బొగ్గు మంత్రిత్వ శాఖ

ఫ‌స్ట్ మైల్ క‌నెక్టివిటీ ప్రాజెక్టులు

Posted On: 22 JUL 2024 3:54PM by PIB Hyderabad

2019 ఆగ‌స్టుకు ముందు ఏడాదికి 151 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యం కలిగిన 20 ఫ‌స్ట్ మైల్ క‌నెక్టివిటీ(ఎఫ్ఎంసీ) ప్రాజెక్టుల‌ను కోల్ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌) స్థాపించింది. 2019 ఆగ‌స్టు నుంచి సీఐఎల్ అద‌నంగా ఏడాదికి 837.5 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యం ఉండేలా 72 ఫ‌స్ట్ మైల్ క‌నెక్టివిటీ(ఎఫ్ఎంసీ) ప్రాజెక్టుల‌ను గుర్తించింది. ఈ 72 ప్రాజెక్టుల్లో ఏడాదికి 200.5 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యం ఉన్న 15 ప్రాజెక్టులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 35 ఎఫ్ఎంసీ ప్రాజెక్టులు ప్రారంభ‌మై ప‌ని చేస్తున్నాయి.

సీఐఎల్ గుర్తించిన 72 ఎఫ్ఎంసీ ప్రాజెక్టుల మొత్తం అంచ‌నా వ్య‌యం రూ.27,750 కోట్లు. ఈ వ్య‌యాన్ని సీఐఎల్ సొంత వ‌న‌రుల‌తో చేప‌డుతోంది.

కేంద్ర బొగ్గు గ‌నుల మంత్రిత్వ శాఖ మూడు కేంద్ర రంగ ప‌థ‌కాలు నిర్వ‌హిస్తోంది. అవి.. (1) బొగ్గు, లిగ్నైట్ అన్వేష‌ణ‌, (2) ప‌రిశోధ‌న, అభివృద్ధి, (3) ప‌రిర‌క్ష‌ణ‌, బొగ్గు గ‌నుల్లో భ‌ద్ర‌త‌, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి. ఈ ప‌థ‌కాల వివ‌రాలు దిగువ‌న ఉన్నాయి:-

 

Sl. No.

ప‌థ‌కం పేరు

ప‌థ‌కం ఉద్దేశం

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో
బ‌డ్జెట్ కేటాయింపు (రూ.కోట్ల‌లో)

1

బొగ్గు, లిగ్నైట్ అన్వేష‌ణ‌

భౌగోళిక నివేదిక‌ల‌(జీఆర్‌)ను తయారు చేయ‌డం ద్వారా దేశంలో బొగ్గు, లిగ్నైట్ వ‌న‌రుల గురించి వివ‌రించ‌డం, అంచ‌నాలు త‌యారుచేయ‌డం, విలువ‌క‌ట్ట‌డం. కొత్త బొగ్గు గ‌నుల‌ను వేలం నిర్వ‌హించ‌డానికి, కేటాయించ‌డానికి ఈ నివేదిక‌ల వినియోగం.

730.00

2

ప‌రిశోధ‌న, అభివృద్ధి

కొత్త‌, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిశోధ‌న ప్రాజెక్టుల‌కు ప్రణాళిక త‌యారుచేయ‌డం, నిధులు వెచ్చించ‌డం, నిర్వ‌హించ‌డంతో పాటు ప‌రిశోధ‌న ప్రాజెక్టుల అమ‌లును ప‌ర్య‌వేక్షించ‌డం.

21.00

3

ప‌రిర‌క్ష‌ణ‌, బొగ్గు గ‌నుల్లో భ‌ద్ర‌త‌, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి

బొగ్గు సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ఇసుక పోయ‌డం వంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా బొగ్గుగ‌నుల్లో భ‌ద్ర‌త‌ను చూసుకోవ‌డం, ర‌వాణా మౌళిక స‌దుపాయాలు అభివృద్ధి చేయ‌డం.

 

92.50

 

వీటికి అద‌నంగా  ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు(పీఎస్‌యూ), ప్రైవేటు రంగంలో బొగ్గు/లిగ్నైట్ గాసిఫికేష‌న్ ప్రాజెక్టుల్లో వ‌య‌బిలిటీ గ్యాప్ ఫండింగ్‌(వీజీఎఫ్‌)  కోసం రూ.8,500 కోట్ల వ్యయంతో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద ఉన్న ఈ మూడు విభాగాల్లో ప్రాజెక్టుల‌కు వ‌ర్తిస్తుంది.

మొద‌టి విభాగం, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల కోసం రూ.4,050 కోట్ల నిధులు ఉంటాయి. ఇందుకోసం సంస్థ‌లు నిధుల స‌హాయానికి ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేయ‌వ‌చ్చు. ఎంపిక చేసిన మూడు ప్రాజెక్టుల‌కు గ‌రిష్ఠంగా రూ.1,350 కోట్లు లేదా మొత్తం ప్రాజెక్టు వ్య‌యంలో 15 శాతంలో ఏది త‌క్కువ అయితే అంత మొత్తాన్ని వ‌య‌బిలిటి గ్యాప్ ఫండ్‌(వీజీఎఫ్‌) కింద మంజూరు చేస్తుంది.

రెండో విభాగం, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, ప్రైవేటు సంస్థ‌ల కోసం రూ.3,850 కోట్ల నిధులు కేటాయిస్తుంది. గ‌రిష్ఠంగా రూ.1,000 కోట్లు లేదా మొత్తం ప్రాజెక్టు వ్య‌యంలో 15 శాతంలో ఏది త‌క్కువ అయితే అంత మొత్తాన్ని వీజీఎఫ్ కింద కేటాయిస్తుంది.

మూడో విభాగం, చిన్న త‌ర‌హా ప్రాజెక్టులు లేదా ప్ర‌ద‌ర్శ‌న కోసం ఉద్దేశించిన‌ది. ఇందులో గ‌రిష్ఠంగా రూ.100 కోట్లు లేదా మొత్తం ప్రాజెక్టు వ్య‌యంలో 15 శాతంలో ఏది త‌క్కువ అయితే అంత మొత్తాన్ని వీజీఎఫ్ కింద మంజూరు చేస్తుంది.

కేంద్ర బొగ్గుగ‌నుల శాఖ మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం(22.07.2024) నాడు ఈ స‌మాచారాన్ని రాత‌పూర్వ‌క స‌మాధానంగా ఇచ్చారు.

***



(Release ID: 2035863) Visitor Counter : 6


Read this release in: English , Hindi , Hindi_MP