పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పాలిథిన్ బ్యాగులపై తప్పనిసరి నిషేధం

Posted On: 25 JUL 2024 1:34PM by PIB Hyderabad

పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 12 న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021 ను నోటిఫై చేసింది, తక్కువ ఉపయోగం , అధిక చెత్త వేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించిన  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను 2022 జూలై 1 నుండి నిషేధించింది. నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు, వాడకంపై 2022 డిసెంబర్ 31 నుంచి నిషేధం విధించింది. 2021 సెప్టెంబర్ 30 నుంచి చదరపు మీటరుకు 60 గ్రాముల కంటే తక్కువ బరువున్న (జి ఎస్ ఎం) నాన్ వోవెన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించారు. ఇంకా, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు  2016కి మించి, సవరించిన విధంగా,రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు / లేదా గుర్తించిన సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై పూర్తి లేదా పాక్షిక నిషేధానికి సంబంధించిన నిబంధనలను ప్రవేశపెట్టడానికి నోటిఫికేషన్లు / ఉత్తర్వులను జారీ చేశాయి. ఆ వివరాలు పట్టిక లో ఉన్నాయి.

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016 అమలును బలోపేతం చేయడానికి , గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని అమలు చేయడానికి ఈ క్రింది చర్యలు తీసుకున్నారు. 

(i)  గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన, సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/ అడ్మినిస్ట్రేటర్ అధ్యక్షతన మొత్తం 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాయి. గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తొలగించడానికి సమన్వయ చర్యలు తీసుకోవడానికి,  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016ను సమర్థవంతంగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది.

(ii)  నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీకి ముడిసరుకు సరఫరా చేయవద్దని ఇప్పటికే ప్లాస్టిక్ ముడిసరుకు తయారీదారులకు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 5 కింద ఆదేశాలు జారీ అయ్యాయి.

(iii) గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం , ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి -(ఎ) సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి జాతీయ డ్యాష్ బోర్డు, (బి) సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అంగీకారం కోసం సిపిసిబి మానిటరింగ్ మాడ్యూల్ ,  (సి) సిపిసిబి ఫిర్యాదుల పరిష్కార యాప్ అనే మూడు ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లు పనిచేస్తున్నాయి

(iv) జూలై 2022 నుండి గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని అమలు చేయడానికి సిపిసిబి, ఎస్ పి ఎస్ బి లు  / పిసిసిలు ,  స్థానిక అధికారులు దేశవ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ ప్రచారాలు చేపట్టారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎన్ ఫోర్స్ మెంట్ క్యాంపెయిన్ల సందర్భంగా మొత్తం 853832 తనిఖీలు నిర్వహించారు. వీటిలో 344689 కేసుల్లో ఉల్లంఘనలను గుర్తించి సుమారు రూ.19,05,13,471/- జరిమానా విధించారు. , 19,49,535 కిలోల ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు.

(v)  పండ్లు, కూరగాయల మార్కెట్లు, హోల్ సేల్ మార్కెట్లు, స్థానిక మార్కెట్లు, పూల వ్యాపారులు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను తయారు చేసే యూనిట్లలో  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధాన్ని అమలు చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డ్రైవ్. లు చేపట్టవలసిందిగా లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

(vi)  సైన్స్ అండ్ టెక్నాలజీ , బయోటెక్నాలజీ శాఖలు పథకం మార్గదర్శకాల ప్రకారం నిషేధిత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల కోసం పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తాయి. సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ-  ఎంఎస్ఎంఇ యూనిట్లకు మద్దతును అందించడానికి పథకాలను కలిగి ఉంది, వీటిలో గతంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీలో పాల్గొన్న అటువంటి యూనిట్లు ప్రత్యామ్నాయాలు / ఇతర ఉత్పత్తులకు మారడానికి కూడా మద్దతు లభిస్తుంది. 

అనుబంధం

ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు/వస్తువుల తయారీ, వినియోగం, అమ్మకం దిగుమతి నిర్వహణను నిషేధించడానికి నోటిఫికేషన్

(ఎస్ పిసిబిలు/పిసిసిలు సమర్పించిన వార్షిక నివేదికలలో లభ్యమయ్యే డేటా ఆధారంగా)

 

వరస నెం.

రాష్ట్రం/కేంద్ర పాలితప్రాంతం

పూర్తి లేదా పాక్షిక నిషేధం

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తేదీ, సంఖ్య 

రిమార్క్ లు

1.

