వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో ఏప్రిల్ 2024-జూన్ 2024 మధ్య నెలవారీ ప్రాతిపదికన దాదాపు 1,07,966 ఫిర్యాదులు నమోదు


జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా 17 భాషల్లో ఫిర్యాదులను నమోదు చేసుకునే వీలు

Posted On: 24 JUL 2024 4:00PM by PIB Hyderabad

వినియోగాదారు వ్యవహారాల విభాగం మెరుగులు దిద్దిన జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్(ఎన్‌సీహెచ్).. కోర్టుకు వెళ్లే ముందు దశలో ఉన్న ఫిర్యాదుల పరిష్కారానికి ఏకైక కేంద్రంగా అవతరించింది. 17 భాషల్లో (అంటే హిందీ, ఇంగ్లీష్, కశ్మీరీ, పంజాబీ, నేపాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మైథిలీ, సంతాలీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, మణిపురి) టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఓమ్నీ ఛానల్ ఐటీ సాంకేతికతతో కూడిన కేంద్ర పోర్టల్ అయిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం (ఇంగ్రామ్) తో పాటు వాట్సాప్, ఎస్ఎంఎస్, మెయిల్, ఎన్‌సీహెచ్ యాప్, వెబ్ పోర్టల్, ఉమాంగ్ యాప్ వంటి వివిధ మార్గాల ద్వారా తమ సౌలభ్యాన్ని బట్టి వినియోగదారులు ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

ఎన్‌హీహెచ్‌లో తీసుకొచ్చిన పరివర్తనాత్మక మార్పులు, సాంకేతిక అప్‌గ్రేడేషన్ వల్ల కాల్స్ నిర్వహణ సామర్థ్యం పెరిగింది. గత కొన్నేళ్లుగా ఎన్‌సీహెచ్‌కు వచ్చే కాల్స్ సంఖ్య పెరిగింది. ఫిర్యాదులను నమోదు చేయడానికి వినియోగదారు వ్యవహారాల విభాగం అధికారులు తీసుకున్న చర్యలు వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహించాయి. దీనితో ఎన్‌సీహెచ్‌‌లో నమోదైన ఫిర్యాదుల సంఖ్య పెరిగింది.

 

నెలవారీగా సగటున జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదైన ఫిర్యాదుల వివరాలు

 

ఆర్థిక సంవత్సరం

నెలవారీగా వచ్చిన సరాసరి ఫిర్యాదులు

ఏప్రిల్'24 ~ జూన్'24

(2024~ 25)

1,07,966

2023 ~ 2024

1,02,976

2022 ~ 2023

83,832


 

ఈ-కామర్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, డిజిటల్ పేమెంట్స్, టెలికాం, చట్ట, రిటైల్ అవుట్లెట్స్, బ్రాడ్‌బ్యాండ్,  ఇంటర్నెట్, ఏజెన్సీ సేవలు తదితర విస్తృత శ్రేణికి సంబంధించిన ఫిర్యాదులను జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ స్వీకరిస్తోంది. 


క్లిష్టమైన కేసుల విషయంలో అవసరమైన న్యాయ, సాంకేతిక రంగ పరిజ్ఞానం, నైపుణ్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వర్క్‌షాప్‌ల ద్వారా తమ సిబ్బందికి క్రమం తప్పకుండా జాతీయ వినియోగాదుల హెల్ప్‌లైన్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందిస్తోంది. దీనివల్ల ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లు, వినియోగదారుల హక్కులకు సంబంధించిన సమస్యల గురించి హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్లు వినియోగదారులకు సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే కాకుండా.. సమర్థవంతమైన కేసు నిర్వహణ, సమాచార భద్రత, గోప్యత ఉంటోంది. 

 

మధ్యవర్తిత్వ చట్టం, 2023 ప్రకారం, కోర్టులో ఏదైనా చట్టపరమైన చర్యలను ప్రారంభించడానికి ముందే ఏదైనా సివిల్, వాణిజ్య వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారించుకునేందుకు ఇరు వర్గాలకు అవకాశం కల్పిస్తుంది.  తద్వారా కోర్టు వెలుపలనే వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బిఎల్ వర్మ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

***


(Release ID: 2036713)