బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023-24 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు, లిగ్నైట్ గనుల స్టార్ రేటింగ్ సంబంధించి స్వీయ మూల్యాంకన గడువును పొడిగించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 24 JUL 2024 6:55PM by PIB Hyderabad

2023-24 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు, లిగ్నైట్ గనుల స్టార్ రేటింగ్ కోసం స్వీయ మూల్యాంకనం (సెల్ఫ్ ఎవల్యూషన్) సమర్పించడానికి గడువును 31.07.2024 వరకు పొడిగించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. గరిష్ట భాగస్వామ్యం కోసం అదేవిధంగా, మరిన్ని గనులు నమోదు చేసుకోవడానికి, స్వీయ మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయడానికి  15.07.2024 నుండి పొడిగించారు. గనుల మదింపు ప్రక్రియ చేపట్టేందుకు 7 రకాల ప్రమాణాలను చూడటం జరుగుంది. మైనింగ్ నిర్వహణలు, పర్యావరణ సంబంధిత ప్రమాణాలు, టెక్నాలజీల వినియోగం, ఉత్తమ మైనింగ్ పద్ధతులు, ఆర్థిక పనితీరు, పునరావాసం, కార్మిక-సంబంధిత సమ్మతి, భద్రత అంశాల ఆధారంగా మదింపు చేయడం స్టార్ రేటింగ్ విధాన లక్ష్యం.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ 29 మే 2024 వ తేదీన  జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కోసం స్టార్ రేటింగ్ పోర్టల్ 01.06.2024 న ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్, స్వీయ మూల్యాంకనం సమర్పణకు చివరి తేదీ 15.07 2024 గా నిర్ణయించారు. ఈ ఏడాది గనుల పరిశ్రమ నుంచి గణనీయమైన ప్రతిస్పందన వచ్చింది. 14.07.2024 నాటికే 388 గనుల సంస్థలు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నాయి, ఇది 2018-19 లో కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న సంఖ్య.

గనుల మధ్య పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం కోసం, అధునాతన మైనింగ్ సాంకేతికతను వినియోగించడం, ఆర్థిక విజయాల ఆధారంగా వాటి అత్యుత్తమ పనితీరును గుర్తించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ 2018-19 నుండి బొగ్గు, లిగ్నైట్ గనుల కోసం స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రారంభించింది.

ఇందులో పాల్గొనే గనుల సంస్థలు సమగ్ర స్వీయ మూల్యాంకన ప్రక్రియను చేపట్టాలి. దీనిని 31, జూలై, 2024 నాటికి పూర్తి చేయాలి. స్వీయ మూల్యాంకనం పూర్తయిన తరువాత, ఒక కమిటీ నిర్వహించే తనిఖీ ద్వారా అత్యధిక స్కోరింగ్ పొందిన గనులలో మొదటి 10% తదుపరి ధ్రువీకరణ కోసం ఎంపిక చేయబడతాయి. మిగిలిన 90 శాతం గనులను కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ కార్యాలయాలు ఆన్ లైన్ లో సమీక్షిస్తాయి. అక్టోబర్ 31, 2024 నాటికి సమగ్ర సమీక్ష పూర్తవుతుంది. అనంతరం పారదర్శకత, నిష్పక్షపాతంగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ తుది సమీక్ష నిర్వహించి 31 జనవరి 2025 లోగా ఫలితాలను విడుదల చేస్తుంది.

బొగ్గు మరియు లిగ్నైట్ మైనింగ్ లో పోటీతత్వాన్ని పెంపొందించడం, బాధ్యతాయుతమైన మైనింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా దేశంలో  మైనింగ్ పనితీరు, సుస్థిరతను పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గని యొక్క సమగ్ర మూల్యాంకనం ఆధారంగా అత్యధికంగా ఫైవ్ స్టార్ నుండి అత్యల్పంగా నో స్టార్ వరకు రేటింగ్స్ ఇస్తారు.

 

***


(Release ID: 2036721) Visitor Counter : 49


Read this release in: Tamil , English , Hindi , Hindi_MP