అండమాన్, నికోబార్

పూర్తి నిషేధం

తేదీ:02.08.2010

నోటిఫికేషన్  నెం.202

ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీ, నిల్వ, దిగుమతి, పంపిణీ, రవాణా, రీసైకిల్, అమ్మకం, వాడకంపై సంపూర్ణ నిషేధం

2.

ఆంధ్రప్రదేశ్

 

సమాచారం లేదు

తాడిపత్రి, విజయవాడ, తిరుపతి, బొబ్బిలి వంటి కొన్ని పట్టణ స్థానిక సంస్థలు మందంతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించాయి. అన్ని స్థానిక సంస్థలు సొంతంగా నిషేధంపై నిర్ణయం

తీసు కున్నాయి. 

3.

అరుణాచల్ ప్రదేశ్ 

పాక్షిక నిషేధం

తేదీ:16.07.2019

నోటిఫికేషన్ నెం.

FOR.129/E(A)/2019/1271 3-60

50 మైక్రాన్ల < ప్లాస్టిక్ తయారీ, నిల్వ, స్టాక్ , అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించింది.

4.

అస్సాం  

 

నోటిఫికేషన్ వివరం లేదు

 

5.

బీహార్ 

పూర్తి నిషేధం

తేదీ:24.10.2018

నోటిఫికేషన్ నెం.

943(అర్బన్) తేదీ 11.12.2018 

నోటిఫికేషన్ 1043

ప్లాస్టిక్ క్యారీబ్యాగుల తయారీ, నిల్వ, దిగుమతి, పంపిణీ, రవాణా, రీసైకిల్, అమ్మకం మరియు వాడకంపై పూర్తి నిషేధం (మందం తో సంబంధం లేకుండా)   

6.

చండీఘర్ 

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం.

ED2019/1648

తేదీ:27.09.2019

ప్లాస్టిక్ వస్తువుల తయారీ, నిల్వ, దిగుమతి, అమ్మకం, రవాణా , పారవేయడంపై పూర్తి నిషేధం

7.

ఛత్తీస్ ఘడ్

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ F 5-7/18/2011 

--------------------

తేదీ:24.12.2014(గెజిట్)

తేదీ :27-09-2017

నోటిఫికేషన్ నెం.

क्रमाााांकएफ 05- 88/2014/32

తయారీ, నిల్వపై పూర్తి నిషేధం,

 

పాలిథిన్/ప్లాస్టిక్ క్యారీబ్యాగుల దిగుమతి, రవాణా, రీసైకిల్, అమ్మకం , ఉపయోగం.

 

ఇంకా నిషేధిత షార్ట్ లైఫ్ పివిసి , క్లోరినేటెడ్ ప్లాస్టిక్ కోసం

8.

డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలీ

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం.

PCC/DMN/ప్లాస్టిక్

బ్యాగ్స్/12-13-473

తేదీ:24-01/2014

అన్ని రకాల ప్లాస్టిక్ సంచుల వాడకం, అమ్మకం/ నిల్వను నిషేధించడం

9.

ఢిల్లీ  

 

సమాచారం లేదు

పి డబ్ల్యు ఎం నిబంధనలకు అదనంగా ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 

జారీ కాలేదు 

10.

గోవా

పూర్తి నిషేధం

సవరణ బిల్లు - ది గోవా నాన్ బయో డిగ్రేడబుల్ గార్బేజ్

తేదీ:08.08.2019

ప్లాస్టిక్ (క్యారీబ్యాగులు, కప్పులు, ఫోర్కులు, పేపర్ ప్లేట్లు, స్పూన్లు) ఇతర నాన్ బయోడిగ్రేడబుల్ వస్తువుల.

తయారీ, నిల్వ, దిగుమతి, రవాణా, రీసైకిల్, అమ్మకం ,  వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది.

11.

గుజరాత్ 

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం.

V1,1(14/Env-10-2008-2001-E

తేదీ:25-06-2011

 

12.

హర్యానా 

పూర్తి నిషేధం

తేదీ: 20 ఆగస్టు,2013

ప్లాస్టిక్ క్యారీబ్యాగుల తయారీ, స్టాక్, దిగుమతి, రవాణా,  

రీసైకిల్ చేయడం, అమ్మడం  ఉపయోగించడం పై పూర్తి నిషేధం

13.

హిమాచల్ ప్రదేశ్

పూర్తి నిషేధం

 

క్యారీబ్యాగులు (పరిమాణంతో సంబంధం లేకుండా), పాలిథిన్, నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్, డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్ల, అద్దాల వాడకంపై పూర్తి నిషేధం,

14.

