బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు నాణ్యత గురించిన సమాచారాన్ని పంచుకోవడం
Posted On:
29 JUL 2024 4:15PM by PIB Hyderabad
వివిధ గనుల నుండి వెలికితీసే బొగ్గు నాణ్యతను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సి.సి.ఓ) గ్రేడ్ చేస్తుంది, అటువంటి ఫలితాలను సంబంధిత బొగ్గు కంపెనీలు గనుల వారీగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతాయి. ఈ గనుల నుండి బొగ్గు సరఫరా పొందే వ్యక్తిగత వినియోగదారులు, నమోదు చేయబడిన ఏజెన్సీల జాబితా నుండి ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ శాంప్లింగ్ ఏజెన్సీ (టి.పి.ఎస్.ఎ)ని ఎంచుకుని, వారికి పంపిణీ చేయబడిన బొగ్గును వారి ద్వారా మరింత పరీక్షించుకునే వెసులుబాటు ఉంటుంది. టి.పి.ఎస్.ఎ.లు బొగ్గు నమూనాలను సేకరించి పరీక్షిస్తాయి, అలాగే వాటి ఫలితాలను విక్రేత, కొనుగోలుదారులు ఇరువురితో పంచుకుంటాయి. టి.పి.ఎస్.ఎ.ల ఫలితాలను వినియోగదారులు అలాగే విక్రేతలు కూడా సవాలు చేయవచ్చు. అలా సవాలు చేసిన సందర్భంలో, టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్.ఎ.బి.ఎల్) కోసం ప్రభుత్వ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్‌కు రిఫెరల్ చేయబడుతుంది. రిఫరీ నమూనా ఫలితం విక్రేత, కొనుగోలుదారులు ఇరువురికీ అందుబాటులో ఉంచబడుతుంది.
నాణ్యతలో సమస్యకు సంబంధించి క్రింది చర్యలు తీసుకోబడుతాయి:
బొగ్గు వినియోగదారుల కోసం స్వతంత్ర టి.పి.ఎస్.ఎ.లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు సి.ఐ.ఎల్ చేత నియమించబడుతాయి.
లోడింగ్ సమయంలో థర్డ్ పార్టీ ద్వారా నమూనా సేకరించు, విశ్లేషించు కార్యకలాపాలను నిర్వహించుటకు నియమించబడిన ఏజెన్సీల జాబితా నుండి ఒక టి.పి.ఎస్.ఎ. ను ఎంచుకోవడానికి బొగ్గు వినియోగదారులకు అవకాశం ఉంది.
బొగ్గు విశ్లేషణ తర్వాత టి.పి.ఎస్.ఎ.లు సమర్పించిన ఫలితాల ఆధారంగా తుది ఫలితాలు ఆమోదించబడతాయి. తదనుగుణంగా, డేటా సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లో నిర్వహించబడుతోంది, ఇది తుది సెటిల్మెంట్ కోసం వినియోగదారుల ద్వారా కూడా పునరుద్దరించబడుతుంది.
నమూనాలు సేకరించి విశ్లేషించుట కోసం వినియోగదారులు స్వతంత్ర థర్డ్ పార్టీని ఎంచుకోని సందర్భాల్లో, పంపిణీ చేయు వారి ద్వారా ప్రకటించబడిన బొగ్గు గ్రేడ్ పరిగణించబడుతుంది. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సి.సి.ఓ.) ద్వారా ఈ గ్రేడ్ ధృవీకరించబడుతుంది.
ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు రాజ్యసభలో సమర్పించారు.
***
(Release ID: 2038810)
Visitor Counter : 32