సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎమ్ఎస్‌ఎమ్‌ఈల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047
Posted On:
25 JUL 2024 4:59PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఈలకు అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎంఎస్ఎంఈలకు సకాలంలో, తగినంత ఆర్థిక సహాయం, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం, తగిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం విధానపరమైన ప్రాధాన్యతను ఇస్తోంది. ఎంఎస్ఎంఈల విషయంలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు:
* సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.500 లక్షల (01.04.2023 నుంచి) వరకు పూచీకత్తు లేని రుణం.
* ఎంఎస్‌ఎంఈ రంగంలోని అర్హత కలిగిన వాటికి వృద్ధి మూలధనాన్ని అందించడానికి స్వయం సమృద్ధ భారత నిధి(సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్) ద్వారా రూ.50,000 కోట్ల ఈక్విటీ సహాయం.
* ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద వ్యవసాయేతర రంగంలో కొత్త సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు రుణ ఆధారిత సబ్సిడీ(క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) అందిస్తోంది. ఉత్పాదక రంగంలో రూ.50 లక్షలు, సేవా రంగంలో రూ.20 లక్షల వరకు గల ప్రాజెక్టులకు.. ప్రాజెక్టు వ్యయంలో 15 శాతం నుంచి 35 శాతం వరకు మార్జిన్ మనీ సబ్సిడీ ఇస్తోంది. మహిళలతో సహా ప్రత్యేక కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు మార్జిన్ మనీ సబ్సిడీ.. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% అందిస్తోంది.
* టూల్ రూమ్స్ అండ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ కింద ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ జనరల్ ఇంజనీరింగ్, ఆటోమేషన్, హ్యాండ్ టూల్స్, ప్లాస్టిక్స్, ఆటో విడిభాగాలు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్.. ఫోర్జింగ్, ఫౌండ్రీ.. క్రీడా వస్తువులు.. చర్శం, పాదరక్షలు.. సువాసన, రుచులు మొదలైన రంగాలలో టెక్నాలజీ సెంటర్లు(టీసీలు)గా పిలిచే 18 టూల్ రూమ్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసింది. సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలతో పాటు, యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలలో పనిచేసే మానవ వనరులను పునః శిక్షణను ఇవి అందిస్తున్నాయి.
* వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం(ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలాప్మెంట్ ప్రోగ్రామ్- ఈఎస్‌డీపీ).. ఎస్సీ/ఎస్టీ మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, బీపీఎల్ వారితో సహా సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే యువకులకు స్వయం ఉపాధి, వ్యవస్థాపకతను వృత్తిగా చేసుకునే యువతకు మద్దతు ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకుంది.
* ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 20.12.2023న 'పంచామృత' లక్ష్యాలకు అనుగుణంగా ఎంఎస్ఈ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్(ఎంఎస్ఈ-గిఫ్ట్), ఎంఎస్ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ (ఎంఎస్ఈ-స్పైస్) పథకాలను ప్రారంభించింది.
I. ఎంఎస్ఎంఈల వృద్ధి, పోటీతత్వాన్ని నిర్ధారణ చేసుకుంటూ పర్యావరణ సుస్థిర ప్రాజెక్టులు, వాతావరణ మార్పుల అనుసరణ, ఉపశమన సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో తగిన సాంకేతిక సహకారంతో పాటు శుద్ధ/హారిత సాంకేతికత వల్ల పెరుగుతున్న వ్యయాన్ని తగ్గించడానికి, అధిగమించడానికి చిన్న తరహా పరిశ్రమలకు వ్యయం లో రాయితో కల్పిస్తూ సంస్థాగత ఆర్థిక సహాయం అందించడమే ఎంఎస్ఈ-గిఫ్ట్ పథకం లక్ష్యం. పునరుత్పాదక వనరుల ద్వారా శక్తి ఉత్పత్తి, తక్కువ హరిత గృహ(గ్రీన్ హౌస్) వాయు ఉద్గారాలు ఉండే స్వచ్ఛమైన రవాణా వంటి ప్రాజెక్టులు, హరిత భవనాల వంటి ఇంధన-సమర్థ ప్రాజెక్టులు, రీసైక్లింగ్ వంటి వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తదితర ప్రాజెక్టులను ఇందులో చేర్చారు.
Ii. వనరుల సమర్థత వినియోగాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం, ఎంఎస్ఈల పోటీతత్వాన్ని పెంచడం ఎంఎస్ఈ-స్పైస్ పథకం ప్రాథమిక లక్ష్యం. అర్హత కలిగిన పరిశ్రమలు.. గరిష్ట పరిమితి రూ.12.5 లక్షలకు లోబడి ప్లాంట్, యంత్రాల వ్యయంపై 25% మూలధన సబ్సిడీని పొందుతాయి.
ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పై చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2023-26కి ఎంఎస్ఈ-గిఫ్ట్ పథకానికి రూ.478 కోట్లు, 2023-27 సంవత్సరాలకు ఎంఎస్ఈ-స్పైస్ పథకానికి రూ.472.5 కోట్లు కేటాయించారు.
ఈ మేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
***
(Release ID: 2037386)
Visitor Counter : 79