జమ్ము కాశ్మీర్

పాక్షిక నిషేధం

నోటిఫికేషన్: SRO-45 ఆఫ్ 2017, తేదీ 03.02.2017

50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్ క్యారీ బ్యాగులపై పాక్షిక నిషేధం

15.

జార్ఖండ్

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం.

3/ప్రయ ప్రడు -52/2007-3900

తేదీ 15-09-2017

మొత్తం రాష్ట్రం లో ప్లాస్టిక్ క్యారీబ్యాగుల

తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, అమ్మకం,  వినియోగంపై సంపూర్ణ నిషేధం

16.

కర్ణాటక 

పూర్తి నిషేధం

తేదీ:11-03-2016

నోటిఫికేషన్ నెం. FEE17 EPC2012, బెంగళూరు

ప్లాస్టిక్ బ్యానర్లు, బంటింగ్ లు, క్యారీబ్యాగులు (ప్లాస్టిక్ & కంపోస్టేబుల్), కప్పులు, క్లింగ్ ఫిల్మ్ లు, ఫ్లెక్స్, జెండాలు, ప్లేట్లు, స్పూన్లు , ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ తో తయారు చేసిన షీట్లు , సూక్ష్మజీవుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

17.

కేరళ  

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం. G.O. (Ms)No. 6/2019Env, తేదీ 27-11-2019

G.O. (Ms)No. 2/2020/ENVT

తేదీ 27-01-2020

G.O. (Ms)No. 4/2020 Envt తేదీ 16-02-2020

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ , ప్లాస్టిక్ క్యారీబ్యాగులు (ప్లాస్టిక్ , కంపోస్టేబుల్) పై సంపూర్ణ నిషేధం

18.

లక్షద్వీప్

పూర్తి నిషేధం

తేదీ 25.01.2019

నోటిఫికేషన్ నెం.F.No.:66/33/2019

అన్ని మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ కోటెడ్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ జెండాలు, చుట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ షీట్లు/ఫిల్మ్ లు, డైనింగ్ టేబుల్ కవర్లుగా ఉపయోగించే ప్లాస్టిక్ షీట్లు, థర్మోకోల్ కప్పులు, ప్లేట్లు, ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ కప్పులు , ప్లేట్లు, ప్లాస్టిక్ టీకప్పులు, ప్లాస్టిక్ టీకప్పులు, వాటర్ పౌచ్ లు/ప్యాకెట్లు/పిఇటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్,స్ట్రాలు సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం: 

19.

మధ్యప్రదేశ్

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ F5-2-2015-18-5 తేదీ 24.05.2017

ప్లాస్టిక్ క్యారీబ్యాగుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, అమ్మకం , వాడకం పై నిషేధం

 

20.

మహారాష్ట్ర

పూర్తి నిషేధం

నో ప్లాస్టిక్ -2018/C.R-24/TC-4

నోటిఫికేషన్, తేదీ 23.3.2018 , సవరణ తేదీ 11.4.2018, 30.06.2018, 14.06.2019

మహారాష్ట్ర ప్లాస్టిక్ ,

థర్మోకోల్ ఉత్పత్తులు (తయారీ, వినియోగం, అమ్మకాలు, రవాణా,హ్యాండ్లింగ్  స్టోరేజ్) ద్వారా పరిమాణం  మందంతో సంబంధం లేకుండా హ్యాండిల్ ఉన్న లేదా లేని ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, చెంచాలు మొదలైన సింగిల్ యూజ్ డిస్ పోజబుల్.p వస్తువులు, నాన్ వోవెన్ పాలీప్రొపైలిన్ వంటి కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులపై పూర్తిగా నిషేధ

21.

మణిపూర్

పూర్తి నిషేధం

తేదీ:12-09-2017

నోటిఫికేషన్ నెం. 56/38//39-for & Envt

ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకం, నిల్వ , అమ్మకాలపై పూర్తి నిషేధం

22.

మేఘాలయ

పాక్షిక నిషేధం

తేదీ:16-12-2017

నోటిఫికేషన్ నెం. MPCB/TB-144(B)2016-2017/79

50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ సంచుల వాడకం,  అమ్మకాలను నిషేధిస్తూ బహిరంగ నోటీసు 

జారీ చేశారు

23

మిజోరాం

పాక్షిక aనిషేధం

01.08.2019 నుంచి ఐజ్వల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అమలు 

50 మైక్రాన్ల కంటే తక్కువ

ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై సంపూర్ణ నిషేధం

24.

నాగాలాండ్ 

పాక్షిక aనిషేధం

తేదీ: 29 నవంబర్,2018

నోటిఫికేషన్ నెం:UDD/7-GEN/07-PWM/2018

50 మైక్రాన్ల లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం

 

25. 

