పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశీయుల సురక్షిత ప్రయాణం

Posted On: 29 JUL 2024 4:29PM by PIB Hyderabad

పర్యాటకుల భద్రత, రక్షణ అనేది ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న అంశమైనప్పటికీ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా టూరిజం పోలీసులను ఏర్పాటు చేయడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం ఈ విషయాన్ని వారి వద్దకు తీసుకువెళుతోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ కృషితో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనలు వివిధ రూపాల్లో పర్యాటక పోలీసులను మోహరించాయి.

పర్యాటకుల ప్రయాణాన్ని సాఫీగా, సురక్షితంగా సాగించాలనే ప్రయత్నాలలో భాగంగా, మంత్రిత్వ శాఖ దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులకు వారి ప్రయాణాలకు సంబంధించిన సమాచార సేవలను అందించడానికి 10 అంతర్జాతీయ భాషలు (జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్, జపనీస్, కొరియన్, అరబిక్), హిందీ, ఇంగ్లీష్ తో సహా 12 భాషలలో టోల్ ఫ్రీ నంబర్ 1800111363 లేదా 1363 సంక్షిప్త కోడ్ ద్వారా నిరంతర హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో ప్రయాణిస్తూ ఆపదలో ఉన్న పర్యాటకులకు తగిన మార్గదర్శకత్వం అందించడం కోసం ఈ హెల్ప్ లైన్ ఉపయోగపడుతుంది.

పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నిర్వహణలో ఉన్న హోటళ్లను స్టార్ రేటింగ్ సిస్టమ్ కింద వర్గీకరిస్తుంది. మంత్రిత్వ శాఖ హోటల్ ప్రాజెక్టులను స్వచ్ఛంద పథక వర్గీకరణ లేదా హోటళ్ల ఆమోదం లేదా హోటల్ ప్రాజెక్టుల ఆధారంగా ఆమోదం తెలుపుతుంది. మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, అగ్నిమాపక శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుండి సమ్మతి సర్టిఫికేట్, సిఆర్జెడ్ క్లియరెన్స్ (వర్తించే చోట), మురుగునీటి శుద్ధి కర్మాగారం మొదలైన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని హోటళ్లను వర్గీకరిస్తారు.

కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్యక్రమం 'ప్రసాద్' తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక విస్తరణ డ్రైవ్) కింద, కేదార్నాథ్ ధామ్ సమగ్ర అభివృద్ధికి మద్దతు ఇచ్చింది. బద్రీనాథ్ జీ ధామ్ లో తీర్థయాత్ర సౌకర్యాల కల్పనకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి, గంగోత్రి, యమునోత్రి ధామ్ లలో తీర్థయాత్రా మౌలిక సదుపాయాల పెంపునకు మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చింది.

పర్యాటక మంత్రిత్వ శాఖ భారత దేశంలో ఉన్న పర్యాటక గమ్యస్థానాలను, ఉత్పత్తులను దేశంలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తుంది. వివిధ సమావేశాలు, సోషల్ మీడియా సహా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. దేఖో అప్నా దేశ్ (డీఏడీ), భారత్ పర్వ్, ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ (ఐటీఎం), ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.

వీటితో పాటు, ఉత్తరాఖండ్ ప్రభుత్వ పర్యాటక శాఖ, వైద్య, పోలీసు, విపత్తు నిర్వహణ సంబంధిత విభాగాలతో కలిసి ప్రతి ఏడాది చార్‌దామ్ యాత్రను నిర్వహిస్తుంది. యాత్రికులకు సులభమైన, సౌకర్యవంతమైన యాత్ర కోసం, శాఖ ఈ క్రింది చర్యలను అమలు చేసింది:

1. యాత్రికుల ఆన్‌లైన్ నమోదు

2. వాట్సప్ రిజిస్ట్రేషన్

3. మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్

4. క్యూ నిర్వహణ, దర్శనం కోసం టోకెన్ పంపిణీ (పవిత్ర దర్శనం)

5. 24/7 పర్యాటకుల కొరకు హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్

6. డిజిటల్, ప్రింట్ మీడియా వివిధ వేదికల ద్వారా చార్ధామ్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం, వ్యాప్తి చేయడం.

చార్‌ధామ్ యాత్ర ఒక పవిత్ర ఘట్టమని, ఈ ప్రాంత భూభాగం, ఎత్తు కారణంగా వాతావరణ సూచనలు కీలకమని వారు తెలియజేశారు. యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి భారత వాతావరణ శాఖ (ఐఎండి) యాత్రా కాలానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక అంచనాలు, సలహాలను అందిస్తుంది.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్ సభకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***


(Release ID: 2038817) Visitor Counter : 45


Read this release in: English , Urdu , Hindi , Tamil