భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్ర సంపదను సద్వినియోగం చేసుకునే నీలి ఆర్థికాభివృద్ధిపై భారత-నార్వే సహకారాన్ని సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి భారత్ లో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్ నేతృత్వం

" మన సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా బ్లూ ఎకానమి (బిఈ)పై జాయింట్ టాస్క్ ఫోర్స్ (జేటీఎఫ్) బలోపేతం అవుతుంది" అని స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం సముద్ర సంపద అభివృద్ధిలోను, సముద్ర అన్వేషణలోను భారతదేశాన్ని ముందుకు
తీసుకెళ్తోంది : డాక్టర్ సింగ్

"నార్వే దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. దానిని విస్తృతంగా ప్రామాణికంగా సద్వినియోగం చేసే సామర్థ్యం భారత్ కి ఉంది " నార్వే రాయబారి

"అంటార్కిటికాలో భారతదేశం, నార్వే పొరుగు దేశాలు" నార్వే రాయబారి తమ ప్రధానమంత్రి వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు

Posted On: 12 JUL 2024 6:54PM by PIB Hyderabad

సముద్ర వనరుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంతో బ్లూ-ఎకానమీపై ఇండో-నార్వే సహకారాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్,  భారతదేశంలోని నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్‌తో  ఈరోజు నార్త్ బ్లాక్‌లో సమావేశాన్ని నిర్వహించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన, పీఎంఓ, అణు శక్తి, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, “మన సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా బ్లూ ఎకానమీ (బిఈ)పై ఉమ్మడి టాస్క్ ఫోర్స్ (జేటీఎఫ్) బలోపేతం అవుతుంది." అని అన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సహ-అధ్యక్షులుగా ఉన్నారు.

 

‘భారత-నార్వే సమగ్ర సముద్ర నిర్వహణ, పరిశోధన కార్యక్రమాన్ని' కూడా గుర్తుచేసుకున్న మంత్రి, మన సహకారాన్ని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముగ్గురు భారతీయులను లోతైన సముద్రానికి పంపడం ద్వారా భారతదేశం లోతైన సముద్ర మిషన్‌లో భాగస్వామ్యం అవుతుందని, ఇది ఖనిజ అన్వేషణ, సముద్రగర్భ మైనింగ్‌లో అవకాశాల ద్వారాన్ని  తెరుస్తుందని ఆయన రాయబారితో అన్నారు.

"ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం భారతదేశం, సముద్ర సంపద, సముద్రాల అన్వేషణకు ప్రయాణాన్ని సుగమం చేసింది" అని భూ విజ్ఞాన మంత్రి వివరించారు. "బ్లూ ఎకానమీ రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధికి మంచి మార్గం వేస్తుంది" అని ఆయన అన్నారు. ఆర్కిటిక్-భారతదేశం మొట్టమొదటి ఉప-ఉపరితల అబ్జర్వేటరీలో, నార్వే, ఉత్తర ధ్రువం మధ్య దాదాపు సగం దూరంలో ఉన్న భారతదేశం ప్రధాన శాస్త్రీయ ప్రగతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఇండార్క్‌ని ప్రస్తావించారు.

భారతదేశంలోని నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనర్ మాట్లాడుతూ "నార్వేలో సాంకేతికత ఉంది, భారత దేశం స్కేలబిలిటీని కలిగి ఉంది" అని అన్నారు. భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధి లోని ప్రాజెక్ట్‌లకు మరింత సహకారం అందించడంతోపాటు సమర్థమైన మార్గదర్శకత్వం కోసం మంత్రి కృషిని ఆమె అభినందించారు.
 

మే-ఎలిన్ స్టెనర్ కొనసాగుతున్న మెరైన్, పోలార్ అధ్యయనాలతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగాలలో సంబంధాలను పెంచుకోవాలని ప్రతిపాదించారు. అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధన, పరిశోధనా సౌకర్యాల స్థాపనకు సంబంధించి భారతదేశం, నార్వే పొరుగు దేశాలుగా ఉన్నాయని వారి ప్రధాన మంత్రి వ్యాఖ్యలను రాయబారి గుర్తు చేసుకున్నారు.

 

డా. జితేంద్ర సింగ్ తన మంత్రిత్వ శాఖ ఇండో-నార్వే ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు మద్దతునిచ్చిందని స్పష్టం చేశారు.  దీని ద్వారా ముగ్గురు విద్యార్థులకు  ప్రభుత్వ నిధులతో ఆర్కిటిక్, అంటార్కిటిక్ గ్లేషియాలజీపై పని చేసేందుకు వీలు కల్పించారు.
కొచ్చిలో జరిగిన 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశంలో ధ్రువ శాస్త్రాలకు సంబంధించిన వివిధ రంగాలలో సన్నిహిత సహకారం కోసం నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్ సిపిఓఆర్ ), నార్వేపోలార్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్పిఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

***


(Release ID: 2033054) Visitor Counter : 77