ఒడిశా

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ ఆర్డర్ నెం..18441

తేదీ 30.09.2019

రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ పరిధిలో ఏ ఆకారం, పరిమాణంలోనైనా ఉండే పాలిథిన్ క్యారీ బ్యాగులను నిషేధించారు.

ఒడిశా ప్రభుత్వం.. పైన పేర్కొన్న ఉత్తర్వులో ,ఏదైనా వస్తువులు, వస్తువు లేదా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి, పంపిణీ చేయడానికి లేదా ప్యాకేజింగ్ చేయడానికి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్ షీట్లను ఉపయోగించ డాన్ని 

కూడా నిషేధించింది.

26. 

పుదుచ్చేరి

పూర్తి నిషేధం

సమాచారం లేదు

02.08.2019 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లపై సంపూర్ణ నిషేధం.

27.

పంజాబ్

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం: 5/18/2016-4Ig4/692717/1 తేదీ 18.02.2016

స్.O.438/P.A

9/1994/30/2016

తేదీ 29-03-2016

ప్లాస్టిక్ క్యారీబ్యాగుల తయారీ, నిల్వ, పంపిణీ, రీసైకిల్, అమ్మకం,  వాడకం పై పూర్తి నిషేధం 

28. 

రాజస్తాన్

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ తేదీ: 21.07.2010

ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ ల వాడకం, నిల్వ , అమ్మకాలపై పూర్తి నిషేధం

29. 

సిక్కిం

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం: GOS/UD&HD97-98/6(85)

తేదీ:04-06-1998

ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం , వినియోగం, నిల్వపై పూర్తి నిషేధం

30

తమిళనాడు

పూర్తి నిషేధం

తేదీ:25.06.2018

నోటిఫికేషన్ నెం: G.O.(Ms).No.84,tedi2506-2018

"సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్" అంటే ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, జెండాలు, ఆహారం చుట్టడానికి ఉపయోగించే షీట్లు, స్ట్రాలు, టీ కప్పులు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, పౌచ్ ల తయారీ, అమ్మకం, ఉపయోగం, నిల్వ, రవాణా , పంపిణీపై పూర్తి నిషేధం

31.

తెలంగాణ

నిషేధం లేదు

 

నిషేధం లేదు

32. 

త్రిపుర

పూర్తి నిషేధం

నోటిఫికేషన్ నెం: F.B(30)/DSTE/ENV/Pt-II/1679-97 తేదీ 10.03.2015

మ్యాగజైన్ , ఇన్విటేషన్/గ్రీటింగ్ కార్డులతో సహా ఏదైనా పుస్తకాన్ని ప్యాక్ చేయడానికి లేదా కవర్ చేయడానికి ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లను (పాలిప్రొపైలిన్, నాన్-నేవెన్ ఫ్యాబ్రిక్ రకంతో సహా) ప్లాస్టిక్ ట్యూబ్ అమ్మడం, ఉపయోగించడం, నిల్వ చేయడం, రవాణా  దిగుమతిని,  పూర్తిగా నిషేధించారు. 

33.

ఉత్తర ప్రదేశ్

పూర్తి నిషేధం

తేదీ 15-07-2018

నోటిఫికేషన్ నెం: 1056/9-7-18-29 (లక్నో) /18

 

50 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీబ్యాగుల , ఇంకా ప్లాస్టిక్, ధర్మా కొల్ తో తయారు చేసిన కప్పులు, గిన్నె, ప్లేట్ల తయారీ,అమ్మకం, వినియోగం, నిల్వ, రవాణా, దిగుమతి ని నిషేధించారు.  

34.

ఉత్తరాఖండ్

పూర్తి నిషేధం

తేదీ 25-01-2017

88/x-3-17-13(II)/2001

ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ తో తయారు చేసిన ప్లాస్టిక్ క్యారీబ్యాగులు, కప్పులు, గిన్నె, కంటైనర్, టంబ్లర్లు , గ్లాసులు  ప్లేట్ల తయారీ, అమ్మడం, ఉపయోగించడం, నిల్వ చేయడం, రవాణా, దిగుమతి పై నిషేధం. 

35.

వెస్ట్ బెంగాల్

 

 

పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో, కొన్ని హెరిటేజ్ , పర్యాటక ప్రదేశాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల  నియంత్రిత ఉపయోగం అమ్మకాలు

 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు  వెల్లడించారు.

 

***


(Release ID: 2037218) Visitor Counter : 172


Read this release in: English , Urdu , Bengali , Tamil