విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లుల్లో వత్యాసం
Posted On:
25 JUL 2024 5:12PM by PIB Hyderabad
విద్యుత్ చట్టం-2003 లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ వినియోగదారులకు రిటైల్ విద్యుత్ విక్రయం నుంచి వినియోగదారుల వరకు విద్యుత్ టారిఫ్ ను నిర్ణయిస్తుంది. విద్యుత్ చట్టం, 2003 లోని సెక్షన్ 61 ప్రకారం, టారిఫ్ విధానంలో పొందుపరిచిన మార్గదర్శక సూత్రాల ప్రకారం టారిఫ్ ను నిర్ధారిస్తారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యుత్ ధరలను అమలు చేసే ప్రతిపాదన లేదు. అయితే ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా పోటీని ప్రోత్సహిస్తుంది. ఒక రోజులో నిర్దిష్ట సమయం కోసం పవర్ ఎక్సేంజ్ లో ఏకరీతి టారిఫ్ కనుగొన్నారు. దీని ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల నుంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేసే విద్యుత్ కు మార్కెట్ విభజన మినహా విద్యుత్ ధర అంతా ఒకేలా ఉంటుంది.
కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్ సభకు ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2037220)
Visitor Counter : 94