గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వర్షాకాలంలో పట్టణాల్లో వరదలు

Posted On: 29 JUL 2024 1:08PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని 12వ షెడ్యూలు ప్రకారం పట్టణాల్లో భూవినియోగ నియంత్రణ, భవనాల నిర్మాణంతో సహా పట్టణ ప్రణాళికలు పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలు(యూఎల్బీలు)/పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల అధికార పరిధిలోనివి. వరద నియంత్రణ విషయంలో ఉపశమన చర్యలు, మురుగునీటి పారుదల ప్రణాళికలకు సంబంధించిన అంశాలు వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి. వివిధ పథకాలు/సలహా మార్గదర్శకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలకు, చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోంది. రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతును వీటి ద్వారా కేంద్రం అందిస్తుంది.

పట్టణ మురుగునీరు, వరద నిర్వహణను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ ఈ క్రింది పత్రాలు/ సలహా మార్గదర్శకాలను ప్రచురించింది:

 

1. యూఆర్‌డీపీఎఫ్ఐ మార్గదర్శకాలు, 2014:

https://mohua.gov.in/upload/uploadfiles/files/URDPFI%20Guidelines%20Vol%20I(2).pdf

 

2. పట్టణ వరదలకు సంబంధించి ప్రామాణిక కార్యచరణ ప్రక్రియ(ఎస్ఓపీ- స్డాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్)
http://www.tcpo.gov.in/sites/default/files/TCPO/schemes/SOP-Urban-flooding.pdf.

 

3. ప్రకృతి ఆధారిత పరిష్కారాలతో సహా సమ్మిళిత నీటి నిర్వహణ విధానాల అభివృద్ధిలో నగరాలకు వీలు కల్పించడానికి 2021లో నదీ కేంద్రీకృత పట్టణ ప్రణాళిక మార్గదర్శకాలు(రివర్ సెంట్రిక్ అర్బన్ ప్లానింగ్ గైడ్‌లైన్స్).


4. వర్షపు నీటి నిర్వహణ పార్కుల ఏర్పాటు విషయంలో మార్గదర్శకత్వ పత్రాన్ని ప్రచురించిన గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

https://mohua.gov.in/pdf/6566e1048ab41guidance-document-on-rainwater-harvesting-parks-final.pdf


వరదను తగ్గించడానికి, నివారించటానికి డ్రైనేజీలు/స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, మెరుగుదలను అమృత్ మిషన్‌లో చేర్చారు. రాష్ట్రాలు అందించిన వివరాల ప్రకారం.. 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.2,140 కోట్ల విలువైన 772 స్టార్మ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, రూ.878 కోట్ల విలువైన 69 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. దీంతో 3,556 నీరు గుమిగూడే స్థానాలను(వాటర్ లాగింగ్ పాయింట్స్) తొలగించగా, మరో 372 నీరు గుమిగూడే స్థానాల తొలగింపు అమలు దశలో ఉంది. అమృత్ కింద రూ.71.19 కోట్ల విలువైన 9 జలవనరుల ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించారు.

జలవనరులు, బావుల పునరుద్ధరణ అనేవి అమృత్ 2.0లో ప్రధాన అంశాలు. వర్షపు నీటిని వర్షపునీటి కాలువల ద్వారా జలాశయంలోకి సేకరించాన్ని (మురుగునీటిని/ వ్యర్థాలను స్వీకరించనివి) దీని కింద అనుమతించారు. అమృత్ 2.0 కింద ఇప్పటి వరకు రూ.5,432 కోట్ల విలువైన 2,713 జలవనరుల పునరుద్ధరణ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

ఈ మేరకు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

***



(Release ID: 2038822) Visitor Counter : 41