మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, చత్తీస్ గఢ్ , జార్ఖండ్ రాష్ట్ర ,జిల్లా నోడల్ అధికారులకు సాఫ్ట్ వేర్, బ్రీడ్స్ (జాతుల) పై 21వ పశు గణన ప్రాంతీయ శిక్షణ ను నిర్వహించిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ


భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న పశువులు దేశ ఆర్థిక వ్యవస్థ , ఆహార భద్రతలో పశుసంవర్ధక రంగం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తున్నాయి: ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్

Posted On: 20 JUL 2024 6:42PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (డి ఎ హెచ్ డి) , ఆతిథ్య ఒడిశా రాష్ట్రం సంయుక్తంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర, జిల్లా నోడల్ ఆఫీసర్ల  (ఎస్ ఎన్ ఒ / డి ఎన్ ఒ ) కు సాఫ్ట్ వేర్ (మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్/ డ్యాష్ బోర్డు), బ్రీడ్స్ పై 21వ పశుగణన ప్రాంతీయ శిక్షణను నిర్వహించాయి. 2024 సెప్టెంబర్-డిసెంబర్ లో జరగనున్న 21వ పశుగణన నిర్వహణ కోసం కొత్తగా ప్రారంభించిన మొబైల్, వెబ్ అప్లికేషన్లపై ఆయా రాష్ట్రాల రాష్ట్ర/ జిల్లా నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఒడిశాలోని పూరీలో ఈ వర్క్ షాప్ జరిగింది.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ బఘెల్ ఈ వర్క్ షాప్ ను ముఖ్య అతిథిగా ప్రారంభించారు.  ఒడిశా ప్రభుత్వ ఎఫ్ అండ్ ఎ ఆర్ డి  మంత్రి శ్రీ గోకులానంద మల్లిక్, పూరీ శాసనసభ్యుడు శ్రీ సునీల్ కుమార్ మొహంతి, ఒడిశా ప్రభుత్వ ఎహెచ్ అండ్ విఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ వశిష్ఠ ఐ సి ఎఆర్- ఎన్ బి ఎ జి ఆర్  డైరెక్టర్ డాక్టర్ బీపీ మిశ్రా, భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సలహాదారు (స్టాటిస్టిక్స్) జగత్ హజారికా, ఒడిశా పశుసంవర్ధక, వెటర్నరీ సైన్సెస్ డైరెక్టర్ రామశిస్ హజ్రా వర్క్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

ఈ వర్క్ షాప్ లో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్ పి సింగ్ ప్రసంగిస్తూ,  క్షేత్రస్థాయిలో సమగ్ర శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దేశంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే అత్యధిక పశుసంపద ఉందని, భారత ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రత లో పశుసంవర్ధక రంగం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని  చెప్పారు. పశు గణనను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని, సేకరించిన డేటా భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించడంలో, ఈ రంగంలో సవాళ్లను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

 

 

శ్రీమతి అల్కా ఉపాధ్యాయ వర్చువల్ విధానంలో 21వ పశుగణన విజయవంతం కావాలని శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పై పశుసంవర్ధక రంగం ప్రభావం, పశుసంవర్ధక రంగ ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యం పరంగా భారతదేశం స్థానం గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు.

 

పశుసంవర్ధక రంగంలో సుస్థిర పద్ధతుల ఏకీకరణ ఆవశ్యకతను శ్రీ గోకులానంద మల్లిక్ వివరించారు. పశుగణన తర్వాత పొందిన డేటా విశ్లేషణ మరియు తార్కిక వినియోగం భవిష్యత్తులో డిపార్ట్‌మెంటల్ విధానాలను రూపొందించడానికి, కార్యక్రమాలను అమలు చేయడానికి, అలాగే కొత్త పథకాలను సృష్టించడానికి , పశు పెంపకం రైతుల ప్రయోజనం కోసం bపశుసంవర్ధక రంగంలో ఉపాధిని సృష్టించడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. 

 

శ్రీ సురేష్ కుమార్ వశిష్ట్ తన ప్రసంగంలో,  పశువులను ‘పశు ధన్‘ గా పేర్కొనే సంపద, ఆస్తులుగా పోల్చారు, తన శాఖ ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా మానవ వనరుల అభివృద్ధి తరహాలో దాని పేరు ను ఇటీవల పశు వనరుల అభివృద్ధి శాఖగా  మార్చడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వం బీహార్ నుంచి పాల ఉత్పత్తిలో ఉత్తమ పద్ధతులను అవలంబించిందని, రైతుల ఆర్థిక సాధికారతకు పశువులు ఎలా దోహదం చేస్తున్నాయో, వారి డబ్బు అవసరాలను సమర్థవంతంగా తీరుస్తున్నాయో వివరించారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ  (డి ఎ హెచ్ డి ) అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెక్స్ క్రమబద్ధీకరించిన వీర్యం వాడకం గురించి ఆయన ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన ఆయన శిక్షణ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

 

పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ సలహాదారు (స్టాటిస్టిక్స్) శ్రీ జగత్ హజారికా మాట్లాడుతూ,  ఈ వర్క్ షాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఖచ్చితమైన,  సమర్థవంతమైన డేటా సేకరణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో డిపార్ట్ మెంట్  నిబద్ధతను నొక్కి చెప్పారు. పశుసంవర్ధక రంగం భవిష్యత్తు విధానాలు , కార్యక్రమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే 21వ పశుగణన విజయవంతం కావడానికి భాగస్వాములందరికి సమిష్టి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు.  పశు గణన విజయవంతం కావడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

 

ఈ వర్క్ షాప్ లో పశుసంవర్ధక గణాంక విభాగం ద్వారా 21వ పశుగణన పై సంక్షిప్త వివరణ మొదలుకొని, గణనలో కవర్ చేయాల్సిన జాతుల వివరాలపై ఐసిఎఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ బిఎజిఆర్) కు చెందిన శ్రీ బిపి మిశ్రా, ఆయన బృందం ద్వారా వివరణాత్మక ప్రజంటేషన్ వరకు పలు సెషన్ లు నిర్వహించారు. ఖచ్చితమైన జాతిని గుర్తించడం వివిధ పశుసంపద రంగ కార్యక్రమాలలో ఉపయోగించే ఖచ్చితమైన గణాంకాలను తయారు చేయడానికి  , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డి జి ) నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఎఫ్) కోసం ఎంతో కీలకం.

 

వర్క్ షాప్ లో భాగంగా భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన సాఫ్ట్ వేర్ బృందం 21 వ పశుగణన కు సంబంధించిన మెథడాలజీలు, లైవ్ అప్లికేషన్‌పై రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు వివరణాత్మక సెషన్‌ లలో మొబైల్ అప్లికేషన్, డ్యాష్ బోర్డు సాఫ్ట్ వేర్ పై శిక్షణ ఇచ్చింది. ఈ నోడల్ అధికారులు ఎన్యూమరేటర్లకు ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.

 

పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలోని పశుసంవర్ధక గణాంక విభాగం సంచాలకులు శ్రీ వి.పి.సింగ్ హాజరైన ప్రముఖులకు, భాగస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. పశుగణన కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

***



(Release ID: 2034820) Visitor Counter : 37


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil