను ప్రభుత్వానికి సన్నిహితం చేయాలని నొక్కిచెప్పారు.

 

ఐఐఎమ్ విశాఖపట్నం డైరెక్టర్ప్రొఫెసర్ ఎమ్. చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూకార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ప్రక్రియలలో జవాబుదారుతనాన్నిపారదర్శకతనుప్రతిస్పందనశీలతను జోడించడం ద్వారా మెరుగైన పాలనను అందించగలిగిన సత్తా డిజిటల్ పాలనకు ఉంది.  అంతేకాకుండాఇది సార్వజనిక సేవల అందజేతను సులభతరంగాసమర్థంగాఆచరణయోగ్యంగా కూడా మార్చివేస్తుందని ఆయన అన్నారు.  ఐఐఎమ్-విశాఖపట్నం కోర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జోస్యుల శ్రీనివాస్ మాట్లాడుతూడిజిటల్ ఇండియాడిజిటల్ గవర్నెన్స్డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్,  బిజినెస్ ప్రాసెస్ రీఇంజినీరింగ్ఇఫెక్టివ్ ఛేంజ్ మేనేజ్‌మెంట్సమాచార భద్రత నిర్వహణఐటి ప్రాజెక్టు నిర్వహణసార్వజనిక సేవల అందజేతకై ఉద్దేశించిన డిజిటల్ మార్కెటింగ్డిజిటల్ ట్రస్ట్ - ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ఐటి ప్రాజెక్ట్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్డిజైన్ థింకింగ్ ఫర్ డిజిటల్ ఇన్నొవేషన్స్ ఎండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లు సహా ఈ కార్యక్రమంలో శిక్షణనిస్తున్న విస్తృత శ్రేణికి చెందిన అంశాలను గురించి విపులంగా వివరించారు.  అదనంగావివిధ రాష్ట్రాలలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపైనఅధ్యయన నమూనాలపైన వివరణాత్మక సమర్పణ లు ఈ కార్యక్రమంలో చోటు చేసుకోనున్నాయి.  ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌సిజిజి అసోసియేట్ ప్రొఫెసర్కోర్స్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. బిష్త్ వందన సమర్పణ చేశారు.

 

సామర్థ్యాల నిర్మాణం సంబంధిత కార్యక్రమాన్నంతటిని పర్యవేక్షిస్తున్నవారిలో ఐఐఎమ్‌వి కోర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ జోస్యుల,  ఎన్‌సిజిజి కోర్స్ డైరెక్టర్అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఎస్. బిష్త్అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ శర్మ లతో పాటు ఎన్‌సిజిజిఐఐఎమ్‌వి లకు చెందిన ప్రత్యేక శిక్షణ బృందం సభ్యులు ఉన్నారు.

 

 

 

 

***



(Release ID: 2039303) Visitor Counter : 34