మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

కేంద్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ త్రిపుర రాష్ట్ర జిల్లా నోడల్ అధికారులకు 21వ పశుసంవర్ధక గణనలో సాఫ్ట్‌వేర్ పై ప్రాంతీయ శిక్షణ


శిక్షణ సమయంలో పశువుల యొక్క జాతిని ఖచ్చితంగా గుర్తించాల్సిన ప్రాధాన్యతను వెల్లడించారు.

Posted On: 12 JUL 2024 5:02PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ (డిఎహెచ్‌డి), నాగాలాండ్ ప్రభుత్వ పశుసంవర్ధక పాడిపరిశ్రమ సంయుక్తంగా  21వ పశుగణనలో సాఫ్ట్‌వేర్‌పై ప్రాంతీయ శిక్షణ  (మొబైల్ అప్లికేషన్/ డ్యాష్‌బోర్డ్, బ్రీడ్స్) నిర్వహించింది.  నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు (డిఎన్ఓ/ ఎస్ఎన్ఓ) శిక్షణ ఇచ్చారు. రానున్న సెప్టెంబర్- డిసెంబర్ మధ్య నిర్వహించనున్న 21వ పశుగణన కోసం కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ లను అర్థం చేసుకోవడానికి ఈ నాలుగు రాష్ట్రాల డిఎన్ఓ/ ఎస్ఎన్ఓలకు శిక్షణ ఇచ్చారు. నాగాలాండ్‌లోని దిమాపూర్ దీనికి వేదికగా నిలిచింది. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా శ్రీ వై రేన్‌పోన్‌తంగ్ సోంపే, ఎన్ఎస్ఎస్, కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ పశుసంవర్ధక, పశువైద్య సేవల కార్యదర్శి హాజరై శిక్షణను ప్రారంభించారు.

ఈ 21వ పశుగణన శిక్షణా కార్యక్రమం పశుసంవర్థక శాఖకు చెందిన గణాంక విభాగం  గణన సంక్షిప్త వివరణలతో ప్రారంభమైంది. అనంతరం వరుస సెషన్లలో, జనాభా గణనలో భాగం చేయాల్సిన జాతుల వివరాలపై ఐసిఎఆర్-నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్ బిఎజిఆర్) వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చింది. పశు జాతి సరైన గుర్తింపు ఎందుకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందో ఈ శిక్షణ కార్యక్రమాల్లో అధికారులకు తెలిపారు. ఈ గణాంకాల ద్వారా వివిధ పశుసంపద ఆధారిత కార్యక్రమాలలో ఉపయోగించేందుకు, ఉత్పత్తి కోసం, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డిజి) చెందిన నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఎఫ్) కోసం కీలకమని శిక్షణలో తెలిపారు.

పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన సాఫ్ట్‌వేర్ బృందం ద్వారా 21వ పశుగణన యొక్క పద్ధతులు, లైవ్ అప్లికేషన్లపై శిక్షణలో వివరణాత్మక సెషన్లను నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు మొబైల్ అప్లికేషన్, డ్యాష్‌బోర్డు సాఫ్ట్‌వేర్ పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన నోడల్ అధికారులు, పశుగణన చేయనున్న అధికారులకు ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు.

నాగాలాండ్ ప్రభుత్వ ఆర్థిక, గణాంక శాఖ సంచాలకులు, శ్రీ నీదిల్హౌ కెడిట్సు, నాగాలాండ్ ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ అదనపు సంచాలకులు, వెటర్నరీ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ మోంచన్ షిత్రి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సంచాలకులు (గణాంక విభాగం) శ్రీ వి.పి.సింగ్, శ్రీ.  బీపీ మిశ్రా సంచాలకులు ఎన్‌బీఏజీఆర్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2033046) Visitor Counter : 24