కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎం 2 ఎం రంగంలో క్లిష్టమైన పరికరాలకు సంబంధించిన సమస్యలు, ఎం 2 ఎం సిమ్‌ల యాజమాన్య బదిలీ సంబంధిత సమస్యలపై ట్రాయ్ సంప్రదింపుల పత్రం పై వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీ పొడిగింపు

Posted On: 22 JUL 2024 6:20PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) 24.06.2024న ‘ఎం 2 ఎం రంగంలో క్లిష్టమైన సేవలు, ఎం 2 ఎం సిమ్‌ల యాజమాన్య బదిలీ సంబంధిత సమస్యలు’ అనే అంశంపై ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఈ సంప్రదింపుల పత్రం లో ప్రస్తావించిన అంశాలపై లబ్ధిదారులు లిఖిత వ్యాఖ్యలను  చివరి తేదీ  22.07.2024 లోగా , కౌంటర్ వ్యాఖ్యలను  చివరి తేదీ 05.08.2024లోగా సమర్పించాలని  నిర్ణయించారు.

వ్యాఖ్యలు సమర్పించడానికి సమయం పొడిగించమని కొందరు లబ్ధిదారులు చేసిన అభ్యర్థనల దృష్ట్యా, లిఖిత వ్యాఖ్యలు మరియు కౌంటర్ వ్యాఖ్యలు సమర్పించడానికి చివరి తేదీని వరుసగా 19.08.2024 మరియు 02.09.2024 వరకు పొడిగించాలని నిర్ణయించారు.

వ్యాఖ్యలు/కౌంటర్-వ్యాఖ్యలు, ఎలక్ట్రానిక్ రూపంలో, ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్స్, స్పెక్ట్రం & లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది గారికి advmn@trai.gov.in పంపవచ్చు. ఏదైనా స్పష్టీకరణ/సమాచారం కోసం, ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్స్, స్పెక్ట్రం & లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది గారిని టెలిఫోన్ నంబర్ +91-11-20907758 పై  సంప్రదించవచ్చు.

 

***


(Release ID: 2035760)
Read this release in: English , Urdu , Hindi , Hindi_MP