బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు డిమాండ్, సరఫరా మధ్య అంతరం

Posted On: 22 JUL 2024 3:56PM by PIB Hyderabad

దేశంలో బొగ్గు డిమాండ్‌లో ఎక్కువ భాగం స్వదేశీ ఉత్పత్తి/సరఫరా ద్వారా తీరుతోంది. 2022-23లో 1115.04 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు డిమాండ్ 2023-24లో 1233.86 మిలియన్ టన్నులకు పెరిగింది. పెరిగిన బొగ్గు డిమాండ్‌తో పాటు దేశీయ బొగ్గు ఉత్పత్తి కూడా పెరిగింది. 2022-23లో 893.19 మిలియన్ టన్నులుగా ఉన్న దేశీయ బొగ్గు ఉత్పత్తి 2023-24లో 11.65 శాతం పెరిగి 997.26 మిలియన్ టన్నులకు చేరుకుంది.

ముందు ఏడాదితో పోలిస్తే  2023-24లో బొగ్గు డిమాండ్ 11 శాతం పెరిగింది. 2029-30 నాటికి బొగ్గు డిమాండ్ 1.5 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా. తదనుగుణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దేశంలో అత్యవసరం కాని బొగ్గు దిగుమతులను నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోంది. సింగిల్ విండో క్లియరెన్స్..  తుది వినియోగ ప్లాంట్ల అవసరాన్ని తీరుస్తూ వార్షిక ఉత్పత్తిలో 50% వరకు క్యాప్టీవ్ మైన్స్ విక్రయించుకునేందుకు వీలుగా 1957 గనులు, ఖనిజాల చట్టం (అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి సవరణ, గని అభివృద్ధి ఆపరేటర్(ఎండీఓ) పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి, భారీ ఉత్పత్తినిచ్చే సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని పెంచడం.. కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ.. వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు క్షేత్రాలను  ప్రైవేట్ కంపెనీలు/ పీఎస్‌యూలకు వేలం వేయటం వంటి కొన్ని ప్రధాన చర్యలు ఇందులో ఉన్నాయి. వాణిజ్య మైనింగ్ కోసం 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అనుమతించారు.

ప్రస్తుత దిగుమతి విధానం ప్రకారం, బొగ్గును ఓపెన్ జనరల్ లైసెన్స్ (ఓజీఎల్) కింద ఉంది. వర్తించే సుంకాన్ని చెల్లించి వినియోగదారులు తమకు నచ్చిన దగ్గరి నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవచ్చు.

 

ప్రస్తుతం దేశంలో బొగ్గు అవసరాలు చాలా వరకు దేశీయ ఉత్పత్తి ద్వారానే తీరుతున్నాయి. అయితే దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత (ఐసీబీ) విద్యుత్ ప్లాంట్లు ఉపయోగించే కోకింగ్ బొగ్గు, ఆంత్రాసైట్, తక్కువ బూడిదనిచ్చే  థర్మల్ బొగ్గు వంటి కొన్ని అధిక-గ్రేడ్‌ల బొగ్గు దేశీయ ఉత్పతి అందుబాటులో లేనందున దిగుమతి చేసుకోవడం తప్పనిసరి. 

 

2019 నుండి ఇప్పటి వరకు అంటే 2024 జూన్ వరకు రాష్ట్రాల వారీగా, సంవత్సర వారీగా క్యాప్టీవ్/వాణిజ్య బొగ్గు క్షేత్రాల నుండి ఉత్పత్తి ఈ క్రింది విధంగా ఉంది:

(మిలియన్ టన్నులలో)


 

రాష్ట్రం

2019-20

2020-21

2021-22

2022-23

2023-24

2024-25

(till June)

ఛత్తీస్‌గఢ్

17.77

17.75

21.20

27.78

31.47

10.79

జార్ఖండ్

10.48

11.25

18.07

29.77

40.21

8.48

మధ్యప్రదేశ్

21.68

21.54

22.30

24.27

32.29

8.58

మహారాష్ట్ర

0.56

0.18

0.53

0.57

0.32

0.25

ఒడిశా

2.56

6.13

16.89

25.03

31.18

9.29

తెలంగాణ

1.66

2.02

2.21

2.50

2.50

0.61

పశ్చిమ బెంగాల్

4.16

4.20

4.42

6.76

9.14

1.54

మొత్తం

58.88

63.08

85.62

116.68

147.12

39.53

 

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ఇప్పటికే తన అనుబంధ సంస్థల్లోని గనుల్లో కంటిన్యుయస్ మైనర్ (సీఎం), హైవాల్ (హెచ్‌డబ్ల్యూ) మైనర్, పవర్డ్ సపోర్ట్ లాంగ్వాల్ (పీఎస్ఎల్‌డబ్ల్యూ) ఉపయోగించి భారీ స్థాయి ఉత్పత్తి(ఎంపీటీ- మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ)ని ఆర్థికంగా సాధ్యమైన చోట్ల ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈసీఎల్ (11), ఎస్ఈసీఎల్ (15), డబ్ల్యూసీఎల్ (3), సీసీఎల్ (1) లలో 30 సీఎంలు(కంటిన్యుయస్ మైనర్లు) పనిచేస్తున్నాయి. లాంగ్ వాల్ 2 గనుల్లో పనిచేస్తుంది. ఇవి ఈసీఎల్, బీసీసీఎల్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌ఈసీఎల్‌లో 2, ఈసీఎల్‌లో 2, బీసీసీఎల్‌లో 1 హెచ్‌డబ్ల్యూలు.. అనగా మొత్తం 5 హెచ్‌డబ్ల్యూలు పనిచేస్తున్నాయి.

 

***


(Release ID: 2035775) Visitor Counter : 97
Read this release in: English , Urdu , Hindi , Hindi_MP