సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సామాజిక అధికారిత శిబిరాన్ని’ బదాయూన్ లో రేపు ప్రారంభించనున్న శ్రీ బి.ఎల్. వర్మ

प्रविष्टि तिथि: 17 JUL 2024 4:09PM by PIB Hyderabad

సామాజిక అధికారిత శిబిరాన్ని’ కేంద్ర సామాజిక న్యాయం- సాధికారిత  శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ రేపు ఉత్తర్ ప్రదేశ్ లోని బదాయూన్ లో పోలీస్ లైన్ మైదానం లో  ప్రారంభించనున్నారు.

 

ఈ కార్యక్రమాన్ని ముందుగా గుర్తించిన 791 మంది దివ్యాంగులకు వివిధ సహాయక పరికరాలను పంపిణీ చేయడానికి  ఏర్పాటు చేయడమైంది.  భారత ప్రభుత్వ సామాజిక న్యాయం- సాధికారిత  మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగజనుల సాధికారిత విభాగం (డిఇపిడబ్ల్యుడి) అమలు చేస్తున్న ‘సహాయక సాధనాలుఉపకరణాల కొనుగోలు/అమరిక కోసం దివ్యాంగజనులకు సహాయం’ (ఎడిఐపి) పథకం లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు.

 

స్థానిక ప్రజాప్రతినిధులప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది.  శారీరిక అశక్తతతో బాధలు పడుతున్న వ్యక్తులకు సమానావకాశాలను అందించివారు ఫలప్రదమైనసురక్షయుక్తమైనగౌరవ పూర్వకమైన జీవనాన్ని గడపడానికి ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం దివ్యాంగులకు సాధికారిత ను కల్పించడం పట్ల ప్రభుత్వానికి గల నిబద్ధత కు నిదర్శనం.

 

దివ్యాంగులకు పంపిణీ చేయనున్న సహాయక ఉపకరణాలలో యంత్రం సాయంతో నడిచే మూడు చక్రాల వాహనాలుచేతులతో నడుపుకోగలిగిన మూడు చక్రాల వాహనాలుఉపయోగించిన తరువాత మడత పెట్టుకోదగ్గ చక్రాల కుర్చీలునడకకు సాయపడే వాకర్ లునడకలో ఊతాన్ని ఇచ్చే చేతికర్రలుచూపుడు శక్తి లోపించిన వారికి పనికి వచ్చే బ్రెయిలీ వస్తు సామగ్రిసెన్సర్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ సుగమ్య’ కేన్ లు,రోలెటర్ లుచెవుల వెనుక ధరించేందుకు తగిన వినికిడి శక్తినిచ్చే (బి.టి.ఇ,) పరికరాలుసి.పి. చైర్ లుస్మార్ట్ ఫోన్ లుకృత్రిమ అవయవాలు వంటివి  ఉన్నాయి.  లబ్ధిదారులకు ఆత్మనిర్భరతను ప్రసాదించడం,  వారిని సమాజ ప్రధాన స్రవంతిలో మమేకం చేసి శక్తివంతులుగా తీర్చిదిద్దడం ఈ ఉపకరణాల పంపిణీ ఉద్దేశం.

 

ఈ శిబిరాన్ని డిఇపిడబ్ల్యుడి కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ది ఆర్టిఫిషల్ లిమ్స్ మేన్యుఫేక్చరింగ్   కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎల్ఐఎమ్‌సిఒ) బదాయూన్ జిల్లా పాలన యంత్రాంగం సహకారంతో నిర్వహించనుంది. 

 

 

***


(रिलीज़ आईडी: 2034013) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Punjabi , Tamil