కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వివిధ సంస్థలు పాటించాల్సిన విధివిధానాలను ఇపిఎప్ఒ క్రమబద్ధీకరించడంతో, ఇపిఎఫ్ఒ నుంచి మినహాయింపు సదుపాయాన్ని వదులుకుంటున్న సంస్థల సంఖ్య పెరుగుదల.


గత రెండు సంవత్సరాలలో ఇపిఎఫ్ఒ మినహాయింపును 27 సంస్థలు వదులుకున్నాయి. దీనితో ఇపిఎఫ్ఒ లో అదనంగా 30,000 మంది ఉద్యోగుల ఖాతాలు వచ్చి చేరడంతోపాటు 1688.82 కోట్ల రూపాయలు ఇపిఎఫ్ఒ నిధికి సమకూరింది.

Posted On: 14 JUL 2024 3:37PM by PIB Hyderabad

గత రెండు సంవత్సరాలలో 27 సంస్థలు తమకుగల ఇపిఎఫ్ఒ మినహాయింపును వదులుకున్నాయి.దీనితో అదనంగా 30,000 మంది ఉద్యోగుల ఖాతాలు ఇపిఎఫ్లో చేరాయి. ఫలితంగా రూ 1688.2 కోట్ల రూపాయలు ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్ఒ)కి సమకూరింది.

ఇపిఎఫ్ఒ సేవలు మెరుగుపడడంతో మరిన్ని సంస్థలు ఇపిఎఫ్ఒ వాటికి కేటాయించిన మినహాయింపు సదుపాయాన్ని వదులుకుంటున్నాయి. అంతేకాదుతమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఇపిఎప్ఒ నే నేరుగా నిర్వహించాలని  ఆయా సంస్థలు కోరుకుంటున్నాయి. తద్వారా ఆయా సంస్థలు తమ కీలక కార్యకలాపాలపై  మరింత దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుంది.

సత్వర క్లెయిమ్ పరిష్కారాలు, ఎక్కువ రాబడిరేటుపటిష్టమైన పర్యవేక్షణసులభతర కార్యకలాపాలతోపాటు ఉద్యోగులకుయాజమాన్యాలకు ఇపిఎఫ్ఒ అందించే సేవలు నిరంతరం మెరుగుపడుతున్నాయి.

ఇపిఎఫ్ఒ కేంద్ర  కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ కింద పనిచేస్తోంది. ఈ సంస్థ ఇపిఎఫ్ఒ చట్టం కింద మినహాయింపు పొందిన సంస్థలు పాటించాల్సిన విధానాలను క్రమబద్ధీకరించేందుకు పలు చర్యలు తీసుకుంది.

వివిధ విధివిధానాలను ప్రమాణీకరించే కృషిలో భాగంగా ఇపిఎఫ్ఓ తొలిసారిగా విస్తృతమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు (ఎస్.ఒ.పి)లను మాన్యువల్స్ను ప్రచురించింది. ఇందులో ఇపిఎఫ్నుంచి మినహాయింపు పొందిన సంస్థలకు ఉపయోగపడే విధివిధానాలను పేర్కొంది. దీనికితోడుడిజిటలైజేషన్ దిశగా తీసుకున్న ముఖ్య మైన చర్యలలో భాగంగా,ఇపిఎఫ్ మినహాయిపును వదులుకునే సంస్ధలకు విధివిధానాలను మరింత సులభతరం చేసేందుకు త్వరలోనే కొత్త సాఫ్ట్వేర్పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ ఉద్యోగుల పిఎప్ కార్పస్ను నిర్వహించదలచిన సంస్థలు ఇపిఎఫ్ చట్టం సెక్షన్ 17 కింద  మినహాయింపును పొందాలి. దీనితో ఆయా సంస్థలు తమ స్వంత పిఎఫ్ ట్రస్ట్ నిర్వహించుకోవడానికి వీలుకలుగుతుంది. ఇలా ఇపిఎఫ్ఒనుంచి మినహాయింపు పొందిన సంస్థలుకనీసంఇపిఎఫ్ ఒ తన చందాదారులకు అందిస్తున్న  ప్రయోజనాలతొ సమానమైన ప్రయోజనాలను అందించాల్సిందిగా చట్టపరంగా నిర్దేశించడం జరిగింది. అలాగే చట్టంలో పేర్కొన్న విధంగా మినహాయింపులకు వర్తించే షరతులను పాటించాల్సి ఉంటుంది.

2023 మార్చి 31 నాటికి ఇపిఎఫ్ఒ నుంచి మినహాయింపు పొందిన సంస్థలు 1002 ఉన్నాయి. ఇవి నిర్వహిస్తున్న కార్పస్  విలువ రూ 3,52,000 కోట్లు కాగా సభ్యుల సంఖ్య 31,20,323.

ఇపిఎఫ్ఒ తన స్టేక్ హోల్డర్లపై మరింత దృష్టి పెట్టడంప్రొఫెషనల్గా నిర్వహిస్తున్న ఫండ్ కారణంగా  సభ్యుల రాబడి క్రమంగా పెరగుతుండడం వంటి కారణాలతోఇపిఎఫ్ఒ మినహాయింపులను వదులుకునే ట్రెండ్ పెరుగుతోంది.

***



(Release ID: 2033534) Visitor Counter : 9